స్కోడా నుండి మోంటె కార్లో సెడాన్ విడుదల: ధర, ఇంజన్, ఫీచర్ల కోసం...

Written By:

స్కోడా ఆటో ఇండియా విభాగం, విపణిలోకి సరికొత్త ర్యాపిడ్ మోంటె కార్లో సెడాన్ కారును విడుదల చేసింది. స్కోడా ర్యాపిడ్ మోంటె కార్లో ప్రారంభ ధర రూ. 10.75 లక్షలు ఎక్స్-షోరూమ్ (ఇండియా)గా ఉంది.

స్కోడా మోటార్‌స్పోర్ట్స్ ప్రేరణతో స్కోడా ర్యాపిడ్ మోంటె కార్లో సెడాన్‌ను రూపొందించింది. ప్రస్తుతం విపణిలో ఉన్న హ్యుందాయ్ సిటి, సరికొత్త హ్యుందాయ్ వెర్నా మరియు మారుతి సుజుకి సియాజ్ ఎస్ సెడాన్ కార్లకు గట్టి పోటీనిస్తుంది.

స్కోడా ర్యాపిడ్ మోంటె కార్లో

స్కోడా ర్యాపిడ్ మోంటె కార్లో పెట్రోల్ ఇంజన్:

సరికొత్త స్కోడా ర్యాపిడ్ మోంటె కార్లో కారులో ర్యాపిడ్ రెగ్యులర్ వెర్షన్‌లో ఉన్న అవే ఇంజన్‌లు ఉన్నాయి. ఇందులోని 1.6-లీటర్ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజన్ కలదు. 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ట్రాన్స్‌మిషన్‌తో లభించే ఇది 103.5బిహెచ్‌పి పవర్ మరియు 153ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

  • మోంటె కార్లో పెట్రోల్ మ్యాన్యువల్ మైలేజ్ - 14.8 కిమీ/లీ
  • మోంటె కార్లో పెట్రోల్ ఆటోమేటిక్ మైలేజ్ - 15.41 కిమీ/లీ
Recommended Video - Watch Now!
Jeep Compass Launched In India | In Telugu - DriveSpark తెలుగు
స్కోడా ర్యాపిడ్ మోంటె కార్లో

స్కోడా ర్యాపిడ్ మోంటె కార్లో డీజల్ ఇంజన్

ర్యాపిడ్ మోంటె కార్లో సెడాన్ కారులోని 1.5-లీటర్ సామర్థ్యం గల డీజల్ ఇంజన్ కలదు. 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 7-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్‌లో లభించే ఇది గరిష్టంగా 108.4బిహెచ్‌పి పవర్ మరియు 250ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

  • మోంటె కార్లో డీజల్ మ్యాన్యువల్ మైలేజ్ - 21.13 కిమీ/లీ
  • మోంటె కార్లో డీజల్ ఆటోమేటిక్ మైలేజ్ - 21.72కిమీ/లీ
స్కోడా ర్యాపిడ్ మోంటె కార్లో

స్కోడా ర్యాపిడ్ మోంటె కార్లో ధరలు

వేరియంట్లు ధరలు
ర్యాపిడ్ మోంటె కార్లో 1.6 పెట్రోల్ మ్యాన్యువల్ రూ. 10,75,347 లు
ర్యాపిడ్ మోంటె కార్లో 1.6 పెట్రోల్ ఆటోమేటిక్ రూ. 11,91,672 లు
ర్యాపిడ్ మోంటె కార్లో 1.5 డీజల్ మ్యాన్యువల్ రూ. 12,46,096 లు
ర్యాపిడ్ మోంటె కార్లో 1.5 డీజల్ ఆటోమేటిక్ రూ. 13,57,709 లు
స్కోడా ర్యాపిడ్ మోంటె కార్లో

2017 స్కోడా ర్యాపిడ్ మోంటె కార్లో డిజైన్

రెగ్యులర్ ర్యాపిడ్‌తో పోల్చుకుంటే సరికొత్త ర్యాపిడ్ మోంటె కార్లో మోడల్‌లో డిజైన్ పరంగా కొన్ని గుర్తించదగిన మార్పులు చోటు చేసుకున్నాయి. ముందు వైపు బ్లాక్ ఫ్రంట్ గ్రిల్, రియర్ స్పాయిలర్, 16-అంగుళాల డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్ మరియు వెనుక వైపున ఫాక్స్ డిఫ్యూసర్ ఉంది. స్కోడా ర్యాపిడ్ మోంటె కార్లో రెండు విభిన్న కలర్ ఆప్షన్‌లో లభిస్తుంది. అవి,

  • ప్లాష్ రెడ్ మరియు బ్లాక్ రూఫ్
  • క్యాండీ వైట్ మరియు బ్లాక్ రూఫ్
స్కోడా ర్యాపిడ్ మోంటె కార్లో

ర్యాపిడ్ మోంటె కార్లో ఇంటీరియర్

మోంటె కార్లో సెడాన్‌లోని అన్ని వేరియంట్లలో ఆల్ బ్లాక్ ఇంటీరియర్, గ్రే కలర్ స్ట్రిప్స్ ఉన్న డ్యూయల్ టోన్ రెడ్ మరియు బ్లాక్ లెథర్ సీట్లు, ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ మరియు గేర్‌నాబ్‌లకు లెథర్ తొడుగులు, స్టెయిన్ లెస్ స్టీల్ పెడల్స్ ఉన్నాయి.

స్కోడా ర్యాపిడ్ మోంటె కార్లో

ర్యాపిడ్ మోంటె కార్లో ఫీచర్లు

సరికొత్త స్కోడా ర్యాపిడ్ మోంటె కార్లో ఇంటీరియర్‌లో 6.5-అంగుళాల పరిమాణం గల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ కలదు, ఇది ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే మరియు మిర్రర్ లింక్ వంటి అప్లికేషన్లను సపోర్ట్ చేయడంతో పాటు బ్లూటూత్, ఏయుఎక్స్, యుఎస్‌బి మరియు మైక్రో ఎస్‌డి సపోర్ట్ ఫీచర్లను కలిగి ఉంది.

స్కోడా ర్యాపిడ్ మోంటె కార్లో

ర్యాపిడ్ మోంటె కార్లో భద్రత ఫీచర్లు

భద్రత పరంగా స్కోడా తమ ర్యాపిడ్ మోంటె కార్లో సెడాన్‌లో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటి కంట్రోల్, హిల్ హోల్డ్ కంట్రోల్, వంటి ఫీచర్లను స్టాండర్డ్‌గా అందించింది.

వీటితో పాటు, రియర్ పార్కింగ్ సెన్సార్లు, పగటి పూట వెలిగే లైట్లు, రియర్ ఏ/సి వెంట్స్, క్రూయిజ్ కంట్రోల్, కూల్ గ్లూవ్ బాక్స్, మరియు రెయిన్ సెన్సింగ్ వైపర్లు ఉన్నాయి.

స్కోడా ర్యాపిడ్ మోంటె కార్లో

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

రేసింగ్ హిస్టరీలో స్కోడాకు మంచి అనుభవం ఉంది. రేసింగ్ పరిజ్ఞానాన్ని తమ సెడాన్ కారులో పరిచయం చేసి ర్యాపిడ్ మోంటె కార్లో మోడల్‌గా విపణిలోకి విడుదల చేసింది. స్పోర్టివ్ లుక్, అధునాతన ఇంటీరియర్ మరియు సేఫ్టీ ఫీచర్లతో శక్తివంతమైన ఇంజన్‌ ఆప్షన్స్ గల స్పోర్టివ్ సెడాన్ కోరుకునే వారికి ర్యాపిడ్ మోంటె కార్లో బెస్ట్ ఛాయిస్.

English summary
Read In Telugu: Skoda Rapid Monte Carlo Launched In India Launch Price Mileage Specifications Images

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark