5 మరియు 7-సీటింగ్ కెపాసిటితో వస్తున్న టాటా అట్మోస్ లగ్జరీ ఎస్‌యూవీ

టాటా మోటార్స్ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్, లగ్జరీ ఎస్‌యూవీ మరియు మరో రెండు కమర్షియల్ వాహనాలను ఆవిష్కరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, వీటిలో టాటా నుండి వస్తున్న ఖరీదైన ఎస్‌యూవీ అట్మోస్ పేరుతో వస్తున్నట్లు

By Anil

Recommended Video

Tata Nexon Faces Its First Recorded Crash

దేశీయ దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ ఫిబ్రవరి 2018లో న్యూఢిల్లీలో ప్రారంభం కానున్న ఆటో ఎక్స్‌పో వాహన ప్రదర్శనలో తమ నూతన ఉత్పత్తులను పరిచయం చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంది.

టాటా అట్మోస్ ఎస్‌యూవీ

టాటా మోటార్స్ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్, లగ్జరీ ఎస్‌యూవీ మరియు మరో రెండు కమర్షియల్ వాహనాలను ఆవిష్కరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, వీటిలో టాటా నుండి వస్తున్న ఖరీదైన ఎస్‌యూవీ అట్మోస్ పేరుతో వస్తున్నట్లు తెలిసింది.

టాటా అట్మోస్ ఎస్‌యూవీ

తాజాగా అందిన రిపోర్ట్స్ మేరకు, టాటా మోటార్స్ దేశీయ విపణిలోకి విడుదల చేయాలని చూస్తున్న ఖరీదైన లగ్జరీ ఎస్‌యూవీని అట్మోస్ పేరుతో విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. అంతర్గతంగా టాటా దీనిని హెచ్5 అనే కోడ్ పేరుతో ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్ ఆధారంగా అభివృద్ది చేసింది.

టాటా అట్మోస్ ఎస్‌యూవీ

టాటా డిజైనింగ్ బృందం ఈ సరికొత్త టాటా హెచ్5 లేదా క్యూ501 ఎస్‌యూవీని రెండు విభిన్న వేరియంట్లలో, 5-సీటర్ మరియు 7-సీటర్‌గా అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం. ఈ మోడళ్లను ఇప్పటికే పలుమార్లు ఇండియన్ రోడ్ల మీద పరీక్షించింది.

Image Source: The Automotive India

టాటా అట్మోస్ ఎస్‌యూవీ

రెండు రకాల సీటింగ్ లేఔట్లో లభ్యం కానున్న రెండు మోడళ్లను కూడా టాటా సొంతం చేసుకున్న ల్యాండ్ రోవర్ వారి డిస్కవరీ స్పోర్ట్ ఎస్‌యూవీని అభివృద్ది చేసిన ఎల్55 ఫ్లాట్‌ఫామ్ అభివృద్ది చేసింది. వీటిని ప్రత్యేకించి ఇండియన్ రోడ్లకు అనుగుణంగా తీర్చిదిద్దింది.

  • తలక్రిందులైన టాటా నెక్సాన్: సేఫ్టీ విషయంలో మరోసారి నిరూపించుకున్న టాటా!
  • టాటా అట్మోస్ ఎస్‌యూవీ

    టాటా హెచ్5 ఎస్‌యూవీ సాంకేతికంగా ఫియట్ నుండి సేకరించిన 2.0-లీటర్ కెపాసిటి గల నాలుగు సిలిండర్ల డీజల్ ఇంజన్‌లో లభ్యమయ్యే అవకాశం ఉంది. ఇదే ఇంజన్‌తో రానున్న 5-సీటర్ ఎస్‌యూవీ 140బిహెచ్‌పి పవర్ మరియు 7-సీటర్ ఎస్‌యూవీ 170బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేసే అవకాశం ఉంది.

    టాటా అట్మోస్ ఎస్‌యూవీ

    ఇంజన్‌ను కనుక గమనిస్తే, జీప్ ఇండియా విక్రయిస్తున్న కంపాస్ ఎస్‌యూవీలో కూడా ఇదే ఉంది. ఈ ఇంజన్‌ను అమెరికా దిగ్గజం ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్ పూర్తి స్థాయిలో దేశీయంగానే ఉత్పత్తి చేస్తోంది.

    టాటా అట్మోస్ ఎస్‌యూవీ

    ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు, టాటా మోటార్స్ తమ ప్రీమియమ్ ఎస్‌యూవీల్లోని బేస్ వేరియంట్లు టు-వీల్ డ్రైవ్ మరియు టాప్ ఎండ్ వేరియంట్లు ఆల్ వీల్ డ్రైవ్ వేరియంట్లలో లభ్యమయ్యే అవకాశం ఉంది.

    టాటా అట్మోస్ ఎస్‌యూవీ

    కొత్త వాహనాల ఆవిష్కరణతో పాటు, టాటా మోటార్స్ సరికొత్త ఇంపాక్ట్ డిజైన్ ఫిలాసఫీ 2.0 వెర్షన్‌ను కూడా ఈ 2018 ఇండియన్ ఆటో ఎక్స్‌పో వేదిక మీద పరిచయం చేస్తోంది. ఈ డిజైన్ లాంగ్వేజ్ ఆధారంగానే తమ హెచ్5 ప్రీమియమ్ ఎస్‌యూవీలను డిజైన్ చేసింది. టాటా రివీల్ చేసిన హెచ్5 ఎస్‌‌యూవీ ఫోటోలను పరిశీలిస్తే పదునైన డిజైన్ అంశాలను గమనించవచ్చు.

    టాటా అట్మోస్ ఎస్‌యూవీ

    టాటా హెచ్5 ప్రీమియమ్ ఎస్‌యూవీ 5-సీటర్ ప్రారంభ ధర రూ. 13 లక్షలు మరియు 7-సీటర్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 15 లక్షలు ఎక్స్‌-షోరూమ్‌గా ఉండే ఛాన్స్ ఉంది. ఈ ఎస్‌యూవీల ఇంటీరియర్‌లో అత్యాధునిక టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, హార్మన్ ఆడియో సిస్టమ్ మరియు అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్లతో విశాలమైన క్యాబిన్‌తో రానున్నాయి.

    • తలపాగా మ్యాచింగ్ కోసం 7 రోల్స్ రాయిస్ కార్లు కొనుగోలు చేసిన భారత సంతతి బ్రిటన్ బిల్‌గేట్స్
    • టాటా అట్మోస్ ఎస్‌యూవీ

      డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

      అత్యంత సరసమైన ఉత్పత్తులను అత్యుత్తమ నాణ్యత ప్రమాణాలతో అందిస్తున్న కార్ల తయారీ సంస్థగా టాటా మోటార్స్ ఈ మధ్య కాలంలో బాగా రాణిస్తోంది. టాటా గత రెండేళ్ల కాలంలో విడుదల చేసిన టియాగో, నెక్సాన్, టిగోర్ మరియు హెక్సా వంటి ఉత్పత్తులు భారీ విజయాన్ని తెచ్చిపెట్టాయి. ప్రతి సెగ్మెంట్లో తమ ఉత్పత్తులను ప్రవేశపెట్టి సక్సెస్ సాధించే లక్ష్యంతో ఉన్న టాటా ఇప్పుడు ఖరీదైన ప్రీమియమ్ ఎస్‌యూవీని లాంచ్ చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంది.

      టాటా రివీల్ చేసిన ఫోటోల ప్రకారం, టాటా హెచ్5 ఎస్‌యూవీ విపణిలో ఉన్న జీప్ కంపాస్, మహీంద్రా ఎక్స్‌యూవీ500 మరియు హ్యుందాయ్ క్రెటా వంటి మోడళ్లకు గట్టి పోటీనివ్వనుంది.

      Trending DriveSpark Telugu YouTube Videos

      Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

Source: GaadiWaadi

More from DriveSpark

Article Published On: Saturday, January 27, 2018, 13:01 [IST]
English summary
Read In Telugu: Tata Motors To Reveal Premium SUV At Auto Expo 2018 — Could Be Named Tata Atmos
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+