రూ. 4.59 లక్షల ప్రారంభ ధరతో విడుదలైన ఇగ్నిస్: దీని విశేషాలేంటో చూద్దాం రండి

Written By:

భారత దేశపు దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఎట్టకేలకు తమ ఆశ్చర్యకరమైన కారు ఇగ్నిస్‌ హ్యాచ్‌బ్యాక్‌ను రూ. 4.59 లక్షల ప్రారంభ ధర ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా విపణిలోకి విడుదల చేసింది. మారుతి సుజుకి సరిగ్గా ఏడాది క్రితం ఇగ్నిస్ ను 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ప్రదర్శించింది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
మారుతి సుజుకి ఇగ్నిస్ విడుదల

మారుతి ఈ ఇగ్నిస్ హ్యాచ్‌బ్యాక్ ను సిగ్మా, డెల్టా జెటా మరియు ఆల్ఫా నాలుగు వేరియంట్లలో విడుదల చేసింది. నాలుగు వేరియంట్లు కూడా సాధారణ మారుతి కార్లు అమ్ముడయ్యే సాధారణ మారుతి డీలర్ల వద్ద అందుబాటులో ఉంటుంది. మారుతి ప్రీమియమ్ కస్టమర్లకు బాలెనో మరియు ఎస్-క్రాస్ లను నెక్సా షోరూమ్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంచింది.

వేరియంట్ల వివరాలు

వేరియంట్ల వివరాలు

ఇగ్నిస్ లోని సిగ్మా వేరియంట్ కేవలం పెట్రోల్ వెర్షన్‌లో మాత్రమే లభించును. అయితే డెల్టా, జెటా, ఆల్ఫా వేరియంట్లు పెట్రోల్ మరియు డీజల్ ఇంధన వెర్షన్‌లో లభించును. ఇందులో డెల్టా మరియు జెటా వేరియంట్లు మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ల అనుసంధానంతో లభించును.

ఇంజన్ వివరాలు

ఇంజన్ వివరాలు

మారుతి సుజుకి ఇగ్నిస్ లో 1.2-లీటర్ సామర్థ్యం గల విటివిటి పెట్రోల్ ఇంజన్ కలదు. దీనిని ప్రస్తుతం మారుతి లైనప్‌లో ఉన్న స్విఫ్ట్ మరియు బాలెనో కార్లలో గుర్తించవచ్చు. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదంటే ఆటోమేటిక్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ అనుసంధానంతో కలదు.

పెట్రోల్ ఇంజన్ సాంకేతిక వివరాలు

పెట్రోల్ ఇంజన్ సాంకేతిక వివరాలు

 • సామర్థ్యం: 1,197సీసీ
 • పవర్: 6,000 ఇంజన్ ఆర్‌పిఎమ్ వద్ద 81.2బిహెచ్‌పి
 • టార్క్: 4,200ఆర్‌పిఎమ్ వద్ద 113ఎన్ఎమ్
 • మైలేజ్: 20.89 కిమీ/లీ
డీజల్ ఇంజన్

డీజల్ ఇంజన్

మారుతి తమ ఇగ్నిస్ హ్యచ్‌బ్యాక్‌లో 1.3-లీటర్ సామర్థ్యం గల డీజల్ ఇంజన్‌ను అందించింది. దీనిని స్విఫ్ట్ లో ఇది వరకే పరిచయం చేసింది. మారుతి ఇందులో టర్బో ఛార్జ్‌డ్ పరిజ్ఞానాన్ని జోడించి ప్రయోగాత్మకంగా పరీక్షించింది.

డీజల్ ఇంజన్ సాంకేతిక వివరాలు

డీజల్ ఇంజన్ సాంకేతిక వివరాలు

 • సామర్థ్యం: 1,248సీసీ
 • పవర్: 4,000 ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం వద్ద 74బిహెచ్‌పి
 • టార్క్: 2,000ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం వద్ద 190ఎన్ఎమ్
 • మైలేజ్: 26.80 కిమీ/లీ
 ఇగ్నిస్ పెట్రోల్ వేరియంట్ల ధరలు

ఇగ్నిస్ పెట్రోల్ వేరియంట్ల ధరలు

 • సిగ్మా పెట్రోల్ ధర రూ. 4.59 లక్షలు
 • డెల్టా పెట్రోల్ ధర రూ. 5.19 లక్షలు
 • జెటా పెట్రోల్ ధర రూ. 5.75 లక్షలు
 • ఆల్టా పెట్రోల్ ధర రూ. 6.69 లక్షలు
 • డెల్టా ఆటోమేటిక్ పెట్రోల్ ధర రూ. 5.74 లక్షలు
 • జెటా ఆటోమేటిక్ పెట్రోల్ ధర రూ. 6.30 లక్షలు
ఇగ్నిస్ డీజల్ వేరియంట్ల ధరలు

ఇగ్నిస్ డీజల్ వేరియంట్ల ధరలు

 • డెల్టా డీజల్ ధర రూ. 6.39 లక్షలు
 • జెటా డీజల్ ధర రూ. 6.91 లక్షలు
 • ఆల్ఫా డీజల్ ధర రూ. 7.80 లక్షలు
 • డెల్టా ఆటోమేటిక్ డీజల్ ధర రూ. 6.94 లక్షలు
 • జెటా ఆటోమేటిక్ డీజల్ ధర రూ. 7.46 లక్షలు
ఇగ్నిస్ కొలతలు

ఇగ్నిస్ కొలతలు

 • మారుతి ఈ ఏడాది రెండు చిన్న కార్లను విడుదల చేయడానికి ప్రణాళికలు చేసుకుంది. అందులో ఒకటి 2017 స్విఫ్ట్ మరియు మరొటి ఇగ్నిస్.
 • ఇగ్నిస్ పొడవు: 3,700ఎమ్ఎమ్
 • వెడల్పు: 1,690ఎమ్ఎమ్
 • ఎత్తు: 1,595ఎమ్ఎమ్
 • వీల్ బేస్: 2,435ఎమ్ఎమ్
 • గ్రౌండ్ క్లియరెన్స్: 180ఎమ్ఎమ్
 • టైర్ పరిమాణం: 175/65 ఆర్15
 • బూట్ స్పేస్ (ఢిక్కీ): 260 లీటర్లు
 • ఇంధన ట్యాంకు: 32 లీటర్లు
ఇగ్నిస్ డిజైన్

ఇగ్నిస్ డిజైన్

మారుతి సుజుకి తమ ఇగ్నిస్‌ను సరికొత్త డిజైన్ భాషలో పరిచయం చేసింది. చిన్న కార్ల సెగ్మెంట్లో అగ్ర స్థానంలో ఉన్న మారుతి తమ ఎన్నో చిన్న కార్లకు విభిన్న తరహాలో ఇగ్నిస్ ను డిజైన్ చేసింది. ఇందులో భాగా గుర్తించిన వాటిలో టాల్ బాయ్ ఆకారంలో ఎస్‌యువి శైలిలో విడుదల కావడం మరో ప్రత్యేకం అని చెప్పవచ్చు.

మారుతి సుజుకి ఇగ్నిస్ విడుదల

ప్రస్తుతం మారుతి అందుబాటులో ఉంచిన వ్యాగన్ ఆర్ టాల్ బాయ్ శరీరాకృతిలో ఉంటుంది. విడుదల సమయం నుండి వ్యాగన్ ఆర్ ఇప్పటికీ అద్బుతమైన అమ్మకాలు సాధిస్తోంది. ఇకపోతే ఎస్‌యువి తరహా ఉత్పత్తులకు దేశీయంగా మంచి ఆదరణ లభిస్తోంది. అందుకు అత్యుత్తమ ఉదాహరణ ఎస్‌యువి నిర్మాణ శైలిలో ఉన్న రెనో క్విడ్. ఇది భారీ అమ్మకాలతో ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ కార్లలో తీవ్ర అలజడి రేపింది. కాబట్టి ఈ రెండు అంశాల మేళవింపుతో వచ్చిన ఇగ్నిస్ మంచి విజయాన్ని అందుకోనుంది,

మారుతి సుజుకి ఇగ్నిస్ విడుదల

మారుతి తమ ఇగ్నిస్ ముందు వైపు డిజైన్‌కు అత్యధిక ప్రాముఖ్యతనిచ్చింది. వెడల్పాటి ఫ్రంట్ గ్రిల్ నందు పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్ల జోడింపుతో ఆంగ్లపు యు-ఆకారంలో ఉన్న హెడ్ లైట్లు కలవు. రెండు స్లాట్లలో ఉన్న ఫ్రంట్ గ్రిల్ దానికి క్రింది భాగంలో ఎక్కువ గాలిని గ్రహించే విధంగా ఉన్న పెద్ద ఎయిర్ ఇంటేకర్ మరియు ధృడమైన బంపర్ బాడీ కలర్ కలదు.

మారుతి సుజుకి ఇగ్నిస్ విడుదల

వెనుక వైపు డిజైన్‌ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దడంలో మారుతి ఏ మాత్రం వెనక్కు తగ్గలేదు. టెయిల్ లైటులో సగ భాగం బాడీ మీద మరియు మిగతా సగ భాగం డిక్కీ డోరు మీద వచ్చేట్లు నిర్మించడం జరిగింది. రియర్ బంపర్ క్రింది భాగంలో నల్లటి ప్లాస్టిక్ తొడుగును గమనించవచ్చు.

మారుతి సుజుకి ఇగ్నిస్ విడుదల

ఇంటీరియర్ లో డ్యాష్ బోర్డ్ మరియు డోర్ హ్యాండిల్స్ మీద డ్యూయల్ టోన్ ఫినిషింగ్ కలదు. ఇక టాప్ ఎండ్ వేరియంట్లో అయితే డ్యాష్ బోర్డ్‌లో గల మధ్య భాగాన్ని బాడీ కలర్‌లో అందివ్వడం ప్రత్యేకం అని చెప్పవచ్చు.

మారుతి సుజుకి ఇగ్నిస్ విడుదల

ట్యాబ్లెట్ రూపంలో ఉన్న తాకే తెర గల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఇందులో గుర్తించవచ్చు. ఆటోమేటక్ క్లైమేట్ కంట్రోల్ కోసం ప్రత్యేక ప్యానల్ ను మారుతి తమ ఇగ్నిస్ లో పరిచయం చేసింది.

మారుతి సుజుకి ఇగ్నిస్ విడుదల

మారుతి ఇగ్నిస్ మొత్తం ఆరు విభిన్న రంగుల్లో లభించును. అందులో పియర్ల్ ఆర్కిటిక్ వైట్ మరియు సిల్కీ సిల్వర్ రంగులు అన్ని వేరియంట్లో ఎంచుకోవచ్చు. గ్లిస్టెనింగ్ గ్రే అనే పెయింట్ స్రీమ్ టాప్ ఎండ్ వేరియంట్ ఆల్ఫా లో మరియు అర్బన్ బ్లూ అనే పెయింట్ స్కీమ్ ఎంట్రీ లెవల్ సిగ్మా వేరియంట్లలో లభించడం లేదు.

మారుతి సుజుకి ఇగ్నిస్ విడుదల

ఇక మిగతా రెండు రంగులు టిన్సెల్ బ్లూ మరియు అప్ టౌన్ రెడ్ ఇగ్నిస్ లోని డెల్టా మరియు జెటా వేరియంట్లలో మాత్రమే లభించును. కాబట్టి ఇగ్నిస్ లోని విభిన్న వేరియంట్లు లభించే రంగులు, పియర్ల్ ఆర్కిటిక్ లైట్, సిల్కీ సిల్వర్, గ్లిస్టెనింగ్ గ్రే, అర్బన్ బ్లూ, టిన్సెల్ బ్లూ మరియు అప్ టౌన్ రెడ్.

