భారతీయ విపణిలోకి బియమ్‌‌‌డబ్ల్యూ నుండి 7-సిరీస్ లగ్జరీ కారు

By Anil

జర్మనీకి చెందిన దిగ్గజల కార్ల సంస్థ బియమ్‌డబ్ల్యూ మన దేశ లగ్జరీ కార్ల మార్కెట్లోకి తన 7-సిరీస్ కారును ప్రవేశపెట్టనుంది. ఇప్పుడిప్పుడే భారత దేశపు లగ్జరీ కార్ల సెగ్మెంట్ వ్యాపారాలు ఊపందుకుంటోంది. ఈ తరుణంలో ప్రముఖ లగ్జరీ కార్ల తయారి సంస్థలు అయిన మెర్సిడెస్ బెంజ్, ఆడి మరియు బియమ్‌‌డబ్ల్యూ లు భారతీ మార్కెట్లోకి నిరంతరం కొత్త ఉత్పత్తులను ప్రవేశ పెడుతున్నారు.
Also Read: 8 మోడళ్లకు కొత్త ధరలను ప్రకటించిన బీఎమ్‌డబ్ల్యూ ఇండియా

2016లో ఢిల్లో జరగనున్న ఆటో ఎక్స్ పోలో బియమ్‌డబ్ల్యూ తన 7-సిరీస్ లగ్జరీ కారును ప్రదర్శనకు ఉంచనుంది. అయితే దీనిని బియమ్‌డబ్ల్యూ 2015 ఫ్రాంక్ ఫర్ట్‌లో జరిగిన మోటార్ షోలో ప్రదర్శించింది. ఇక దీనిని 2016 ఢిల్లిలో విడుదల చేసేంత వరకు దీని గురించి తెలుసుకోకుండా వేచి ఉండగలరా? డ్రైవ్‌స్పార్క్ మన తెలుగు పాఠకుల కోసం ముందుగానే ఈ 7-సిరీస్ కారు గురించిన సమాచారం క్రింది కథనాల ద్వారా అందిస్తోంది.

ఇంజన్

ఇంజన్

బియమ్‌డబ్ల్యూ తన 7-సిరీస్ కారులో ఆరు సిలిండర్లు గల 730యల్‌డి డీజల్ ఇంజన్ కలదు. మన భారతీయ మార్కెట్ కోసం వీల్ బేస్ అత్యధికంగా ఉండే మోడల్ కారును అందివ్వనునన్నారు.

పవర్

పవర్

ఇందులో గల 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ద్వారా వెనుక చక్రాలకు ఇంజన్ విడుదల చేసే 261బిహెచ్‌పి పవర్‌ను అందిస్తుంది. మరియు ఇది లీటర్‌కు 22.2 కిలోమీటర్ల మైలేజ్‌‌ను అందిస్తుంది.

రాడార్ వ్యవస్థ

రాడార్ వ్యవస్థ

బియమ్‌డబ్ల్యూ అంతర్జాతీయంగా అందుబాటులోకి తీసుకురానున్న తమ 7-సిరీస్ కార్లలో రాడార్ వ్యవస్థను అందించింది. దీని ద్వారా క్రయిజ్ కంట్రోల్, లేన్ డిపార్చర్ వార్నింగ్ మరియు స్టాప్ లేదా గో వంటి పనులకు ఈ వ్యవస్థ ఎంత బాగా ఉపయోగపడుతుంది.

భారత్‌లో వ్యతిరేకత

భారత్‌లో వ్యతిరేకత

బియమ్‌డబ్ల్యూ ఇలాంటి వ్యవస్థతో భారతీయ మార్కెట్లోకి అందివ్వడానికి సిద్దంగా ఉంది. కాని భారత ప్రభుత్వం రాడార్ వ్యవస్థ వాడకంలో కఠినమైన రూల్స్ పెట్టింది. అందువలన బియమ్‌డబ్ల్యూ కార్లు రాడార్ వ్యవస్థతో వచ్చే అవకాశాలు దాదాపుగా లేనట్లే.

డిజైన్

డిజైన్

2016 లో ప్రదర్శించనున్న 7-సిరీస్ బియమ్‌డబ్ల్యు కారు బాహ్య డిజైన్ అత్భుతంగా ఉంది. బోల్డ్ గా ఉండే క్రొత్త గ్రిల్, మరియు లోపలికి ఎక్కువగా గాలిని గ్రహించే విధంగా డిజైన్ చేయబడిన న్యూ ఫ్రంట్ డిజైన్, రెండు పొగ గొట్టాలు మరియు అక్కడక్కడ క్రోమ్ పరికరాలు చూడటానికి దీనిని ఎంతో అందంగా డిజైన్ చేసారు.

ల్యాంప్స్

ల్యాంప్స్

ఇందులో ల్యాంప్స్‌ను కాస్త వెరైటిగా అందించారు.

  • యల్‌ఇడి ఫాగ్ ల్యాంప్స్
  • యల్‌ఇడి టెయిల్ ల్యాంప్స్
  • లేజర్ హెడ్ లైట్స్
  • మల్టీ మీడియా

    మల్టీ మీడియా

    బియమ్‌డబ్ల్యూ 7-సిరీస్ కారులో ఏ కారు పొండనటువంటి అతి పెద్ద హెడ్స్ అప్ డిస్ల్పే కలదు. ఐడ్రైల్ 5.0 గెస్ట్చర్ టచ్ గల హై రిజల్యూషన్ ఇన్ఫోటైన్‌మెంట్ కలదు.

     ఇతర ఫీచర్లు

    ఇతర ఫీచర్లు

    ఇందులో మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్, డ్రైవర్ డిస్ల్పే, ఆంబియంట్ లైట్ మరియు వక్తి గతంగా వెనుక సీట్లు సర్దుకునే అవకాశం ఇందులో కల్పించారు.

    ధర

    ధర

    బియమ్‌డబ్ల్యూ సంస్థ తమ 7-సిరీస్ మోడల్ కార్ల ధర దాదాపుగా రూ. 1.3 నుండి 1.8 కోట్ల మధ్య ఉండవచ్చు

    భారతీయ విపణిలోకి బియమ్‌‌‌డబ్ల్యూ నుండి 7-సిరీస్ లగ్జరీ కారు
    1. రెండు-మిలియన్ల ఢిపెండర్ ను తయారుచేసిన ల్యాండ్ రోవర్
    2. అందులో 'రేంజ్ రోవర్ ఎవోక్' నెం.1
    3. పక్షి ఢీ కొంటే పతనమవుతున్న విమానాలు: అస్సలు మర్మం ఎమిటి?

Most Read Articles

English summary
BMW To Launch All-New 7 Series At 2016 Auto Expo
Story first published: Tuesday, December 1, 2015, 14:46 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X