తలక్రిందులైన టాటా నెక్సాన్: సేఫ్టీ విషయంలో మరోసారి నిరూపించుకున్న టాటా!

Written By:

టాటా కార్లు నిర్మాణ నాణ్యతకు పెట్టింది పేరు. ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఇండియన్ రోడ్లకు కావాల్సింది అందమైన డిజైన్ హంగులు మరియు ఇంటీరియర్ ఫీచర్లు ఉన్న కార్లు కాదు, అత్యుత్తమ నిర్మాణ నాణ్యత గల కార్లు.

టాటా నెక్సాన్ యాక్సిడెంట్

మన ఇండియన్స్ మాత్రం, భద్రత దేవుడికెరుగు తక్కువ ధరలో... ఫీచర్లు ఎక్కువ ఉండే కార్లను ఇష్టపడతారు. టాటా మోటార్స్ సరిగ్గా ఇలాంటి కస్టమర్లను టార్గెట్ చేస్తూ, డిజైన్, ఫీచర్లు, సేఫ్టీ మరియు భద్రత అన్నింటిని కలగలిపి బడ్జెట్ ధరలో నెక్సాన్ ఎస్‌యూవీని లాంచ్ చేసింది.

టాటా నెక్సాన్ యాక్సిడెంట్

టాటా మోటార్స్ గత ఏడాది విడుదల చేసిన నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ గోవాలో ఓ భయంకరమైన ప్రమాదానికి గురయ్యింది. అయితే, టాటా నిర్మాణ నాణ్యత అద్భుతంగా ఉండటంతో నెక్సాన్ ఎస్‌యూవీ ఎంత వరకు సురక్షితమైందో తెలిసిపోయింది.

టాటా నెక్సాన్ యాక్సిడెంట్

బ్రాండ్ న్యూ టాటా నెక్సాన్ కారులో తన ఫ్యామిలీని తీసుకెళుతున్న వ్యక్తి ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి, వాహనాన్ని ఎడమ వైపు మళ్లించాడు. ఈ క్రమంలో ఎడమవైపున్న రెండు టైర్లు రోడ్డు దిగాయి.

టాటా నెక్సాన్ యాక్సిడెంట్

దీంతో ఎడమవైపున్న ముందు టైర్ పంక్చర్ కావడంతో నెక్సాన్ ఎస్‌యూవీ అదుపు తప్పి ప్రక్కనే ఉన్న ఖాళీ ప్రదేశంలోకి పల్టీలు కొట్టింది. అదృష్టవశాత్తు ఏ చిన్న గాయాలు లేకుండా అందరూ సురక్షితంగా బయటపడ్డారు.

టాటా నెక్సాన్ యాక్సిడెంట్

కారు యజమాని సుజిత్ కుమార్ ప్రమాదానంతరం, బోల్తా పడిన నెక్సాన్ ఎస్‌యూవీని స్థానికుల సహాయంతో చక్రాల మీదకు మళ్లించాడు. క్యాబిన్ పైభాగం చూస్తే ఎవ్వరైనా ఆశ్చర్యపోవాల్సిందే.

టాటా నెక్సాన్ యాక్సిడెంట్

చిన్న చిన్న నొక్కులు మినహాయిస్తే క్యాబిన్ చెక్కు చెదరలేదు. నెక్సాన్ ఎస్‌యూవీలోని బి-పిల్లర్లు మరియు రూఫ్ టాప్ యొక్క ధృడత్వం బయటపడింది. టాటా వారి నిర్మాణ నాణ్యత ఎంత మెరుగైనదో ఈ ప్రమాదాన్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

టాటా నెక్సాన్ యాక్సిడెంట్

నెక్సాన్ మాత్రమే కాదు, టాటా మెటార్స్ ఇంపాక్ట్ డిజైన్ ఫిలాసఫీ ఆధారంగా అభివృద్ది చేసిన టాటా హెక్సా మరియు టాటా టియాగో కార్లు భారీ ప్రమాదానికి గురైనప్పటికీ, ఎలాంటి డ్యామేజ్ లేకుండా సురక్షితంగా తప్పించుకున్నాయి.

టాటా నెక్సాన్ యాక్సిడెంట్

టాటా నెక్సాన్ విషయానికి వస్తే, ఇంపాక్ట్ డిజైన్ ల్యాంగ్వే‌జ్‌లో టాటా రూపొందించిన మోడళ్లలో అత్యంత ఆకర్షణీయమైన డిజైన్ కలిగి ఉన్న మోడల్ నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ. జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇంటీరియర్ ప్రేరణతో వచ్చిన ఫస్ట్ క్లాస్ ఫీచర్లు, శక్తివంతమైన ఇంజన్ ఆప్షన్స్ మరియు ఫ్యూచరిస్టిక్ డిజైన్ ఇండియన్ కస్టమర్లను విపరీతంగా ఆకట్టుకుంది.

టాటా నెక్సాన్ యాక్సిడెంట్

టాటా నెక్సాన్ శక్తివంతమైన 1.5-లీటర్ డీజల్ మరియు 1.2-లీటర్ కెపాసిటి గల ఇంజన్ వేరియంట్లలో లభ్యమవుతోంది. వీటిని 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానంతో ఎంచుకోవచ్చు.

టాటా నెక్సాన్ యాక్సిడెంట్

టాటా నెక్సాన్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 6.14 లక్షలు మరియు టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 9.70 లక్షలు ఎక్స్‌-షోరూమ్(హైదారాబాద్)గా ఉన్నాయి. టాటా నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ విపణిలో ఉన్న మారుతి సుజుకి వితారా బ్రిజా, ఫోర్డ్ ఎకోస్పోర్ట్ మరియు మహీంద్రా టియువి300 వంటి ఎస్‌యూవీలకు గట్టి పోటీనిస్తోంది.

డ్రైవ్‌స్పార్క్ బృందం నెక్సాన్ ఎస్‌యూవీకి టెస్ట్ డ్రైవ్ నిర్వహించింది: నెక్సాన్ గురించి కంప్లీట్ టెస్ట్ డ్రైవ్ రివ్యూ రిపోర్ట్ కోసం....


రైలు పెట్టెకు చివర్లో X మార్క్ ఎందుకుంటుందో తెలుసా...?

రైలు పెట్టెకు చివర్లో X మార్క్ ఎందుకుంటుందో తెలుసా...?

భారతదేశపు రవాణా వ్యవస్థలో రైళ్లు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ప్రతి రోజు కొన్ని లక్షల మధ్య భారతీయ రైల్వేలో గమ్యస్థానాలను చేరుకుంటున్నారు. తరచూ రైళ్లలో ప్రయాణిస్తున్నప్పటికీ మనకు తెలియని విషయాలు ఎన్నో ఉంటాయి. అందులో ఒకటి ప్రతి రైలుకు ఉండే చివరి పెట్టెకు వెనకాల పసుపు రంగులో ఓ X మార్క్ ఉంటుంది.

రైలు పెట్టెకు చివర్లో X మార్క్ ఎందుకుంటుందో తెలుసా...?

ఇలా ఎందుకుంటుందో చాలా మందికి తెలియకపోవచ్చు. మరి ప్రతి రైలు పెట్టెకు చివరిలో X మార్క్ ఉండటం వెనుక రీజన్స్ ఏంటో చూద్దాం రండి...

రైలు పెట్టెకు చివర్లో X మార్క్ ఎందుకుంటుందో తెలుసా...?

నిజమే, కదా.... రైలు వెళ్లిపోయేటపుడు మనకు స్పష్టంగా కనబడేది చివరి రైలు పెట్టె వెనక భాగం మాత్రమే. ఆ పెట్టె చివర్లో పసుపు రంగులో ఉండే X మార్కును చాలాసార్లు చూసుంటాం. కొంత మంది చూసుంటారు, కొంత మంది గమనించి ఉండరు.

రైలు పెట్టెకు చివర్లో X మార్క్ ఎందుకుంటుందో తెలుసా...?

రైలు పెట్టె చివర్లో ఇలా X మార్క్ ఉంటే, ఆ రైలు ఎలాంటి సాంకేతిక లోపం లేదని అర్థం. అంతే కాకుండా, రైలు సురక్షితంగా వెళుతోందని సూచిస్తుంది.

రైలు పెట్టెకు చివర్లో X మార్క్ ఎందుకుంటుందో తెలుసా...?

ఇండియన్ రైల్వే ఇప్పుడు ఆ X మార్కు క్రింద ఎర్ర బుగ్గను అందించింది. ఇది ప్రతి ఐదు సెకండ్లకు ఒకసారి వెలుగుతూ ఉంటుంది.

రైలు పెట్టెకు చివర్లో X మార్క్ ఎందుకుంటుందో తెలుసా...?

గతంలో ఈ ఎర్ర బుగ్గ వెలగడానికి ఇంధనాన్ని ఉపయోగించేవారు. అయితే, ఇప్పుడు అన్ని రైళ్లలో కూడా వీటి స్థానంలో ఎలక్ట్రిక్ లైట్లు వచ్చాయి.

రైలు పెట్టెకు చివర్లో X మార్క్ ఎందుకుంటుందో తెలుసా...?

అంతే కాకుండా, X మార్కు క్రింది కుడివైపున LV అక్షరాలు ఉన్న ఒక చిన్న బోర్డు వేళాడుతూ ఉంటుంది. ఎరుపు రంగు బోర్డు మీద తెలుపు లేదా నలుపు రంగులో LV అనే ఆంగ్ల అక్షరాలు ఉంటాయి. ఈ బోర్డు రైలు సురక్షితంగా ఉందనే విషయాన్ని సూచిస్తుంది.

రైలు పెట్టెకు చివర్లో X మార్క్ ఎందుకుంటుందో తెలుసా...?

ఒక వేళ రైలుకు చివర్లో ఈ బోర్డు లేనట్లయితే ఆ రైలులో సమస్య ఉన్నట్లు అర్థం. ఆ బోర్డు ఎక్కడైనా పడిపోతే రైలు ప్రమాదంలో పడ్డట్లే. అంటే ఆ రైలు సాంకేతిక సమస్య ఉంది, అధికారులు వెంటనే రిపేరి చేయాలని సూచిస్తుంది.

Picture credit: Sujith Kumar / Facebook

English summary
Read In Telugu: Tata Nexon Accident Topples The SUV; Crash Reveals Its Build Quality

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark