టాటా నెక్సాన్ vs మారుతి బ్రిజా vs ఫోర్డ్ ఎకో స్పోర్ట్: ఈ మూడింటిలో ఏది బెస్ట్ వివరంగా...!!

టాటా నెక్సాన్ ఎస్‌యూవీ అతి త్వరలో విపణిలోకి విడుదల కానుంది. నెక్సాన్ గురించి టాటా అందించిన సమాచారం మేరకు మారుతి బ్రిజా మరియు ఫోర్డ్ ఎకోస్పోర్ట్ లతో పోల్చి, మూడింటిలో బెస్ట్ ఎస్‌యూవీ చూద్దాం రండి.

By Anil

దేశీయ ప్యాసింజర్ వెహికల్ మార్కెట్ పెను మార్పులకు గురవుతోంది. ఒకప్పుడు హ్యాచ్‌బ్యాక్ మరియు సెడాన్ కార్లకు మాత్రమే ప్రాధాన్యతనిచ్చిన ఇండియన్స్ ఇప్పుడు ఎస్‌యూవీలకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు.

ఎస్‌యూవీ సెగ్మెంట్లో ఒకానొక కాలంలో మహీంద్రా స్కార్పియో మరియు రెనో డస్టర్ భారీ విజయాన్ని అందుకున్నాయి. వీటికి పోటీగా వచ్చిన ఫోర్డ్ ఎకో స్పోర్ట్ మరియు మరియు మారుతి సుజుకి వితారా బ్రిజా వెహికల్స్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌ను నూతన అంచులకు తీసుకెళ్లాయి. ఇప్పుడు వీటన్నింటికి పోటీగా దేశీయ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం టాటా మోటార్స్ నెక్సాన్ ఎస్‌యూవీని విడుదలకు సిద్దం చేసింది.

ఒకే సెగ్మెంట్లో ఉన్న టాటా నెక్సాన్, మారుతి వితారా బ్రిజా మరియు ఫోర్డ్ ఎకోస్పోర్ట్‌లలో ఏది బెస్ట్ అని తెలుసుకోవాలంటే ఈ ప్రత్యేక కంపారిజన్ కథనాన్ని పూర్తిగా చదవాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం చూద్దాం రండి...!!

Recommended Video

2017 Datsun redi-GO 1.0 Litre Review | In Telugu - DriveSpark తెలుగు
టాటా నెక్సాన్ vs మారుతి బ్రిజా vs ఫోర్డ్ ఎకో స్పోర్ట్

టాటా నెక్సాన్ డిజైన్

టాటా మోటార్స్ ఇంపాక్ట్ డిజైన్ ఫిలాఫీ ఆధారంగా నెక్సాన్‌ను రూపొందించింది. ఇదే డిజైన్ ఫిలాసఫీతో వచ్చిన టియాగో, టిగోర్ మరియు హెక్సా మంచి సక్సెస్ అందుకున్నాయి. కాంపాక్ట్ ఎస్‌యూవీ, క్రాసోవర్ ఎస్‌యూవీ మరియు కూపే స్టైల్లో నెక్సాన్ ఉంది. ఫ్రంట్ డిజైన్‌లో రెండు హెడ్ ల్యాంప్స్‌ను కలుపుతూ బ్లాక్ అవుట్ ప్రంట్ గ్రిల్ కలదు. ప్రంట్ బంపర్‌లో హెడ్ ల్యాంప్స్‌కు క్రిందగా ఫాగ్ ల్యాంప్స్ అందివ్వడం జరిగింది.

టాటా నెక్సాన్ vs మారుతి బ్రిజా vs ఫోర్డ్ ఎకో స్పోర్ట్

మారుతి సుజుకి వితారా బ్రిజా డిజైన్

ఆధునిక ఎస్‌యూవీలకు ఉండాల్సిన డిజైన్‍‌‌ను వితారా బ్రిజాలో చక్కగా అందించారు. మారుతి సుజుకి యురోపియన్ మార్కెట్లో విక్రయిస్తున్న వితారా నుండి కొన్ని డిజైన్లు సేకరించి ఇందులో అందివ్వడం జరిగింది. ఫ్రంట్ డిజైన్‌లో క్రోమ్ పూత పూయబడిన పెద్ద పరిమాణంలో ఉన్న ఫ్రంట్ గ్రిల్ రెండు హెడ్ ల్యాంప్స్ మద్య ఇముడింపజేశారు. వితారా బ్రిజా ఓవరాల్ డిజైన్ బాక్సీగా ఉండటంతో అత్యంధిక క్యాబిన్ స్పేస్‌ సాధ్యపడింది.

టాటా నెక్సాన్ vs మారుతి బ్రిజా vs ఫోర్డ్ ఎకో స్పోర్ట్

ఫోర్డ్ ఎకోస్పోర్ట్ డిజైన్

ఫోర్డ్ మోటార్స్ తమ ఎకో స్పోర్ట్ ఎస్‌యూవీని అంతర్జాతీయ ఫియస్టా బి-సెగ్మెంట్ ఫ్లాట్ ఫామ్ ఆధారంగా డిజైన్ చేసింది. వితారా బ్రిజా తో పోల్చుకుంటే దీనికి ముందు వైపున అతి పెద్ద ఫ్రంట్ గ్రిల్ మరియు న్యారో హెడ్ లైట్లను గుర్తించవచ్చు. వెనుక వైపున స్పేర్ వీల్ ‌ను అమర్చుకునేందుకు ప్రత్యేకమైన స్లాట్‌ను కల్పించారు. దీని వలన ఇది మరింత స్పోర్టివ్‌గా కనిపిస్తోంది. నెక్సాన్ మరియు వితారా బ్రిజారాలో ఈ స్పేర్ వీల్ స్లాట్‌ లోపించడాన్ని గుర్తించవచ్చు.

టాటా నెక్సాన్ vs మారుతి బ్రిజా vs ఫోర్డ్ ఎకో స్పోర్ట్

డిజైన్ పరంగా రేటింగ్

  • టాటా నెక్సాన్ - 8/10
  • మారుతి బ్రిజా - 7.5/10
  • ఫోర్డ్ ఎకోస్పోర్ట్ - 7/10
  • టాటా నెక్సాన్ డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్‌లలో, క్రాసోవర్ మరియు కాంపాక్ట్ ఎస్‌యూవీ స్టైల్లో అన్ని రకాల కస్టమర్లను ఆకట్టుకుంటుంది. మారుతి బ్రిజా బాక్సీ ఆకారంలో విశాలమైన క్యాబిన్‌తో లభిస్తుంది. ఎకోస్పోర్ట్ విషయానికి విషయానికి వస్తే, ఓవరాల్ బాడీ సింగల్ టోన్ కలర్ ఆప్షన్‌లో ఎంచుకోగలం.
    టాటా నెక్సాన్ vs మారుతి బ్రిజా vs ఫోర్డ్ ఎకో స్పోర్ట్

    వితారా బ్రిజా ఇంజన్ మరియు గేర్‌బాక్స్

    మారుతి సుజుకి వితారా బ్రిజాను కేవలం 1.3-లీటర్ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉంచింది. 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానం గల బ్రిజా 89బిహెచ్‌పి పవర్ మరియు 200ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

    టాటా నెక్సాన్ vs మారుతి బ్రిజా vs ఫోర్డ్ ఎకో స్పోర్ట్

    ఎకోస్పోర్ట్ ఇంజన్ మరియు గేర్‌బాక్స్

    ఎకో స్పోర్ట్ ఎస్‌యూవీ రెండు పెట్రోల్ మరియు ఒక డీజల్ ఇంజన్‌ ఆప్షన్‌లో లభిస్తుంది. 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ 110 బిహెచ్‌పి పవర్, 140 ఎన్ఎమ్ టార్క్ మరియు 1.0-లీటర్ ఎకో బూస్ట్ ఇంజన్ 124 బిహెచ్‌పి పవర్, 170 ఎన్ఎమ్ అత్యధిక టార్క్ మరియు ఇందులోని 1.5-లీటర్ డీజల్ ఇంజన్ దాదాపుగా 99 బిహెచ్‌పి పవర్ మరియు 205 ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేయును. ఆటోమేటిక్ మరియు 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌లో ఎంచుకోవచ్చు.

    టాటా నెక్సాన్ vs మారుతి బ్రిజా vs ఫోర్డ్ ఎకో స్పోర్ట్

    నెక్సాన్ ఇంజన్ మరియు గేర్‌బాక్స్

    టాటా మోటార్స్ నెక్సాన్ ఎస్‌యూవీని పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ వేరియంట్లలో ఆఫర్ చేస్తోంది. నెక్సాన్ లోని 1.2-లీటర్ టుర్బో ఛార్జ్‌డ్ రివోట్రాన్ పెట్రోల్ ఇంజన్ 108.5బిహెచ్‌పి పవర్ మరియు 170ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అదే విధంగా ఇందులోని 1.5-లీటర్ రివోటార్క్ డీజల్ ఇంజన్ 108.5బిహెచ్‌పి పవర్ మరియు 260ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. రెండు ఇంజన్ ఆప్షన్‌లను 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్‌తో ఎంచుకోవచ్చు.

    టాటా నెక్సాన్ vs మారుతి బ్రిజా vs ఫోర్డ్ ఎకో స్పోర్ట్

    ఇంజన్ మరియు గేర్‌బాక్స్ పరంగా రేటింగ్

    మూడు ఎస్‌యూవీల్లోని డీజల్ ఇంజన్‌లతో పోల్చుకుంటే నెక్సాన్ డీజల్ ఇంజన్ శక్తివంతమైనది మరియు ఇది అధిక పవర్ మరియు టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

    • టాటా నెక్సాన్ - 8/10
    • ఫోర్డ్ ఎకో స్పోర్ట్ - 7.5/10
    • మారుతి వితారా బ్రిజా - 7/10
    • నెక్సాన్ మరియు ఎకోస్పోర్ట్ లతో పోల్చుకుంటే వితారా బ్రిజాలో తక్కువ కెపాసిటి గల ఇంజన్ కలదు, మారుతి బ్రిజాలోని 1.3 స్థానంలో 1.5 లీటర్ ఇంజన్ అప్‌గ్రేడ్ చేసే అవకాశం లేకపోలేదు.
      టాటా నెక్సాన్ vs మారుతి బ్రిజా vs ఫోర్డ్ ఎకో స్పోర్ట్

      వితారా బ్రిజా ఇంటీరియర్ ఫీచర్లు

      మారుతి సుజుకి వితారా బ్రిజాలో రెయిన్ సెన్సింగ్ వైపర్లు, 2 డిఐఎన్ టచ్ స్క్రీన్ డిస్ల్పే కలదు. యుఎస్‌బి, ఏయుఎక్స్ బ్లూటూత్, సిడి ప్లేయర్ మరియు న్యావిగేషన్ గల దీనికి ఇంటిగ్రేటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అనుసంధానం కలదు. కీలెస్ మరియు బటన్ స్టార్ట్ ఫీచరు కలదు.

      టాటా నెక్సాన్ vs మారుతి బ్రిజా vs ఫోర్డ్ ఎకో స్పోర్ట్

      ఎకోస్పోర్ట్ ఫీచర్లు

      ఎకో స్పోర్ట్ లో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, టిల్ట్ మరియు టెలిస్కోపిక్ స్టీరింగ్, డ్రైవర్ సీటు ఎత్తును సరిచేసుకునే ఫీచర్లు, ఎలక్ట్రిక్ ద్వారా బాహ్యపు అద్దాలను అడ్జెస్ట్ చేసుకునే అవకాశం మరియు యుఎస్‌బి, ఎయుఎక్స్, బ్లూటూత్ కనెక్టివిటి గల 2-డిఐఎన్ ఇన్ఫోటైన్‌మెంట్ వ్యవస్థ కలదు.

      టాటా నెక్సాన్ vs మారుతి బ్రిజా vs ఫోర్డ్ ఎకో స్పోర్ట్

      నెక్సాన్ ఇంటీరియర్ ఫీచర్లు

      టాటా మోటార్స్ నెక్సాన్ ఇంటీరియర్‌లో ఫస్ట్ ఇన్ క్లాస్ ఫీచర్లకు అధిక ప్రాధాన్యతనిచ్చింది. సెగ్మెంట్లో తొలిసారిగా పరిచయం చేసిన విభిన్న డ్రైవింగ్ మోడ్స్, ఫ్లోటింగ్ డ్యాష్ టాప్ హెచ్‌డి టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, యుఎస్‌బి, న్యావిగేషన్ మరియు న్యావిగేషన్ సపోర్ట్ చేయగల 6.5-అంగుళాల డిస్ల్పే కలదు. ఆపిల్ కార్ ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో అప్లికేషన్లను సపోర్ట్ చేయగల, 8-స్పీకర్స్ మ్యూజిక్ సిస్టమ్ అనుసంధానం గల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది.

      టాటా నెక్సాన్ vs మారుతి బ్రిజా vs ఫోర్డ్ ఎకో స్పోర్ట్

      ఫీచర్ పరంగా రేటింగ్

      • టాటా నెక్సాన్ - 8/10
      • ఫోర్డ్ ఎకోస్పోర్ట్ - 7.5/10
      • మారుతి వితారా బ్రిజా - 7.5/10
      • టాటా నెక్సాన్ vs మారుతి బ్రిజా vs ఫోర్డ్ ఎకో స్పోర్ట్

        వితారా బ్రిజాలోని భద్రత ఫీచర్లు

        యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ లతో పాటు టాప్ ఎండ్ వేరియంట్లో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగు, రివర్స్ పార్కింగ్ కెమెరా, బ్రేక్ అసిస్ట్, రియర్ సెన్సార్లు, క్రూయిజ్ కంట్రోల్ మరియు సీట్ బెల్ట్ వార్నింగ్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

        టాటా నెక్సాన్ vs మారుతి బ్రిజా vs ఫోర్డ్ ఎకో స్పోర్ట్

        ఎకో స్పోర్ట్‌లోని భద్రత ఫీచర్లు

        ఎకో స్పోర్ట్‌లోని టాప్ ఎండ్ వేరియంట్లో ఆరు ఎయిర్ బ్యాగులు, యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్, ఇంజన్ ఇమ్మొబిలైజర్, ఫోర్డ్ ఎమర్జెన్సీ అసిస్ట్ వంటి ఫీచర్లు కలవు.

        టాటా నెక్సాన్ vs మారుతి బ్రిజా vs ఫోర్డ్ ఎకో స్పోర్ట్

        నెక్సాన్ భద్రత ఫీచర్లు

        టాటా మోటార్స్ నెక్సాన్ సేఫ్టీ ఫీచర్లను వెల్లడించలేదు. అయితే ఇంటీరియర్ ఫోటోల ప్రకారం, నెక్సాన్‌లో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, మరియు ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ ఫీచర్లు తప్పనిసరిగా రానున్నాయి. వీటి అదనంగా రియర్ వ్యూవ్ కెమెరా మరియు రివర్స్ పార్కింగ్ సెన్సార్లను కూడా అందిస్తున్నట్లు తెలిసింది.

        టాటా నెక్సాన్ vs మారుతి బ్రిజా vs ఫోర్డ్ ఎకో స్పోర్ట్

        భద్రత ఫీచర్ల పరంగా రేటింగ్

        • టాటా నెక్సాన్ - 7.5/10
        • ఫోర్డ్ ఎకో స్పోర్ట్ - 8/10
        • మారుతి వితారా బ్రిజా - 7/10
        • టాటా మోటార్స్ నెక్సాన్ లోని అన్ని వేరియంట్లలో స్టాండర్డ్‌గా ఏబిఎస్, ఇబిడి మరియు డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు అందిస్తోంది. కానీ మారుతి బ్రిజాలో ప్రారంభ వేరియంట్లో కేవలం సింగల్ ఎయిర్ ఉంది. అయితే ఇబిడి మరియు ఏబిస్ మిస్సయ్యాయి. అయితే ఫోర్డ్ ఎకోస్పోర్ట్‌లో క్లాస్ లీడింగ్ భద్రత ఫీచర్లను అందిస్తోంది.
          టాటా నెక్సాన్ vs మారుతి బ్రిజా vs ఫోర్డ్ ఎకో స్పోర్ట్

          ధరలు...

          ఏడు వేరియంట్లలో లభించే బ్రిజా రూ. 7.24 లక్షల నుండి 9.91 లక్షల మధ్య ఎక్స్-షోరూమ్ ధరలతో లభ్యమవుతోంది. అయితే ఫోర్డ్ ఎకో స్పోర్ట్ మూడు ఇంజన్ ఆప్షన్‌లలో అనేక వేరియంట్లలో లభిస్తోంది. ఎకో స్పోర్ట్ రూ. 7.1 లక్షల నుండి 10.71 లక్షల మధ్య లభిస్తోంది. టాటా నెక్సాన్ ధరలను ఇంకా వెల్లడించలేదు, అయితే డిజైన్, ఇంజన్ మరియు ఫీచర్ల పరంగా చూస్తే నెక్సాన్ ధరలు రూ. 7 నుండి 10 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది.

          టాటా నెక్సాన్ vs మారుతి బ్రిజా vs ఫోర్డ్ ఎకో స్పోర్ట్

          తీర్పు

          టాటా మోటార్స్ ఇంటీరియర్ ఫీచర్ల పరంగా ఎస్‌యూవీ సెగ్మెంట్లో ఫస్ట్ ఇన్ క్లాస్ ఫీచర్లను అందించింది, పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ ఆప్షన్‌లో వస్తున్న నెక్సాన్ ఎకోస్పోర్ట్ మరియు బ్రిజా లకన్నాఅధిక పవర్ మరియు టార్క్ ఉత్పత్తి చేస్తుంది. భద్రత విషయంలో ఫోర్డ్ ఎకోస్పోర్ట్‌లో అత్యుత్తమ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. బ్రిజా మరియు నెక్సాన్ లతో పోల్చుకుంటే సేఫ్టీ పరంగా నెక్సాన్ బెస్ట్ ఎస్‌యూవీ అని చెప్పవచ్చు.

          బ్రిజా మరియు ఎకోస్పోర్ట్‌లతో ఉన్న పోటీని దృష్టిలో ఉంచుకుని నెక్సాన్ ధరలను నిర్ణయిస్తే, ఇండియన్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో నెక్సాన్‌కు తిరుగులేని విజయం ఖాయం!

Most Read Articles

English summary
Read In Telugu: Tata Nexon Vs Maruti Brezza Vs Ford Ecosport
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X