జిఎస్‌టి ప్రభావం: అన్ని టయోటా కార్ల మీద భారీగా తగ్గిన ధరలు

Written By:

జపాన్‌కు చెందిన దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ టయోటా మోటార్స్ జిఎస్‌టి ఆధారంగా తమ కార్ల మీద ట్యాక్స్ లెక్కించి అన్ని మోడళ్ల మీద ధరలు తగ్గించింది. జూలై 1, 2017 నుండి సవరించిన ధరలు అమల్లోకి వచ్చాయి. వివిధ నగరాల మధ్య సవరించిన ధరల్లో స్వల్ప వ్యత్యాసం ఉండే అవకాశం ఉంది. అయితే టయోటా వద్ద ఉన్న హైబ్రిడ్ ధరలు మాత్రం భారీగా పెరిగాయి.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
జిఎస్‌టి ప్రభావం టయోటా కార్ల మీద భారీగా తగ్గిన ధరలు

దేశ ఆర్థిక రాజధాని ముంబాయ్ నగరంగా సవరించిన ధరల మేరకు, టయోటా లివా మీద రూ. 65 వేలు, ఎటియోస్ మీద రూ. 75 లు తగ్గింది. అదే విధంగా ఎటియోస్ క్రాస్ మీద రూ. 61 వేలు మరియు టయోటా క్యామ్రీ పెట్రోల్ మీద రూ. 3.31 లక్షలు వరకు తగ్గుముఖం పట్టింది.

జిఎస్‌టి ప్రభావం టయోటా కార్ల మీద భారీగా తగ్గిన ధరలు

పాపులర్ సెల్లింగ్ మోడల్స్ అయిన ఇన్నోవా క్రిస్టా మీద 2 లక్షలు మరియు కరోలా ఆల్టిస్ మీద రూ. 2.08 లక్షల వరకు తగ్గింది. టయోటా వద్ద ఉన్న ఖరీదైన ఫార్చ్యూనర్ మరియు ప్రాడో ఎస్‌యూవీల మీద వరుసగా రూ. 3.26 లక్షలు మరియు 12.29 లక్షల వరకు తగ్గింది.

జిఎస్‌టి ప్రభావం టయోటా కార్ల మీద భారీగా తగ్గిన ధరలు

భారీ మొత్తం మీద ధరలు తగ్గడానికి గల కారణాలను పరిశీలిస్తే, జిఎస్‌టి ప్రకారం, నాలుగు మీటర్ల కన్నా ఎగ్గువ పొడవు మరియు 1,200సీసీ కెపాసిటి గల పెట్రోల్ మరియు 1,500సీసీ కెపాసిటి గల డీజల్ ఇంజన్‌ల కన్నా పెద్ద ఇంజన్‌ గల ఎస్‌యూవీల మీద ట్యాక్స్ 43 శాతంగా ఉంది. మునుపటితో పోల్చుకుంటే 12 శాతం మేరకు ట్యాక్స్ తగ్గింది. తద్వారా అన్ని ఎస్‌యూవీల మీద ధరలు తగ్గుతున్నాయి.

జిఎస్‌టి ప్రభావం టయోటా కార్ల మీద భారీగా తగ్గిన ధరలు

జిఎస్‌టి మేరకు హైబ్రిడ్ వాహనాల మీద 28 శాతం నిర్ధిష్ట ట్యాక్స్ మరియు 15 శాతం సెస్ కలుపుకుని మొత్తం 43 శాతం ట్యాక్స్ నిర్ణయించింది. మునుపటి ట్యాక్స్ 30.3శాతముతో పోల్చుకుంటే ప్రస్తుతం 12.7 శాతం వరకు పెరిగింది. దీంతో దేశీయంగా ఉన్న అన్ని హైబ్రిడ్ కార్ల ధరలు పెరగనున్నాయి.

జిఎస్‌టి ప్రభావం టయోటా కార్ల మీద భారీగా తగ్గిన ధరలు

టయోటా లైనప్‌లో ఉన్న ప్రియస్ హైబ్రిడ్ సెడాన్ మీద రూ. 75 వేలు మరియు క్యామ్రీ హైబ్రిడ్ కారు మీద రూ. 1.58 లక్షల వరకు పెరిగింది. (గమనిక: వివిధ నగారలు మరియు డీలర్ల ఆధారంగా తగ్గిన మరియు పెరిగిన ధరల్లో మార్పులు ఉంటాయి. మరియు వీటి ధరలపై తుది నిర్ణయం తయారీ సంస్థ మరియు డీలర్లదే).

English summary
Read In Telugu: Toyota Car prices after GST: Toyota liva, Toyota Etios, Toyota Etios Cross, Toyota Innova Crysta, Toyota Fortuner, Toyota Prado, Toyota Camry, Toyota Prius complete GST price list.
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark