మారుతి సుజుకి డెసెర్ట్ స్టోర్మ్‌లో పాల్గొంటున్న సిఎస్ సంతోష్

Posted By:

ఆఫ్-రోడింగ్ ప్రియులను అలరించేందుకు మారుతి సుజుకి సిద్ధమైంది. దేశీయ ఆఫ్-రోడింగ్ అడ్వెంచర్ మోటార్‌స్పోర్ట్ 'డెసెర్ట్ స్టోర్మ్' 13వ ఎడిషన్‌ను మారుతి సుజుకి ప్రారంభించింది. పదమూడవ ఎడిషన్ మారుతి సుజుకి డెసెర్ట్ స్టోర్మ్ ఫిబ్రవరి 23న న్యూఢిల్లీ నుంచి ప్రారంభమై సర్దార్‌శహర్, బికనెర్, జైసల్మర్ గుండా సాగి మార్చ్ 1న జైపూర్ వద్ద ముగుస్తుంది.

మొత్తం ఆరు రోజుల పాటు జరిగే మారుతి సుజుకి డెసెర్ట్ స్టోర్మ్‌లో దాదాపు 130 మందికి పైగా పాల్గొని, 2300 కిలోమీటర్లకు పైగా దూరాన్ని కవర్ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో భారతదేశంలో కెల్లా మొట్టమొదటి సారిగా అత్యంత ప్రమాదకరమైన డకార్ ర్యాలీలో పాల్గొన్న ఇండియన్ రైడర్ సిఎస్ సంతోష్ కూడా పాల్గొంటున్నాడు.

CS Santosh Taking Part In Maruti Suzuki Desert Storm

ఎక్స్‌ట్రీమ్, ఎండ్యురో ఎక్స్‌ప్లోర్, మోటో క్వాడ్ అనే మూడు విభాగాల్లో ఈ ర్యాలీ జరుగుతుంది. కొండలు గుట్టలు, ఇసుక ఎడారులు, ఎండిపోయిన సరస్సుల మీదుగా ఈ ర్యాలీ సాగుతుంది. భారతదేశంలో కెల్లా అత్యంత క్లిష్టమైన క్రాస్ కంట్రీ ర్యాలీలలో మారుతి సుజుకి డెసెర్ట్ స్టోర్మ్ కూడా ఒకటి.

ప్రపంచంలో కెల్లా అత్యంత ప్రమాదకరమైన, క్లిష్టమైన ర్యాలీలలో ఒకటైన డకార్ ర్యాలీ 2015లో సీజన్‌లో పాల్గొన్న 168 మంది అభ్యర్థులలో 36వ పొజిషన్‌లో నిలిచిన సిఎస్ సంతోష్ ఈ ఏడాది డెసెర్ట్ స్టోర్మ్‌లో సుజుకి జట్టు తరఫున పాల్గొననున్నారు.

English summary
Maruti Suzuki today announced the 13th edition of Desert Storm, which will be flagged off from the National Capital on February 23rd. Defending champion Santosh, the 31-year-old from Bengaluru who finished 36th overall out of 168 entries in the Dakar Rally, will be representing Team Suzuki. 

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark