మారుతి సెలెరియో ఎక్స్ విడుదల: ధర, ఇంజన్, ఫీచర్లు మరియు ఫోటోలు

Written By:

మారుతి సుజుకి నేడు ఇండియన్ ప్యాసింజర్ కార్ల పరిశ్రమలో తమ మోస్ట్ పాపులర్ హ్యాచ్‌బ్యాక్ సెలెరియో కారును సెలెరియో ఎక్స్ ఎడిషన్‌లో విడుదల చేసింది. మారుతి సెలెరియో ఎక్స్ ప్రారంభ ధర రూ. 4.57 లక్షలు మరియు టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 5.42 లక్షలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీగా ఉన్నాయి.

మారుతి సెలెరియో ఎక్స్ విడుదల

మారుతి సుజుకి ఇటీవలె మార్కెట్లోకి విడుదలచేసిన సెలెరియో ఫేస్‌లిఫ్ట్ ఆధారంగా ఎక్ట్సీరియర్ మీద కాస్మొటిక్ మెరుగులుదిద్ది, స్పోర్టివ్ వెర్షన్‌లో సెలెరియో పేరుతో అభివృద్ది చేసింది. మారుతి సెలెరియో ఎక్స్ లభించే వేరియంట్లు, వాటి ధరలు, అందులో లభించే ఫీచర్లు గురించి పూర్తి వివరాలు ఇవాళ్టి కథనంలో...

మారుతి సెలెరియో ఎక్స్ విడుదల

మారుతి సెలెరియోఎక్స్ డిజైన్

మారుతి తమ సెలెరియోఎక్స్ డిజైన్‌ను రెగ్యులర్ సెలెరియోతో పోల్చుకుంటే స్వల్పమార్పులకు గురయ్యింది. ఏరోడైనమిక్ డిజైన్ లక్షణాలతో X-థీమ్ ఆధారిత గ్రాఫిక్స్ బాడీ చుట్టూ ఉన్నాయి. అంతే కాకుండా బాడీ ప్రొటెక్ట్ బ్లాక్ క్లాడింగ్, వీల్ ఆర్చెస్, సైడ్ బాడీ మరియు రియర్ బంపర్లు ఉన్నాయి. క్రాసోవర్ తరహా లుక్ తెప్పించేందుకు రియర్ బంపర్‌లో స్కిడ్ ప్లేట్లను కూడా అందివ్వడం జరిగింది.

మారుతి సెలెరియో ఎక్స్ విడుదల

మారుతి సెలెరియో ఎక్స్ హ్యాచ్‌బ్యాక్ ఫ్రంట్ గ్రిల్‌లో నల్లటి సొబగులు, ఫాగ్ ల్యాంప్స్, రూఫ్ రెయిల్స్, అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్ మరియు ఆల్ న్యూ బ్లాక్ ఇంటీరియర్ వంటివి ఉన్నాయి. బ్లాక్ ప్యాట్రన్ గల ఆరేంజ్ హెడ్ లైట్లు, బ్లాక్ ఫినిషింగ్ గల 6-స్పోక్ అల్లాయ్ వీల్స్ జోడింపుతో హ్యాచ్‌బ్యాక్ మరింత అగ్రెసివ్ లుక్ సొంతం చేసుకుంది.

మారుతి సెలెరియో ఎక్స్ విడుదల

మారుతి సెలెరియో ఎక్స్ సరికొత్త ప్యాప్రికా ఆరేంజ్ కలర్‌ స్కీమ్‌లో లభ్యం కానుంది. ఇది వరకు లభించే ఆర్కిటిక్ వైట్, గ్లిస్టెనింగ్ గ్రే, కెఫీన్ బ్రౌన్ మరియు టార్క్ బూల్ కలర్ ఆప్షన్స్ యథావిధిగా ఉన్నాయి. మ్యాట్ మరియు గ్లాస్ బ్లాక్ కలర్స్ మేళవింపుతో లభించే ఈ కలర్ స్కీమ్స్ చూడటానికి ఎంతో విభిన్నంగా ఉంటుంది.

మారుతి సెలెరియో ఎక్స్ విడుదల

మారుతి సెలెరియో ఎక్స్ వేరియంట్లు మరియు ధరలు...

వేరియంట్లు గేర్‌బాక్స్ ధరలు
Vxi MT 457,226
Vxi AMT 500,226
Vxi (O) MT 472,279
Vxi (O) AMT 515,279
Zxi MT 482,234
Zxi AMT 525,234
Zxi (O) MT 530,645
Zxi (O) AMT 542,645
మారుతి సెలెరియో ఎక్స్ విడుదల

మారుతి సెలెరియో ఎక్స్ ఇంజన్ స్పెసిఫికేషన్స్

సాంకేతికంగా మారుతి సెలెరియోఎక్స్ హ్యాచ్‌బ్యాక్‌లో 1.0-లీటర్ కెపాసిటి గల పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది 67బిహెచ్‌పి పవర్ మరియు 90ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీనిని 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్ ఆప్షన్స్‌లో ఎంచుకోవచ్చు.

మారుతి సెలెరియో ఎక్స్ విడుదల

మారుతి సెలెరియోఎక్స్ లోని భద్రతా ఫీచర్లు

కొత్తగా మారుతి విడుదల చేసిన సెలెరియెఎక్స్ కారులో డ్రైవర్ సైడ్ ఎయిర్ బ్యాగు, సీట్ బెల్ట్ రిమైండర్లను తప్పనిసరిగా అందించిన మారుతి యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ మరియు ప్యాసింజర్ సైడ్ ఎయిర్ బ్యాగులను ఆప్షనల్‌గా అందివ్వడం జరిగింది.

మారుతి సెలెరియో ఎక్స్ విడుదల

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

అదనంగా వచ్చిన బ్లాక్ డిజైన్ ఎలిమెంట్లు సెలెరియోఎక్స్ మొత్తానికి ఓ విభిన్నమైన రూపాన్ని తీసుకొచ్చాయి. సెలెరియో కొత్త వేరియంట్ పరిచయంతో విపణిలో సెలెరియో శ్రేణి మరింత విస్తరించింది. అత్యంత సరసమైన ధర మరియు ఆటోమేటిక్ గేర్‌బా‌క్స్‌తో వచ్చిన సెలెరియోఎక్స్ ధరకు తగ్గ ఎంపిక అని చెప్పవచ్చు.

English summary
Read In Telugu: Maruti CelerioX Launched In India; Prices Start At Rs 4.57 Lakh
Story first published: Friday, December 1, 2017, 17:32 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark