భారతీయ మార్కెట్లోకి మారుతి సుజుకి నుండి వితారా కాంపాక్ట్ యస్‌యువి.
దేశీయ దిగ్గజ ఆటోమొబైల్ తయారీ దారులైన మారుతి సుజుకి భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లోకి తన కొత్త వితారా కాంపాక్ట్ యస్‌యువి కారును అందుబాటులోకి తీసుకురానుంది. అది కూడా దేశీయంగా తయారైనది ఏ మాత్రం కాదు.
Also Read: ప్రపంచ వ్యాప్తంగా అత్యంత పొడవైన సైకిల్: గిన్నిస్ రికార్డ్, వీడియో
దీనిని భారతీయ మార్కెట్లోకి దిగుమతి చేయనుంది. అయితే దీనిని ఇంతకు ముందు 2012లో జరిగిన ఢిల్లీ ఆటో ఎక్స్ పోలో ప్రదర్శించింది. మరియు 2014 లో జరిగిన ప్యారిస్ మోటార్ షోలో ప్రి-ప్రొడక్షన్ మోడల్‌గా ఐవి-4 అనే కాన్సెప్ట్‌తో దీనిని ప్రజర్శించారు.
Also Read: పాకిస్తాన్ సరిహద్దు గేటును స్కార్పియోతో బద్దలు కొట్టిన భారతీయుడు.
మరి మన దేశ మార్కట్లోకి విడుదలకు సిద్దమైన వితారా కారు గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలని ఉందా. అయితే క్రింద గల స్లైడ్స్ మీద ఓ లుక్కేసుకోండి.

ఇంజన్
వితారా కాంపాక్ట్ యస్‍యువి మూడు ఇంజన్ ఆప్షన్‌లలో రానుంది.
1.4-లీటర్ పెట్రోల్ ఇంజన్
1.6-లీటర్ డీజల్ ఇంజన్ మరియు
ఫియట్‌కు చెందిన 1.3-లీటర్ డీజల్ ఇంజన్‌లో లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

పోటి
మారుతి సుజుకి కాంపాక్ట్ యస్‌యువి అయిన వితారా మార్కెట్లోకి రాకముందే ప్రస్తుతం మార్కెట్లో గల హ్యుందాయ్ క్రెటా, రెనొ డస్టర్ మరియు త్వరలో విడుదవ కానున్న హోండా బిఆర్-వి కాంపాక్ట్ యస్‌యువి మోడల్స్ కు గట్టి పోటీ ఇవ్వనుంది.

నెక్సా షోరుమ్‌ల ద్వారా
మారుతి సుజుకి తన వితారా కాంపాక్ట్ యస్‌యువి కారును దేశ వ్యాప్తంగా గల నెక్సా షోరూమ్‌ల ద్వారా అందుబాటులోకి తీసుకురానుంది.

నెక్సా
ప్రస్తుతం నెక్సా షోరూమ్ ద్వారా మారుతి సుజుకి రెండు మోడల్లను అందుబాటులో ఉంచింది. ఇప్పుడు వచ్చిన వితారా కాంపాక్ట్ యస్‌యువి తో కలపి మొత్త మూడు వాహనాలను అందింస్తోంది.
ప్రస్తుతం నెక్సా షోరూమ్‌లో అందుబాటులో ఉన్న కార్లు యస-క్రాస్, బాలెనొ మరియు వితారా.

పొడవు
మారుతి సుజుకికు చెందిన వితారా కాంపాక్ట్ యస్‌యువి కారు కేవలం నాలుగు మీటర్ల పొడవు మాత్రమే ఉంది.

2016 ఆటో ఎక్స్ పో
మారుతి సుజుకి త్వరలో దేశీయంగా విడుదల చేయనున్న వితారా కాంపాక్ట్ యస్‌యువి కారును 2016 ఢిల్లీలో జరగనున్న ఆటో ఎక్స్‌పో లో ప్రదర్శించనుంది.

ధర
మారుతి సుజికి వితారా కాంపాక్ట్ యస్‌యువి ప్రారంభ ధర సుమారుగా రూ. 9 లక్షల నుండి 9.5 లక్షలు ఎక్స్-షోరూమ్ మద్య ఉండవచ్చని అంచనా.



Click it and Unblock the Notifications








