త్వరలో విడుదల కానున్న బాలెనో ఆర్ఎస్ సాంకేతిక వివరాలు

Written By:

మారుతి సుజుకి 2015 లో బాలెనో ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ ను ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసింది. అయితే ఇప్పుడు బాలెనో ను ఆర్ఎస్ బ్యాడ్జి పేరుతో స్పోర్టివ్ హ్యాచ్‌బ్యాక్ తరహాలో విడుదల చేయడానికి సిద్దం అయ్యింది. కాకపోతే దీని విడుదలకు ముందే సాంకేతిక వివరాలు ఆన్‌లైన్లో లీకయ్యాయి. వాటి ప్రకారం సాధారణ బాలెనో కన్నా ఆరఎస్ మరింత శక్తివంతమైనదని తేలింది. పూర్తి వివరాల కోసం...

To Follow DriveSpark On Facebook, Click The Like Button
మారుతి సుజుకి బాలెనో ఆర్ఎస్

మారుతి అప్ కమింగ్ హ్యాచ్‌బ్యాక్ బాలెనో ఆర్ఎస్ యొక్క సాంకేతిక వివరాలను తెలియజేసే స్పెసిఫికేషన్ల జాబితాకు సంబందించిన పేపర్ ఒకటి ఇంటర్నెట్లో తెగ సంచారం చేసింది.

మారుతి సుజుకి బాలెనో ఆర్ఎస్

ఈ షీట్‌లో ఉన్న వివరాల మేరకు, బాలెనో ఆర్ఎస్ స్పోర్టివ్ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ 1.0-లీటర్ సామర్థ్యం గల మూడు సిలిండర్ల బూస్టర్ జెట్ పెట్రోల్ ఇంజన్ కలదు.

మారుతి సుజుకి బాలెనో ఆర్ఎస్

ఇది గరిష్టంగా 100బిహెచ్‌పి పవర్ మరియు 150ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. సాధారణ బాలెనో లోని 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ 83బిహెచ్‌పి పవర్ మరియు 115ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

మారుతి సుజుకి బాలెనో ఆర్ఎస్

స్పెసిఫికేషన్ షీట్ ప్రకారం బాలెనో ఆర్ఎస్ హ్యాచ్‌బ్యాక్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానంతో మరియు నాలుగు చక్రాలు డిస్క్ బ్రేకులను కలిగి ఉన్నాయి.

మారుతి సుజుకి బాలెనో ఆర్ఎస్

సాధారణ బాలెనో యొక్క పవర్ మరియు టార్క్ కన్నా ఇది ఎక్కువ ఉత్పత్తి చేయనుంది కాబట్టి, ఆర్ఎస్ వేరియంట్లో మరింత మెరుగైన సస్పెన్షన్ మరియు హ్యాడ్లింగ్ వ్యవస్థను అందివ్వనుంది. ప్రత్యేకించి ఇండియన్ రోడ్ల కోసం 114ఎమ్ఎమ్ గ్రౌండ్ క్లియరెన్స్ అందివ్వడం జరిగింది.

మారుతి సుజుకి బాలెనో ఆర్ఎస్

మారుతి ఈ బాలెనో ఆర్ఎస్ ను విడుదల చేస్తే ప్రస్తుతం అందుబాటులో ఉన్న వోక్స్‌వ్యాగన్ పోలో జిటి టిఎస్ఐ మరియు ఫియట్ అబర్త్ పుంటో మోడళ్లకు గట్టి పోటీనివ్వనుంది.

మారుతి సుజుకి బాలెనో ఆర్ఎస్

మారుతి సుజుకి 2017 లో మూడవ తరానికి చెందిన స్విప్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను విడుదల చేయనుంది. ఈ ఏడాది స్విఫ్ట్ కొంటున్నట్లయితే 2017 స్విఫ్ట్ కోసం వేచి ఉండండి... ఇది ఎలా ఉంటుందో గమనించాలంటే క్రింద ఉన్న గ్యాలరీ మీద క్లిక్ చేయాల్సిందే...

 

English summary
Maruti Suzuki Baleno RS Specifications Leaked
Story first published: Saturday, January 28, 2017, 17:41 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark