హ్యుందాయ్ వెర్నా విడుదల: ప్రారంభ ధర రూ. 7.99 లక్షల

హ్యుందాయ్ వెర్నా విపణిలోకి విడుదలయ్యింది. సరికొత్త హ్యుందాయ్ వెర్నా ప్రారంభ ధర రూ. 7.99 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.

By Anil

హ్యుందాయ్ వెర్నా విపణిలోకి విడుదలయ్యింది. సరికొత్త హ్యుందాయ్ వెర్నా ప్రారంభ ధర రూ. 7.99 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.

హ్యుందాయ్ మోటార్స్ తమ సరికొత్త వెర్నా సెడాన్ కారును మూడవ జనరేషన్ మోడల్‌గా, మారుతి సుజుకి సియాజ్ మరియు హోండా సిటి సెడాన్ కార్లకు పోటీగా విడుదల చేసింది. ఆల్ న్యూ హ్యుందాయ్ వెర్నా ధర, ఇంజన్, ఫీచర్లు మరియు పూర్తి వివరాలు నేటి కథనంలో....

హ్యుందాయ్ వెర్నా విడుదల

హ్యుందాయ్ వేరియంట్ల వివరాలు:

మార్కెట్లోకి విడుదలైన మూడవ తరానికి చెందిన హ్యుందాయ్ ఆరు వేరియంట్లలో, పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ ఆప్షన్‌లలో లభిస్తోంది. వెర్నాలోని ఇఎక్స్ మరియు ఎస్ఎక్స్(ఒ) పెట్రోల్ వేరియంట్లు అదే విధంగా ఇఎక్స్ మరియు ఎస్ఎక్స్ ప్లస్ వేరియంట్ల ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో కూడా లభిస్తున్నాయి.

Recommended Video

Jeep Compass Launched In India | In Telugu - DriveSpark తెలుగు
హ్యుందాయ్ వెర్నా విడుదల

హ్యుందాయ్ వెర్నా మీద వారంటీ:

హ్యుందాయ్ వెర్నా మీద మూడేళ్ల పాటు లేదా అన్ లిమిటెడ్ కిలోమీటర్ల వారంటీ మరియు రోడ్ సైడ్ అసిస్టెన్స్ అందిస్తోంది. అంతే కాకుండా మూడు అప్‌డేట్స్ గల మ్యాప్‌కేర్ శాటిలైట్ న్యావిగేషన్ సిస్టమ్ కూడా ఉంది.

హ్యుందాయ్ వెర్నా విడుదల

హ్యుందాయ్ వెర్నా పెట్రోల్ వేరియంట్ల ధరలు:

వెర్నా ఇ ధర రూ. 7,99,900 లు
వెర్నా ఇఎక్స్ ధర రూ. 9,06,900 లు
వెర్నా ఇఎక్స్ ఆటోమేటిక్ ధర రూ. 10,22,900 లు
వెర్నా ఎస్ఎక్స్ ధర రూ. 9,49,900 లు
వెర్నా ఎస్ఎక్స్(ఒ) ధర రూ. 11,08,900 లు
వెర్నా ఎస్ఎక్స్(ఒ) ఆటోమేటిక్ ధర రూ. 12,23,900 లు
హ్యుందాయ్ వెర్నా విడుదల

హ్యుందాయ్ వెర్నా డీజల్ వేరియంట్ల ధరలు:

వెర్నా ఇ ధర రూ. 9,19,900 లు
వెర్నా ఇఎక్స్ ధర రూ. 9,99,900 లు
వెర్నా ఇఎక్స్ ఆటోమేటిక్ ధర రూ. 11,39,900 లు
వెర్నా ఎస్ఎక్స్ ధర రూ. 11,11,900 లు
వెర్నా ప్లస్ ఆటోమేటిక్ ధర రూ. 12,61,900 లు
వెర్నా ఎస్ఎక్స్(ఒ) ధర రూ. 12,39,900 లు

గమనిక: అన్ని ధరలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఇవ్వబడ్డాయి.

హ్యుందాయ్ వెర్నా విడుదల

హ్యుందాయ్ వెర్నా ఇంజన్ స్పెసిఫికేషన్లు

సరికొత్త హ్యుందాయ్ వెర్నా 1.6-లీటర్ సామర్థ్యం గల నాలుగు సిలిండర్ల పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్‌లను కలిగి ఉంది. రెండు ఇంజన్‌లు కూడా 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో అందుబాటులో ఉన్నాయి.

హ్యుందాయ్ వెర్నా విడుదల

హ్యుందాయ్ వెర్నా పెట్రోల్ ఇంజన్ మరియు మైలేజ్

సాంకేతికంగా సరికొత్త వెర్నా లోని 1,591సీసీ సామర్థ్యం గల నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ 6,400ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం వద్ద 121బిహెచ్‌పి పవర్ మరియు 4,850ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 151ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

  • పెట్రోల్ వెర్నా మైలేజ్ లీటర్‌కు 17.7 కిలోమీటర్లు
  • హ్యుందాయ్ వెర్నా విడుదల

    హ్యుందాయ్ వెర్నా డీజల్ ఇంజన్ మరియు మైలేజ్

    హ్యుందాయ్ వెర్నాలోని 1,582సీసీ సామర్థ్యం గల నాలుగు సిలిండర్ల డీజల్ ఇంజన్ 4,000ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం వద్ద 126బిహెచ్‌పి పవర్ మరియు 1,500 నుండి 3,000ఆర్‌పిఎమ్ మధ్య 260ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

    • డీజల్ వెర్నా మైలేజ్ లీటర్‌కు 24.76 కిలోమీటర్లు.
    • హ్యుందాయ్ వెర్నా విడుదల

      హ్యుందాయ్ వెర్నా డిజైన్

      హ్యుందాయ్ వెర్నా మునుపటి మోడల్‌తో పోల్చుకుంటే దాదాపు మారిపోయింది. హ్యుందాయ్ ఈ మధ్యనే విపణిలోకి విడుదల చేసిన ఎలంట్రా సెడాన్ తరహాలో థర్డ్ జనరేషన్ వెర్నా రూపాన్ని మార్చేసింది.

      ప్రంట్ డిజైన్‌లో అధునాత యాంగులర్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లు, ఎల్ఇడి లైట్ల చుట్టూ క్రోమ్ ఫినిషింగ్, మరియు ఇంజన్‌కు అధికంగా గాలిని సేకరించేందుకు నూతన క్రోమ్ ఫ్రంట్ గ్రిల్ కలదు.

      హ్యుందాయ్ వెర్నా విడుదల

      హ్యుందాయ్ వెర్నా లభించు కలర్స్ మరియు ఎక్ట్సీరియర్

      హ్యుందాయ్ వెర్నాలో 16-అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. వెర్నా రియర్ డిజైన్ విషయానికి వస్తే, స్పోర్టివ్ షార్ప్ ఎల్ఇడి టెయిల్ ల్యాంప్స్, క్రోమ్ మెటల్‌తో ఉన్న వేరియంట్ మరియు మ్యాన్యుఫ్యాక్చరర్ నేమ్ కలదు.

      సరికొత్త థర్డ్ జనరేషన్ హ్యుందాయ్ వెర్నా ఆరు విభిన్న రంగుల్లో లభించును. అవి, పోలార్ వైట్, స్లీక్ సిల్వర్, స్టార్ డస్ట్, సియెర్రా బ్రౌన్, ఫ్లేమ్ ఆరేంజ్, ఫిరీ రెడ్ మరియు ఫాంటమ్ బ్లాక్.

      హ్యుందాయ్ వెర్నా విడుదల

      హ్యుందాయ్ వెర్నా ఇంటీరియర్

      హ్యుందాయ్ వెర్నా సెడాన్ ఇంటీరియర్‌ సరికొత్త డ్యూయల్ టోన్ బ్లాక్ మరియు బీజి ఇంటీరియర్ థీమ్‌తో వెల్‌కమ్ చెబుతుంది. టాప్ స్పెక్ వేరియంట్లో లెథర్ సీట్లు మరియు అన్ని సీట్లకు గాలి ప్రసరణ చక్కగా ఉండేలా సీటింగ్ పొజిషన్ అందివ్వడం జరిగింది.

      హ్యుందాయ్ వెర్నా విడుదల

      వెర్నా ఇన్ఫోటైన్‌మెంట్

      వివిధ వేరియంట్ల ఆధారంగా కొన్నింటిలో 5-అంగుళాల పరిమాణం గల మరికొన్నింటిలో 7-అంగుళాల పరిమాణం ఉన్న ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కలదు. టాప్ ఎండ్ వేరియంట్లోని 7-ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, మిర్రర్ లింక్ మరియు శాటిలైట్ న్యావిగేషన్ వంటి అప్లికేషన్లను కలిగి ఉంది.

      హ్యుందాయ్ వెర్నా విడుదల

      హ్యుందాయ్ వెర్నా లోని ఇతర ఫీచర్లు

      సరికొత్త వెర్నాలో క్రూయిజ్ కంట్రోల్, రియర్ కర్టన్, పుష్ బటన్ స్టార్ట్, ఎలక్ట్రిక్ సన్ రూఫ్, హ్యాండ్ల్స్ ఫ్రీ డిక్కీ ఓపెన్(కారు వెనుక భాగం క్రింది వైపుకు కాలును చూపించడం ద్వారా సెన్సార్ డిక్కీ డోర్ ఓపెన్ చేస్తుంది) వంటి ఫీచర్లు ఉన్నాయి.

      హ్యుందాయ్ వెర్నా విడుదల

      భద్రత ఫీచర్లు

      హ్యుందాయ్ వెర్నాలోని అన్ని వేరియంట్లు కూడా డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులను స్టాండర్డ్‌గా కలిగి ఉన్నాయి. అయితే టాప్ ఎండ్ వేరియంట్ ఎస్ఎక్స్(ఒ) లో మొత్తం ఆరు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి. యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, ఐఎస్ఒఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్, ఫ్రంట్ సీట్ బెల్ట్ ప్రి టెన్షనర్లు ఉన్నాయి. వెర్నాలో రియర్ వ్యూవ్ కెమెరా, పార్కింగ్ సెన్సార్లతో పాటు సులభంగా మరియు వేగంగా పార్కింగ్ చేయడానికి డైనమిక్ గైడ్‌లైన్స్ ఇస్తుంది.

      హ్యుందాయ్ వెర్నా విడుదల

      డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

      హ్యుందాయ్ వెర్నా మునుపటి మోడల్ కంటే అత్యంత ఆకర్షణీయమైన, పదునైన డిజైన్ లక్షణాలతో ఫ్రెష్ లుక్‌లో ఉంది. దీనికి తోడు ట్యూన్ చేయబడిన ఇంజన్‌లను అందివ్వడంతో మైలేజ్ కూడా పెరిగింది. ఫీచర్ల విషయంలో పోటీదారులకు గట్టి సమాధానం ఇవ్వడం ఖాయం.

      మీ నగరంలో హ్యుందాయ్ కార్ల ధరలను తెలుసుకోండి

Most Read Articles

English summary
Read In Telugu: Hyundai Verna Launched In India Launch Price Mileage Specifications Images
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X