2017 వెబ్ ఎడిషన్ స్విఫ్ట్ విడుదల చేసిన సుజుకి

Written By:

జపాన్ దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ సుజుకి ఇటాలియన్ మార్కెట్లో తమ థర్డ్ జనరేషన్ స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ కారును 2017 వెబ్ ఎడిషన్ పేరుతో లిమిటెడ్ ఎడిషన్‌గా విడుదల చేసింది. ఈ లిమిటెడ్ ఎడిషన్‌లో ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్‌లో డ్యూయల్ టోన్ పెయింట్ జాబ్ సొబగులు ఉన్నాయి.

2017 సుజుకి స్విఫ్ట్ వెబ్ ఎడిషన్

ఇటాలియన్ మార్కెట్లో వెబ్ ఎడిషన్ స్విఫ్ట్ విడుదలతో ఔత్సాహికుల్లో కాస్త ఉత్సాహాన్ని రేకెత్తించిందని చెప్పవచ్చు. ఈ వెబ్ ఎడిషన్ స్విఫ్ట్‌ను 16,900 యూరోల ప్రారంభ ధరతో విడుదల చేసింది. మన కరెన్సీలో దీని ధర రూ. 11.78 లక్షలుగా ఉంది.

2017 సుజుకి స్విఫ్ట్ వెబ్ ఎడిషన్

ఈ 2017 స్విఫ్ట్ వెబ్ ఎడిషన్ ను డ్యూయల్ టోన్ పెయింట్ స్కీమ్ ద్వారా ఆరు విభిన్న రంగుల్లో ఎంచుకోవచ్చు. అవి, ఆర్కిటిక్ వైట్, న్యూయార్క్ సిల్వర్, లండన్ గ్రే, దుబాయ్ బ్లాక్, కర్డోబా రెడ్ మరియు ఆజోరస్ బ్లూ.

2017 సుజుకి స్విఫ్ట్ వెబ్ ఎడిషన్

సాధారణ స్విఫ్ట్‌‌తో పోల్చుకుంటే విభిన్నంగా ఉండేందుకు, వెబ్ ఎడిషన్ మోడల్‌లో బ్లాక్ పెయింటింగ్ చేయబడిన రూఫ్ టాప్, స్పాయిలర్, క్రోమ్ అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ క్యాంప్స్ మరియు క్రోమ్ పూత పూయబడిన ఫాగ్ ల్యాంప్ అవుటర్ రింగ్స్ కలవు.

2017 సుజుకి స్విఫ్ట్ వెబ్ ఎడిషన్

వెబ్ ఎడిషన్ స్విఫ్ట్ లోని టాప్ మోడళ్లలో హానికాంబ్ ఫ్రంట్ గ్రిల్, కీ లెస్ ఎంట్రీ, ఎల్ఇడి హెడ్ ల్యాంప్స్, 6-అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, రివర్స్ వ్యూవ్ కెమెరా కలదు.

2017 సుజుకి స్విఫ్ట్ వెబ్ ఎడిషన్

ఇంటీరియర్‌‌లో 7-అంగుళాల పరిమాణం ఉన్న టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్ కలదు.

2017 సుజుకి స్విఫ్ట్ వెబ్ ఎడిషన్

2017 సుజుకి స్విఫ్ట్ వెబ్ ఎడిషన్‌లో 1.0-లీటర్ సామర్థ్యం గల బూస్టర్ జెట్ పెట్రోల్ ఇంజన్ కలదు, దీనికి సుజుకి యొక్క స్మార్ట్ హైబ్రిడ్ వెహికల్ బై సుజుకి అనే హైబ్రిడ్ సాంకేతిక టెక్నాలజీ అనుసంధానం కలదు.

2017 సుజుకి స్విఫ్ట్ వెబ్ ఎడిషన్

పెట్రోల్ ఇంజన్ మరియు హైబ్రిడ్ పరిజ్ఞానం ద్వారా అనుసంధానం చేసిన ఎలక్ట్రిక్ మోటార్ రెండూ సంయుక్తంగా 112బిహెచ్‌పి పవర్ మరియు 170ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

ఎక్కువ మంది చదువుతున్నవి:

2017 సుజుకి స్విఫ్ట్ వెబ్ ఎడిషన్

జపాన్‌కు చెందిన సుజుకి ఇండియాలో మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్‌గా కార్యకలాపాలు సాగిస్తోంది. గత ఏడాది సుజుకి జపాన్‌లో నెక్ట్స్ జనరేషన్ స్విఫ్ట్‌ను విడుదల చేసింది. దానిని ఈ ఏడాది ఇండియాలో విడుదల చేసే అవకాశం ఉంది. ఈ 2017 స్విప్ట్ ఫోటోల కోసం...

 

English summary
2017 Suzuki Swift Web Edition Launched — The Snazziest Swift?
Story first published: Thursday, March 16, 2017, 18:20 [IST]
Please Wait while comments are loading...

Latest Photos