జీప్ కంపాస్ Vs టాటా హెక్సా: బెస్ట్ వెహికల్ ఎదో చూద్దాం రండి!!

Written By:

జీప్ మూడు కొత్త ఎస్‌యూవీలతో ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశించింది. అవి, వ్రాంగ్లర్ అన్‌లిమిటెడ్, గ్రాండ్ చిరోకీ మరియు గ్రాండ్ చిరోకీ ఎస్ఆర్‌టి. ఇండియాలో ఇకానిక్ బ్రాండ్‌గా నిలిచేందుకు భారీ ధరలతో ఈ మూడింటిని విడుదల చేసింది.

అయితే దేశీయ వాహన పరిశ్రమ ఊహించని ధరతో, మార్కెట్ దృష్టిని మొత్తం తనవైపుకు తిప్పుకునేలా కంపాస్ ఎస్‌యూవీని ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసింది. అనతి కాలంలోనే 5,000 లకు పైగా బుకింగ్స్ నమోదు చేసుకుని భారీ పాపులారిటీని సొంతం చేసుకుంది.

జీప్ కంపాస్ Vs టాటా హెక్సా

ఇండియన్ మార్కెట్లో జీప్ కంపాస్ ధరల శ్రేణి రూ. 14.95 లక్షల నుండి రూ. 20.65 లక్షల మధ్య ఎక్స్-షోరూమ్‌ (ఇండియా)గా ఉంది. దేశీయ ఎస్‌యూవీ సెగ్మెంట్లో ఇదే ప్రైజ్ రేంజ్‌లో ఉన్న ఎన్నో ఎస్‌యూవీలకు తీవ్ర అంతరాయం కలిగిస్తోంది. కంపాస్‌తో పోల్చితే టాటా హెక్సా ధర తక్కువగానే ఉంది, అయినప్పటికీ కంపాస్ రాక హెక్సాకు తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. నేటి కథనంలో వీటి మధ్య ఉన్న తేడా చూద్దాం రండి.

Recommended Video - Watch Now!
Jeep Compass Launched In India | In Telugu - DriveSpark తెలుగు
జీప్ కంపాస్ Vs టాటా హెక్సా

జీప్ కంపాస్ డిజైన్

జీప్ తమ అతి పెద్ద లగ్జరీ మరియు అత్యంత ఖరీదైన ఎస్‌యూవీ గ్రాండ్ చిరోకీ నుండి సేకరించిన అనేక డిజైన్ సొబగుల ఆధారంగా చిన్న రూపంలో కంపాస్ ఎస్‍‌యూవీని ఆవిష్కరించింది. జీప్ డిఎన్‌ఏ మేళవిపుతో బెస్ట్ మరియు డీసెంట్ ఎస్‌యూవీగా కంపాస్ విపణిలో మంచి పేరు తెచ్చుకుంది.

జీప్ కంపాస్ Vs టాటా హెక్సా

కంపాస్ ఫ్రంట్ డిజైన్‌లో 7-స్లాట్ గ్లాస్ బ్లాక్ మరియు క్రోమ్ పట్టీ గల ఫ్రంట్ గ్రిల్ కలదు మరియు ఐరన్ మ్యాన్ ప్రేరిత ఆకర్షణీయమైన ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్ల జోడింపుతో ఉన్నాయి. కంపాస్ డిజైన్ సిటి మరియు ఆఫ్ రోడింగ్ రెండింటి అవసరాలకు అనుగుణంగా చక్కగా డిజైన్ చేయబడింది.

జీప్ కంపాస్ Vs టాటా హెక్సా

టాటా హెక్సా డిజైన్

టాటా మోటార్స్ హెక్సా ను 7-సీటింగ్ లేఔట్లో నిర్మించింది. అందుకు అనుగుణంగా అన్ని కోణాల్లో పెద్ద పరిమాణంలో హెక్సా రూపొందించడం జరిగింది. 19-అంగుళాల అల్లాయ్ వీల్స్, బ్లాక్ ఫ్రంట్ గ్రిల్ మరియు పెద్ద పరిమాణంలో ఉన్న ఫ్రంట్ గ్రిల్ ద్వారా టాటా వారి సరికొత్త ఇంపాక్ట్ డిజైన్ ఫిలాసఫీ వినియోగించిన హెక్సా ఫ్రంట్ డిజైన్‌ను ఆవిష్కరించింది.

జీప్ కంపాస్ Vs టాటా హెక్సా

స్లోపింగ్ రూఫ్ రెయిల్ కలిగిన హెక్సాలో ఏడు మంది కూర్చునే సామర్థ్యం ఉండటంతో ఎమ్‌పీవీ రూపాన్ని కలిగి ఉంది.

డిజైన్ పరంగా రేటింగ్

  • జీప్ కంపాస్ - 8/10
  • టాటా హెక్సా - 7.5/10
జీప్ కంపాస్ Vs టాటా హెక్సా

జీప్ కంపాస్ ఇంజన్ మరియు గేర్‌బాక్స్ స్పెసిఫికేషన్స్

జీప్ కంపాస్ ఎస్‌యూవీ పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ వేరియంట్లలో లభ్యమవుతోంది. సాంకేతికంగా 1.4-లీటర్ టుర్బోఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్ 160బిహెచ్‌పి పవర్ మరియు 250ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీనికి అనుసంధానం చేసిన 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 7-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ ద్వారా పవర్ మరియు టార్క్ ముందు చక్రాలకు సరఫరా అవుతుంది.

జీప్ కంపాస్ Vs టాటా హెక్సా

జీప్ కంపాస్ డీజల్ వేరియంట్ 2.0-లీటర్ సామర్థ్యం టుర్భో ఛార్జ్‌డ్ డీజల్ ఇంజన్ 171బిహెచ్‌పి పవర్ మరియు 350ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. కేవలం 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభించే కంపాస్ డీజల్ వేరియంట్ ఫ్రంట్ మరియు ఆల్ వీల్ డ్రైవ్ వేరియంట్లో లభిస్తోంది.

జీప్ కంపాస్ Vs టాటా హెక్సా

టాటా హెక్సా కేవలం 2.2-లీటర్ సామర్థ్యం వారికోర్ డీజల్ ఇంజన్ వేరియంట్లో మాత్రమే లభించును. అయితే ఇది రెండు రకాల పవర్ మరియు టార్క్ ఉత్పత్తి చేస్తుంది. వారికోర్ 320 ఇంజన్ 18బిహెచ్‌పి పవర్ మరియు 320ఎన్ఎమ్ టార్క్ అదే విధంగా, వారికోర్ 400 ఇంజన్ 154బిహెచ్‌పి పవర్ మరియు 400ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

జీప్ కంపాస్ Vs టాటా హెక్సా

హెక్సా వారికోర్ 320 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తోంది, అదే విధంగా హెక్సా వారికోర్ 400 6-స్పీడ్ మ్యాన్యుల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లో ఎంచుకోవచ్చు. హెక్సాలో పెట్రోల్ ఇంజన్ అందివ్వడంలో టాటా విఫలమైంది. మరియు జీప్ కంపాస్ డీజల్ ఇంజన్‌తో పోల్చుకుంటే తక్కువ పవర్ మరియు టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

ఇంజన్ రేటింగ్

  • జీప్ కంపాస్ - 8/10
  • టాటా హెక్సా - 7/10
జీప్ కంపాస్ Vs టాటా హెక్సా

ఫీచర్లు

జీప్ కంపాస్ టాటా హెక్సా
7-అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ 5-అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్
ఫ్రంట్ వీల్ డ్రైవ్/ఆల్ వీల్డ్రైవ్ ఫ్రంట్ వీల్ డ్రైవ్/ఆల్ వీల్ డ్రైవ్
4-స్పీకర్స్ 10 స్పీకర్స్ (జెబిఎల్ మ్యూజిక్ సిస్టమ్)
ఆండ్రాయిడ్ ఆటో/ఆపిల్ కార్ ప్లే కనెక్ట్ నెక్ట్స్ అప్లికేషన్స్
5-సీటింగ్ లేఔట్ 7-సీటింగ్ లేఔట్
జీప్ కంపాస్ Vs టాటా హెక్సా

జీప్ కంపాస్ ఎస్‌యూవీలో సెలెక్ టెర్రైన్ డ్రైవ్ మోడ్ కలదు. దీని ద్వారా ఆఫ్ రోడ్ సామర్థ్యాలను పొందవచ్చు. టాటా హెక్సాలో నాలుగు విభిన్న డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి.జీప్ కంపాస్ ఫీచర్లతో పోల్చుకుంటే హెక్సాలో తక్కువ ఫీచర్లే ఉన్నాయి.

ఫీచర్ల పరంగా రేటింగ్

  • జీప్ కంపాస్ - 8/10
  • టాటా హెక్సా - 8/10
జీప్ కంపాస్ Vs టాటా హెక్సా

జీప్ కంపాస్ సేఫ్టీ ఫీచర్లు

అమెరికా దిగ్గజం కంపాస్‌లో భారీ సేఫ్టీ ఫీచర్లను అందించింది. ఇందులో 6-ఎయిర్ బ్యాగులు, యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటి ప్రోగ్రాం, ప్యానిక్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫెయిల్, ఎలక్ట్రానిక్ రోల్ మిటిగేషన్ మరియు హిల్ స్టార్ట్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయ.

జీప్ కంపాస్ Vs టాటా హెక్సా

టాటా హెక్సా లోని భద్రత ఫీచర్లు

ఆరు ఎయిర్ బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటి ప్రోగ్రాం, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ హోల్డ్ మరియు హిల్ డిసెంట్ కంట్రోల్, రోలోవర్ మిటిగేషన్ లతో పాటు మరిన్ని సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

జీప్ కంపాస్ Vs టాటా హెక్సా

భద్రత పరంగా కూడా కంపాస్ మరియు హెక్సా వాహనాలు దాదాపు ఒకే విధమైన ఫీచర్లను కలిగి ఉన్నాయి. అయితే కంపాస్‌లో అదనంగా ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, టైల్డ్ సీట్ల కోసం ఐఎస్ఒఫిక్స్ యాంకర్స్

ఫీచర్లు స్టాండర్డ్‌గా ఉన్నాయి.

భద్రత పరంగా రేటింగ్

  • జీప్ కంపాస్ - 8/10
  • టాటా హెక్సా - 7.5/10
జీప్ కంపాస్ Vs టాటా హెక్సా

ధరలు:

జీప్ కంపాస్ రూ. 14.95 లక్షల నుండి రూ. 20.65 లక్షల మధ్య
టాటా హెక్సా రూ. 10.95 లక్షల నుండి రూ. 16.24 లక్షల మధ్య
జీప్ కంపాస్ Vs టాటా హెక్సా

తీర్పు

ధర పరంగా చూస్తే, టాటా హెక్సా అత్యుత్తమ ఎంపిక. ఎందుకంటే టాటా హెక్సా టాప్ ఎండ్ వేరియంట్ ఎక్స్‌టి ఆల్ వీల్ డ్రైవ్ ధర రూ. 16.24 లక్షలుగా ఉంది. అయితే, జీప్ కంపాస్ టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 20.65 లక్షలుగా ఉంది.

జీప్ కంపాస్ ఎస్‌యూవీలో 50 సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ఈ ధరల శ్రేణిలో ఇండియాలో లభించే అత్యంత సురక్షితమైన ఎస్‌యూవీగా కంపాస్ నిలిచింది. అంతే కాకుండా హెక్సాలోని ఇంజన్ కన్నా ఇందులో అత్యధిక పవర్ ఉత్పత్తి చేసే శక్తివంతమైన ఇంజన్ ఉంది.

English summary
Read In Telugu: Jeep Compass Vs Tata Hexa Comparison — A Close Fought Battle
Story first published: Friday, August 4, 2017, 17:48 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark