మారుతి సుజుకి కార్లపై భారీగా పెరుతున్న ధరలు!!

మారుతి సుజుకి జనవరి 01, 2020 నుండి తమ అన్ని కార్లపై ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఎంత మేరకు ధరల పెంపు ఉంటుందనే విషయమై మారుతి ఎలాంటి ప్రకటన చేయలేదు అయితే, పెట్టుబడి ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ధరల పెంపు చేపడుతున్నట్లు పేర్కొంది.

మారుతి సుజుకి కార్లపై భారీగా పెరుతున్న ధరలు!!

మారుతి సుజుకి ప్రస్తుతం ఆల్టో బేస్ మోడల్ మరియు ఎక్స్ఎల్6 హై-ఎండ్ మోడల్ కార్లను విక్రయిస్తోంది. మారుతి సుజుకి విక్రయిస్తున్న కార్ల ప్రారంభ ధర రూ. 2.89 లక్షలు కాగా గరిష్ట ధర రూ. 11.47 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా).

మారుతి సుజుకి కార్లపై భారీగా పెరుతున్న ధరలు!!

పలు రకాల పెట్టుబడి ఖర్చులు నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో మారుతి తయారు చేస్తున్న అన్ని కార్లను ధరల పెంచనున్నట్లు పేర్కొంది. దీంతో 2020 నుండి కొత్త కార్లను కొనే కస్టమర్లపై అదనపు భారం పడనుంది.

మారుతి సుజుకి కార్లపై భారీగా పెరుతున్న ధరలు!!

నవంబర్ 2019 నెల సేల్స్ మేరకు, మారుతి సుజుకి సేల్స్ 1.9 శాతం తగ్గినట్లు ప్రకటించింది, అంటే 1.51 లక్షల కార్లను విక్రయించింది. ఇందులో దేశీయ విక్రయాలు 1.44 లక్షలతో 1.6 శాతం సేల్స్ పడిపోయాయి.

మారుతి సుజుకి కార్లపై భారీగా పెరుతున్న ధరలు!!

జూలై-ఆగష్టు-సెప్టెంబర్ త్రైమాసికంలో సుమారుగా 39 శాతం నష్టాన్ని చవి చూసింది. గత ఏడాది ఇదే కాలంలో 2,240 కోట్ల ఆదాయం ఆర్జించగా, ఈ యేడు కేవలం రూ. 1,359 కోట్ల లాభం వచ్చింది.

మారుతి సుజుకి కార్లపై భారీగా పెరుతున్న ధరలు!!

మారుతి సుజుకి ఈ ఏడాది ఏప్రిల్ నెలలో చివరిసారిగా ధరలు పెంపు చేపట్టింది. అన్ని మోడళ్ల మీద రూ. 689 మాత్రమే ధరలు పెంచింది. హై సెక్యురిటీ నెంబర్ ప్లేట్‌ను తప్పనిసరి చేయడంతో ఈ ధర పెంచింది.

మారుతి సుజుకి కార్లపై భారీగా పెరుతున్న ధరలు!!

తాజాగా వచ్చిన వార్తల్లో మారుతి సుజుకి గడిచిన 37 ఏళ్లలో 2 కోట్ల కార్లను విక్రయించింది. ఈ రికార్డ్ కైవసం చేసుకున్న ఏకైక ఇండియన్ కంపెనీ మారుతి సుజుకినే. డిసెంబర్ 1983లో తమ తొలి మారుతి 800 కారును డెలివరీ ఇచ్చింది, ఇప్పటి వరకు లెక్కలేనన్ని రికార్డులు కొల్లగొట్టింది.

మారుతి సుజుకి కార్లపై భారీగా పెరుతున్న ధరలు!!

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఈ ఏడాది ఇండియన్ ఆటోమొబైల్ పరిశ్రమ తీవ్ర నష్టాలను చవిచూసింది. ఆశించిన స్థాయిలో సేల్స్ లేకపోవడంతో కంపెనీలు తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్నాయి. దీనికి తోడు పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలోనే స్వల్ప మేర ధరలు పెంచాలని మారుతి నిర్ణయం తీసుకుంది. మారుతితో పాటు పలు ఇతర కంపెనీలు కూడా ధరలు పెంచే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కారు కొనే ఆలోచనలో ఉంటే జనవరి 2020 లోపే మీకు నచ్చిన కారును కొనేయండి.

Most Read Articles

English summary
Maruti Suzuki Prices Hike In India: All Models To Receive An Increase In Price From January 2020. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X