విడుదలకు సిద్దమైన మెర్సిడెస్-బెంజ్ ఫేస్ లిఫ్ట్ ఎ-క్లాస్
మెర్సిడెస్-బెంజ్ భారత దేశంలో కొత్త మోడల్స్‌ను విడుదల చేయడంలో తనకు ఏ లగ్జరీ కార్ల సంస్థ కూడా పోటి రాదు. ఎందుకంటే మెర్సిడెస్-బెంజ్ మన దేశంలో మార్కెట్లోకి దాదాపుగా 15 మోడల్స్‌ను విడుదల చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. మెర్సిడెస్-బెంజ్ తన ఫేస్‌లిఫ్ట్ ఎ-క్లాస్ విడుదలతో 15 మోడల్స్‌ను విడుదల చేసింది.
Also Read: దిమ్మతిరిగే ధరకు కారును విడుదల చేయనున్న మెర్సిడెస్ బెంజ్
జర్మనీకి చెందిన ఈ లగ్జరీ కార్ల సంస్థ భారతీయ మార్కెట్లో తన ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి విపరీతమైన ప్రయత్నాలు చేస్తోందని ఈ సందర్బంగా తెలుస్తోంది. అందులో భాగంగానే మెర్సిడెస్-బెంజ్ తమ 15 కొత్త ఉత్పత్తులను భారతీయ మార్కెట్లోకి విడుదల చేసింది. మరి ఈ 15 మోడల్ అయిన ఫేస్‌లిఫ్ట్ ఎ-క్లాస్ కారు గురించి తెలుసుకుందాం రండి.

విడుదల
మెర్సిడెస్-బెంజ్ డిసెంబర్ 8, 2015 న భారతీయ మార్కెట్లోకి తన ఫేస్ లిఫ్ట్ ఎ-క్లాస్ ను విడుదల చేయనుంది.

డిజైన్
మెర్సిడెస్-బెంజ్ ఈ ఎ-క్లాస్ కారులో బెంజ్ యొక్క డిజైన్ రూల్స్‌ను అనుకరించింది. అయితే డీజల్ మోడల్స్‌లో సిడిఐ అనే మోడల్ పేరుకు తరువాత "డి" అని వచ్చే విదంగా దీనిని తయారు చేశారు.

ఎక్ట్సీరియర్
ఈ ఎ-క్లాస్ కారులో ఎక్ట్సీరియర్ పరంగా పునరుద్దరించబడిన కొత్త బంపర్, హెడ్ ల్యాంప్స్, టెయిల్ ల్యాంప్స్ మరియు కొత్త ఎగ్జాస్ట్ పైపులను అందించారు.

ఇంటీరియర్
ఇందులో పునరుద్దరించబడిన కొత్త ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, కొత్త స్విచ్చ్‌లు, స్మార్ట్ ఫోన్ ఇంటిగ్రేషన్ గల కొత్త ఇన్పోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఇంజన్
ఇందులో అత్యంత శక్తివంతమైన 1,955కసీసీ గల నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది దాదాపుగా 120 బిహెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది.

డీజల్ వేరియంట్
మెర్సిడెస్-బెంజ్ ఈ ఫేస్‌లిఫ్ట్ కారులో పెట్రోల్‌తో పాటు డీజల్ ఇంజన్‌ను కూడా అందించింది. ఇందులో గల 2,143సీసీ గల డీజల్ ఇంజన్ దాదాపుగా 134 బిహెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ట్రాన్స్‌మిషన్
మెర్సిడెస్-బెంజ్ ఈ రెండు పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్‌లలో 7-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గేర్ బాక్స్‌ను అందుబాటులో ఉంచింది.

- మెర్సిడెస్ బెంజ్ మ్యూజియంలో ఉన్న టాప్-10 కార్లు
- ఈ బెంజ్ కారుకు డ్రైవర్ అక్కర్లేదు
- భారతీయ విపణిలోకి బియమ్‌డబ్ల్యూ నుండి 7-సిరీస్ లగ్జరీ కారు


Click it and Unblock the Notifications








