భారీ వృక్షం మీద పడినా చెక్కు చెదరని టాటా హెక్సా

భారీ వృక్షం టాటా హెక్సా ఎస్‌యూవీ మీద కూలిపోయింది. అయినప్పటికీ హెక్సా ఆ ప్రమాదం నుండి బయటపడింది.

By Anil

ప్రమాదం ఎలా వస్తుందో ఎవరూ ఊహించలేరు. అందుకే మనం నడిపే వాహనాలు ఎలాంటి ప్రమాదాలనైనా ఎదుర్కొనేలా అత్యుత్తమ నిర్మాణ నాణ్యతను కలిగి ఉండాలి. ముంబాయ్‌లో జరిగిన సంఘటనను ఇందుకు ఓ ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

భారీ వృక్షం టాటా హెక్సా ఎస్‌యూవీ మీద కూలిపోయింది. అయినప్పటికీ హెక్సా ఆ ప్రమాదం నుండి బయటపడింది. బరువున్న అంత పెద్ద చెట్టు మీద పడినా కూడా ఏమీ కాలేదంటే హెక్సా నిర్మాణ నాణ్యత ఏ మేరకు ఉందో స్పష్టంగా తెలిసిపోతోంది.

టాటా హెక్సా కూలిన భారీ వృక్షం

టాటా మోటార్స్ విడుదల చేసిన ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ హెక్సాలో నిర్మాణ నాణ్యత పరంగా అద్భుతం చేసింది. నిజమే, ఈ మధ్యనే రోడ్డు ప్రక్కన పార్క్ చేసిన టాటా హెక్సా వెహికల్ మీద భారీ వృక్షం కూలిపోయింది. అయితే, అదృష్టవశాత్తు అందులో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.

టాటా హెక్సా కూలిన భారీ వృక్షం

ముంబయ్‌లో గత వారంలో కురిసిన భారీ వర్షాలకు కొన్ని సంవత్సరాలు వయస్సున్న చెట్లు కూలిపోయాయి. ఈ క్రమంలో ఓ భారీ వృక్షం ఒక వాహనం మీద పడిపోయింది. చెట్టు కూలిపోయిన తరువాత అది ఏ కారో అని గుర్తించడానికి వీల్లేకుండా కారు మొత్తాన్ని చెట్టు కప్పేసింది.

Recommended Video

Tata Nexon Review: Specs
టాటా హెక్సా కూలిన భారీ వృక్షం

అయితే, కూలిపోయిన చెట్టును ముక్కలుగా చేస్తూ, ఒక్క భాగాన్ని తొలగించేసరికి అది టాటా హెక్సా గా గుర్తించారు. హెక్సా ఎస్‌యూవీ ఏ-పిల్లర్, బి-పిల్లర్ మరియు సి-పిల్లర్లను ధృడంగా నిర్మించడంతో భారీ బరువును తట్టుకుంది. ఇదే స్థానంలో మరేదైనా వెహికల్ ఉంటే ఏంటి పరిస్థితి?

టాటా హెక్సా కూలిన భారీ వృక్షం

ప్రస్తుతం టాటా హెక్సా తో పోటీపడుతున్న ఇతర ఎస్‌యూవీలతో పోల్చుకుంటే హెక్సా ఎంతో ధృడమైనది మరియు సురక్షితమైనది. టాటా దీనిని హైడ్రోఫార్మ్‌డ్ ల్యాడర్ ఫ్రేమ్ ఛాసిస్ మీద నిర్మించింది.

టాటా హెక్సా కూలిన భారీ వృక్షం

ఇంజన్ విషయానికి వస్తే, అంతే శక్తివంతమైన పవర్ ఫుల్ 2.52-లీటర్ సామర్థ్యం గల వారికోర్ 40 డీజల్ ఇంజన్ కలదు. 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం గల ఈ ఇంజన్ గరిష్టంగా 154బిహెచ్‌పి పవర్ మరియు 400ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. హెక్సా ఎస్‌యూవీ 4x2 మరియు 4x4 డ్రైవ్ సిస్టమ్‌లో అదే విధంగా 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తోంది.

హెక్సా విడుదల కాక ముందు, ప్రారంభంలో టాటా హెక్సా ఎస్‌యూవీ బోయింగ్ 737 జెట్ విమానాన్ని రన్ మీద లాగి తన శక్తిసామర్థ్యాలను నిరూపించుకుంది. ఓ సాధారణ వెహికల్ విమానాన్ని లాగడమేంటి అనుకుంటున్నారా...? అయితే, టాటా హెక్సా విమానం లాగడాన్ని వీడియో ద్వారా వీక్షించండి.

హెక్సా మీద కస్టమర్లలో మంచి అభిప్రాయాన్ని క్రియేట్ చేసేందుకు టాటా పలురకాల ప్రమోషన్లు నిర్వహించింది. అందులో ఇంకొకటి రెండు చక్రాల మీద హెక్సా డ్రైవ్ చేయడం. ఇలాంటి వాటికి అనుభవజ్ఞుడైన డ్రైవర్ ఉంటే సరిపోతుంది కదా అనుకునే వారు చాలా మంది ఉంటారు. అయితే, రెండు చక్రాలు మీద సర్కిల్ మొత్తం రౌండ్ వేయాలంటే బాడీ బ్యాలెన్సింగ్ ఎంతో ముఖ్యం. అత్యుత్త మ బ్యాలెన్సింగ్ లక్షణాలతో టాట హెక్సా ఎస్‌యూవీని నిర్మించిందని చెప్పడానికి ఈ వీడియో నిదర్శనం.

టాటా హెక్సా కూలిన భారీ వృక్షం

పై వీడియోలో మీరు చూసిన హెక్సా ఎస్‌యూవీలో భారీ ఫీచర్లు ఉన్నాయి. ఇందులో ఫాగ్ ల్యాంప్స్, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, పగటి పూట వెలిగే ఎల్ఇడి స్ట్రిప్స్, అల్లాయ్ వీల్స్, రూఫ్ రెయిల్స్, ఎయిర్ బ్యాగులు, యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, హార్మన్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఎలక్ట్రిక్ పవర్ అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్లు వంటి ఎన్నో ఫీచర్స్ కలవు.

టాటా హెక్సా కూలిన భారీ వృక్షం

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

కొత్త కార్లను అభివృద్ది చేసి, మార్కెట్లోకి విడుదల చేయడానికి ముందే ఆయా మోడళ్లకు ఢీ పరీక్షలను నిర్వహించి ప్రమాద తీవ్రతను ఎంత వరకు తట్టుకోగలవో పరీక్షిస్తాయి. ఆ తరువాత గుర్తింపు పొందిన అంతర్జాతీయ క్రాష్ టెస్ట్ సెంటర్ల చేత పరీక్షిస్తారు. ఈ పరీక్షల్లో వివిధ రకాల టెస్ట్ నిర్వహించి 0 నుండి 5 స్టార్ల వరకు రేటింగ్ లభిస్తుంది.

అయితే టాప్ మొత్తాన్ని బాడీతో అనుసంధానం చేసే పిల్లర్ల ధృడత్వాన్ని పరీక్షించిన దాఖలాలు ఇప్పటి వరకు లేవు. టాటా హెక్సా విషయానికి వస్తే, నాలుగు వైపులా ప్రమాద తీవ్రతను తట్టుకునే సామర్థ్యం అధికంగా ఉంది, దీనికి తోడు భారీ వృక్షం మీద పడటంతో ఆ బరువు ద్వారా వాహనంలో ఎలాంటి మార్పులు జరగలేదు. అంటే పిల్లర్ల ధృడత్వం ఏ మేరకు ఉందో స్పష్టంగా ఈ ఘటన ద్వారా తెలుసుకోవచ్చు.

కాబట్టి మనం చెల్లించే ధరకు భద్రత పరంగా అత్యుత్తమ వెహికల్ టాటా హెక్సా అని నిస్సంకోచంగా చెప్పువచ్చు....

టాటా హెక్సా ధరల కోసం మరియు టాటా హెక్సా గురించిన పూర్తి వివరాలు కోసం....

Most Read Articles

English summary
Read In Telugu: Tata Hexa SUV survives a large tree fall
Story first published: Friday, October 6, 2017, 12:57 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X