2017 కరోలా ఆల్టిస్ ఫేస్‌‌లిఫ్ట్ లాంచ్ చేసిన టయోటా

టయోటా కిర్లోస్కర్ మోటార్ ఇండియన్ మార్కెట్లోకి తమ ఫేస్‌లిఫ్టెడ్ 2017 కరోలా ఆల్టిస్ సెడాన్ కారును రూ. 15.87 లక్షల ప్రారంభ ధరతో విడుదల చేసింది.

By Anil

జపాన్‌కు చెందిన దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ టయోటా మోటార్స్ యొక్క ఇండియా విభాగం విపణిలోకి తమ 2017 కరోలా ఆల్టిస్ కారును ఫేస్‌లిఫ్ట్ రూపంలో విడుదల చేసింది. ప్రారంభ వేరియంట్ 2017 కరోలా ఆల్టిస్ ఫేస్‌లిఫ్ట్ ధర రూ. 15.87 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది.

2017 కరోలా ఆల్టిస్ ఫేస్‌‌లిఫ్ట్

కరోలా ఆల్టిస్ లోని పెట్రోల్ వేరియంట్ల ధరలు రూ. 15.87 లక్షల నుండి 19.91 లక్షలు, అదే విధంగా కరోలా ఆల్టిస్ ఫేస్‌లిఫ్ట్ డీజల్ వేరియంట్ల ధరలు రూ. 17.36 లక్షల నుండి 19.05 లక్షల మధ్య ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా ఉన్నాయి.

2017 కరోలా ఆల్టిస్ ఫేస్‌‌లిఫ్ట్

2017 టయోటా కరోలా ఆల్టిస్ ఫేస్‌లిఫ్ట్‌లో సరికొత్త ఫ్రంట్ గ్రిల్, పగటి పూట వెలిగే లైట్ల జోడింపుతో ఎల్ఇడి హెడ్ ల్యాంప్ క్లస్టర్, మరియు 16-అంగుళాల అల్లాయ్ వీల్స్ కలవు.

2017 కరోలా ఆల్టిస్ ఫేస్‌‌లిఫ్ట్

దీని ఇంటీరియర్‌లో టచ్ సాఫ్ట్ డ్యాష్ బోర్డ్ మరియు అప్‌డేటెడ్ ఇంటీరియర్ కలర్‌తో నూతనంగా డిజైన్ చేయబడిన ఇంస్ట్రుమెంట్ ప్యానల్ కలదు.

2017 కరోలా ఆల్టిస్ ఫేస్‌‌లిఫ్ట్

ఈ సరికొత్త 2017 కరోలా ఆల్టిస్ ఫేస్‌లిఫ్ట్‌ను 1.8-లీటర్ సామర్థ్యం ఉన్న పెట్రోల్ మరియు 1.4-లీటర్ సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్ వేరియంట్లలో ఎంచుకోవచ్చు.

2017 కరోలా ఆల్టిస్ ఫేస్‌‌లిఫ్ట్

ఇందులోని 1.8-లీటర్ సామర్థ్యం ఉన్న డ్యూయల్ వివిటి-ఐ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 138బిహెచ్‌పి పవర్ మరియు 173ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

2017 కరోలా ఆల్టిస్ ఫేస్‌‌లిఫ్ట్

అదే విధంగా ఇందులోని 1.4-లీటర్ సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్ గరిష్టంగా 88బిహెచ్‌పి పవర్ మరియు 205ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

2017 కరోలా ఆల్టిస్ ఫేస్‌‌లిఫ్ట్

టయోటా కిర్లోస్కర్ మోటార్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అకితోషి టకెమురా మాట్లాడుతూ, ఇండియాలో ప్రీమియమ్ సెడాన్ కస్టమర్ల అభిరుచులను దృష్టిలో ఉంచుకుని సరికొత్త 2017 కరోలా ఆల్టిస్ సెడాన్ అభివృద్ది చేసి, విడుదల చేసినట్లు చెప్పుకొచ్చాడు.

2017 కరోలా ఆల్టిస్ ఫేస్‌‌లిఫ్ట్

ఈ సందర్భంగా టయోటా కిర్లోస్కర్ మోటార్ ఇండియా డైరెక్టర్ మరియు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎన్ రాజా మాట్లాడుతూ, ప్రపంచ వ్యాప్తంగా టయోటా మోటార్స్ బెస్ట్ సెల్లింగ్ సెడాన్ కారుగా ఉంది. అంతర్జాతీయ విపణిలోనే కూడా ఇండియాలో కూడా మంచి అమ్మకాలు సాధిస్తూ, ప్రీమియమ్ సెడాన్ శ్రేణిలో సెగ్మెంట్ లీడర్‌గా రాణిస్తోందని తెలిపాడు.

2017 కరోలా ఆల్టిస్ ఫేస్‌‌లిఫ్ట్

దాదాపు కొన్ని సంవత్సరాల పాటు కరోలా ఆల్టిస్ దేశీయంగా ఉన్న టయోటా లైనప్‌లో అత్యంత శక్తివంతమైన ఉత్పత్తి అని, మరియు ప్రీమియమ్ సి సెగ్మెంట్లో మా స్థానాన్ని పటిష్టపరిచింది, అదే విధంగా సి సెగ్మెంట్ సెడాన్ మార్కెట్ మొత్తం వాటాలో కరోలా ఆల్టిస్ 40 శాతం ఉందని తెలిపాడు.

ఇతరులు ఎక్కువగా చదువుతున్నవి:

2017 కరోలా ఆల్టిస్ ఫేస్‌‌లిఫ్ట్

Article Published On: Friday, March 17, 2017, 10:40 [IST]
English summary
2017 Toyota Corolla Altis Launched In India — Prices Start At Rs 15.87 Lakh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+