మారుతి సుజుకి ఇగ్నిస్ విడుదల

ఇగ్నిస్ లోని టాప్ ఎండ్ వేరియంట్ ఆల్ఫా మూడు విభిన్న డ్యూయల్ టోన్ రంగుల్లో లభించును అవి, అప్ టౌన్ రెడ్ మరియు మిడ్ నైట్ బ్లాక్, టిన్సెల్ బ్లూ మరియు మిడ్ నైట్ బ్లూ లతో పాటు టిన్సెల్ బ్లూ మరియు పియర్ల్ ఆర్కిటిక్ వైట్. కస్టమర్లకు తమ ఇగ్నిస్ లను కస్టమైజ్ చేసుకునే అవకాశం కల్పించింది. దీంతో రూఫ్ రెయిల్స్ మరియు ఇంటీరియర్స్ ను కస్టమర్లు కోరుకునే రీతిలో కస్టమైజ్ చేసుకోవచ్చు.

మారుతి సుజుకి ఇగ్నిస్ విడుదల

మారుతి సుజుకి తమ ఇగ్నిస్ లో భద్రత పరంగా ఊహించిన స్థాయిలో ఫీచర్లను పరిచయం చేసింది. అందులో స్టాండర్డ్‌గా యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, డ్యూయస్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, ఫోర్స్ లిమిటెర్స్ గల సీట్ బెల్ట్ ప్రిటెన్షనర్లు, ఐఎస్ఒఫిక్స్ చైల్డ్ సీట్ మరియు పాదచారుల భద్రత కోసం మరిన్ని భద్రత ఫీచర్లను ఇందులో అందించింది.

మారుతి సుజుకి ఇగ్నిస్ విడుదల

కొత్తగా కారును కొనుగోలు చేసే వారికి ఇగ్నిస్ ఉత్తమ ఎంపిక అని చెప్పవచ్చు. ధరకు తగ్గ విలువలతో మారుతి విడుదల చేసిన ఇగ్నిస్ నూతన తర యువతకు ఉత్తమ ఎంపిక. మారుతి ఈ ఏడాది బాలెనో ఆర్ఎస్ మరియు 2017 స్విఫ్ట్ ను విడుదల చేయనుంది. తాజా ఆటోమొబైల్ కథనాలను తెలుగులో పొందడానికి చూస్తూ ఉండండి తెలగు డ్రైవ్‌స్పార్క్.....

సాంఘిక మాధ్యమాలతో డ్రైవ్‌స్పార్క్ తెలుగు మీ చెంతకు...

సాంఘిక మాధ్యమాలతో డ్రైవ్‌స్పార్క్ తెలుగు మీ చెంతకు...

విభిన్న సాంఘిక మాద్యమాల ద్వారా తెలుగు డ్రైవ్‌స్పార్క్ ను అనుసరించండి....

డ్రైవ్‌స్పార్క్ తెలుగు ఫేస్ బుక్ పేజ్ లైక్ చేయండి

డ్రైవ్‌స్పార్క్ తెలుగుట్విట్టర్ కోసం

డ్రైవ్‌స్పార్క్ తెలుగు గూగుల్ ప్లస్ కోసం

 

మారుతి సుజుకి ఈ ఏడాదిలో నెక్ట్స్ జనరేషన్ 2017 స్విఫ్ట్ ను విడుదల చేయడానికి సిద్దం అవుతోంది. 201 మారుతి స్విఫ్ట్ ఫోటోలు మీ కోసం...

 

English summary
Maruti Ignis Launched In India; Priced At Rs 4.59 Lakh
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark