జిఎస్‌టి అనంతరం తగ్గిన ఫోర్డ్ కార్ల ధరలు

ఫోర్డ్ లైనప్‌లోని అన్ని మోడళ్ల మీద 4.5 శాతం వరకు ధరల తగ్గాయి. జిఎస్‌టి ప్రతిఫలాలను కస్టమర్లకు అందివ్వడంలో భాగంగానే ఫోర్డ్ తమ కార్ల మీద ధరలు తగ్గించింది.

By Anil

అమెరికాకు చెందిన దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ 'ఫోర్డ్' ఇండియా విభాగం దేశీయంగా ఉన్న తమ అన్ని వాహనాల మీద ధరలు తగ్గించింది. జిఎస్‌టి అమలైన నేపథ్యంలో జిఎస్‌టి ఆధారంగా ట్యాక్స్ లెక్కించి, తమ ఉత్పత్తుల మీద జిఎస్‌టి ప్రతిఫలాలను కొనుగోలుదారులకు అందిస్తోంది.

ఫోర్డ్ కార్ల మీద జిఎస్‌టి ప్రభావం

ఫోర్డ్ మీద తగ్గిన కార్ల ధరలు ఒక రాష్ట్రం నుండి మరో రాష్ట్రానికి మధ్య వ్యత్యాసం ఉండే అవకాశం ఉంది. ముంబాయ్‌లో ఫోర్డ్ తమ ఎండీవర్ ప్రీమియమ్ ఎస్‌యూవీ మీద గరిష్టంగా రూ. 3 లక్షల వరకు తగ్గించింది.

ఫోర్డ్ కార్ల మీద జిఎస్‌టి ప్రభావం

ఫోర్డ్ ఇండియా ప్రతినిధి మీడియాతో మాట్లాడుతూ, ఫోర్డ్ లైనప్‌లోని అన్ని మోడళ్ల మీద 4.5 శాతం వరకు ధరలు తగ్గించినట్లు తెలిపాడు. ఫోర్డ్ ఇండియా లైనప్‌లో ఫిగో హ్యాచ్‌బ్యాక్ నుండి ఎండీవర్ ప్రీమియమ్ ఎస్‌యూవీ వరకు వాహనాలు అందుబాటులో ఉన్నాయి. వీటి ధరల శ్రేణి రూ. 4.75 లక్షల నుండి రూ. 31.5 లక్షల వరకు ఎక్స్-షోరూమ్‌(ఢిల్లీ)గా ఉన్నాయి.

ఫోర్డ్ కార్ల మీద జిఎస్‌టి ప్రభావం

ఢిల్లీ మరియు కేంద్ర రాజధాని పరిధిలో ఫిగో మీద రూ. 2,000 లు, ఎకోస్పోర్ట్ మీద రూ. 8,000 లు మరియు ఎండీవర్ మీద రూ. 1.5 లక్షల వరకు ధర తగ్గింది. (ముంబాయ్‌లో ఎండీవర్ మీద రూ. 3 లక్షలు తగ్గింది).

ఫోర్డ్ కార్ల మీద జిఎస్‌టి ప్రభావం

ఫోర్డ్ ఇండియా తమ ఇకానికి స్పోర్ట్స్ కారు మస్టాంగ్ మీద ధరల తగ్గింపు గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. నూతన ట్యాక్స్ అనుగుణంగా ఇప్పటికే అన్ని కార్ల తయారీ సంస్థలు తమ ఉత్పత్తులకు నూతన ధరలను ఖరారు చేస్తున్నాయి. వాటిలో టయోటా మరియు మారుతి సుజుకి ఇప్పటికే జిఎస్‌టి ప్రతిఫలాలను కస్టమర్లకు అందిస్తున్నాయి.

More from DriveSpark

Article Published On: Tuesday, July 4, 2017, 10:52 [IST]
English summary
Ford Car Prices Decrease After GST Read In Telugu
Read more on: #ఫోర్డ్ #ford
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+