యు321 మోడల్‌కు జూలై 31 న కొత్త పేరును రివీల్ చేయనున్న మహీంద్రా
మహీంద్రా అండ్ మహీంద్రా తమ నూతన ఎమ్‌పీవీ వాహనానికి "మరాజొ" అనే పేరును పెట్టాలని భావిస్తున్నట్లు తెలిసింది. మహీంద్రా అభివృద్ది చేసిన సరికొత్త ఎమ్‌పీవీకి జూలై 31, 2018 న జరగనున్న కార్యక్రమంలో మీడియా ప్ర
మహీంద్రా అండ్ మహీంద్రా తమ నూతన ఎమ్‌పీవీ వాహనానికి "మరాజొ" అనే పేరును పెట్టాలని భావిస్తున్నట్లు తెలిసింది. మహీంద్రా అభివృద్ది చేసిన సరికొత్త ఎమ్‌పీవీకి జూలై 31, 2018 న జరగనున్న కార్యక్రమంలో మీడియా ప్రతినిధులు సమక్షంలో "మరాజొ" అనే బ్రాండ్ పేరును ఖారారు చేయనున్నట్లు సమాచారం.

మహీంద్రా యు321 అనే కోడ్ పేరుతో డెవలప్ చేసిన ఎమ్‌పీవీ వాహనాన్ని ఇండియన్ రోడ్ల మీద పలుమార్లు అత్యంత రహస్యంగా పరీక్షించింది. @MahindraMarazzo పేరుతో వెరిఫైడ్ ట్విట్టర్ అకౌంట్‌ను కూడా ప్రారంభించింది కాబట్టి, దాదాపు ఇదే పేరును ఖాయం చేయనుంది.

మహీంద్రా విడుదల చేసే ప్రతి మోడల్ పేరుకు చివరిలో "O" వచ్చేలా జాగ్రత్తపడుతుంది. ఉదాహరణకు స్కార్పియో (Scorpio), బొలెరో (Bolero) ఇలా దాదాపు అన్ని మోడల్ పేర్లు "O"తో అంతమవుతాయి. అందులో భాగంగానే దీనికి మరాజొ (Marazzo) పేరును ప్రతిపాదించినట్లు తెలిసింది.

టాటా హెక్సా మరియు టయోటా ఇన్నోవా క్రిస్టా మోడళ్లకు పోటీగా చెప్పుకునే మహీంద్రా యు321 లేదా మరాజో ఎమ్‌పీవీ మహీంద్రా కంపెనీ యొక్క విలాసవంతమైన ఉత్పత్తి. ఇది 7-సీటింగ్ మరియు 8-సీటింగ్ ఆప్షన్‌లలో లభ్యమవుతుంది.

పియానో బ్లాక్ డ్యాష్‌బోర్డ్ మరియు లెథర్ సీట్లు వంటి ప్రపంచ శ్రేణి విలాసంవతమైన ఎలిమెంట్లతో ఇంటీరియర్‌ను రూపొందించారు. రెండవ వరుస సీట్లను 60:40 నిష్పత్తిలో మడిపేయవచ్చు. రూఫ్ మౌంటెడ్ ఏసి వెంట్స్, పలు రకాల స్టోరేజ్ ప్రదేశాలు మరియు టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటివి రానున్నాయి.

మహీంద్రా యు321, దక్షిణ అమెరికాలో ఉన్న ఉత్తర డెవలప్‌మెంట్ సెంటర్ రూపొందించిన మొదటి మోడల్. దీనిని ఇండియాతో పాటు, యూరోప్ మరియు ఉత్తర అమెరికాలో విడుదల చేయాలని భావిస్తోంది.

సాంకేతికంగా, మహీంద్రా మరాజొ ఎమ్‌పీవీలో 125బిహెచ్‌పి పవర్ మరియు 305ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేసే 1.6-లీటర్ సామర్థ్ం గల ఎమ్‌ఫాల్కన్ డీజల్ ఇంజన్ వచ్చే అవకాశం ఉంది. అంతే కాకుండా, 163బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేసే 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ వచ్చే అవకాశం ఉంది. రెండు ఇంజన్‌లు 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభ్యం కానున్నాయి.

మహీంద్రా అండ్ మహీంద్రా భద్రత మరాజొ ఎమ్‌పీవీ వాహనంలో పలు ఎయిర్ బ్యాగులు, యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, రివర్స్ పార్కింగ్ కెమెరా మరియు ఐఎస్ఒ ఫిక్స్ చైల్జ్ సీట్ మౌంట్స్ వంటి ఫీచర్లు తప్పనిసరిగా రానున్నాయి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
ఎస్‌యూవీ వాహనాల తయారీ దిగ్గజ సంస్థగా పేరుగాంచిన మహీంద్రా అండ్ మహీంద్రా నుండి విడుదలకు ఎంతగానో ఎదురుచూస్తున్న మోడల్ మరాజొ. ఎమ్‌పీవీ సెగ్మెంట్లోకి తీసుకొస్తున్న ఈ మోడల్ అత్యంత విలాసవంతమైన ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్ ఫీచర్లు రానున్నాయి. దీని ధర సుమారుగా రూ. 9 లక్షల నుండి 15 లక్షల మధ్య ఎక్స్-షోరూమ్‌గా ఉండే అవకాశం ఉంది.
మహీంద్రా మరాజొ ఈ పేరు ఎలా ఉంది..? మీకే కనుక దీనికి ఒక కొత్త పేరు పెట్టే అవకాశమిస్తే, మీరు ఏ పేరును సూచిస్తారో... క్రింది కామెంట్ బాక్సు ద్వారా మాతో పంచుకోండి.



Click it and Unblock the Notifications








