ఎలక్ట్రిక్ వాహనాల్లో ప్రోడక్ట్ డెలివరీలను అందించనున్న అమెజాన్!

అమెజాన్ ఇండియా సాధారణంగా తమ ఉత్పత్తులను డెలివరీ చేయడానికి ద్విచక్రవాహనాలను ఉపయోగించేది. ఇప్పుడు పెరుగుతున్న ఆర్దర్లను, నియమితకాలంలో డెలివరీలు చేయడానికి త్రి వీలర్స్ మరియు ఫోర్ వీలర్స్ ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టింది. దీని గురించి మరిన్ని విషయాలను తెలుసుకుందాం!

ఎలక్ట్రిక్ వాహనాల్లో ప్రోడక్ట్ డెలివరీలను అందించనున్న అమెజాన్!

అమెజాన్ ఇండియా దేశవ్యాప్తంగా ఉత్పత్తులను పంపిణీ చేస్తుంది. ఈ విధంగా పంపిణీ చేయడానికి ఎలక్ట్రిక్ త్రీ వీలర్స్ మరియు ఫోర్ వీలర్స్ ని ప్రవేశపెట్టింది. ప్రస్తుతానికి ఈ వాహనాలు ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్, పూణే, నాగ్‌పూర్, మరియు కోయంబత్తూర్‌తో సహా దాదాపు 20 కి పైగా నగరాల్లో ప్రవేశపెట్టారు.

ఎలక్ట్రిక్ వాహనాల్లో ప్రోడక్ట్ డెలివరీలను అందించనున్న అమెజాన్!

అమెజాన్ ఇండియా OEM తో కలిసి కస్టమర్ల ఆర్దర్లను సురక్షితంగా డెలివరీ చేయడానికి ఈ ఎలక్ట్రిక్ వాహన సముదాయాలను నిర్మించడానికి కృషి చేస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా భారత ఇ-మొబిలిటీ పరిశ్రమలో గణనీయమైన పురోగతి ఉంది. అధునాతన టెక్నాలజీని ఉపయోగించి ఈ ఎలక్ట్రిక్ వాహనాలు ప్రవేశపెట్టింది.

ఎలక్ట్రిక్ వాహనాల్లో ప్రోడక్ట్ డెలివరీలను అందించనున్న అమెజాన్!

ప్రస్తుతానికి అమెజాన్ ఇండియా ఈ వాహనాలను అభివృద్ధి చేయడానికి OEM లతో కలిసి పనిచేస్తోంది. 2025 నాటికి 10,000 ఎలక్ట్రిక్ వాహనాల పరిమాణం, మరియు 2030 నాటికి 1 లక్షకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. అమెజాన్ ఇండియా ఎలక్ట్రిక్ వాహనాలతో డెలివరీ చేయడం ద్వారా సంవత్సరానికి 4 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్బన్ ని ఆదా చేయాలని భావిస్తోంది

ఎలక్ట్రిక్ వాహనాల్లో ప్రోడక్ట్ డెలివరీలను అందించనున్న అమెజాన్!

ఇప్పుడు దేశంలో కూడా ఎలక్ట్రిక్ వాహనాలను అభివృద్ధి చేయడంలో ప్రభుత్వం కూడా దృష్టి సారించింది. ఇదే కాకుండా ఫేమ్ 2 విధానంతో ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసి ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని వేగవంతం చేయడానికి కూడా ప్రభుత్వం సహాయపడుతుంది కంపెనీ తెలిపింది.

అమెజాన్ సిఇఒ జెఫ్ బెజోస్ మాటాడుతూ తమ డెలివరీలకు ఎలక్ట్రిక్ రిక్షాలను ప్రారంభించారని ట్విట్ చేశారు. ఇవి పూర్తిగా విద్యుత్ తో నడుస్తాయి. దీనికి ఎటువంటి కార్బన్ వినియోగించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ ట్వీట్‌లో జెఫ్ బెజోస్ డెలివరీలకు ఉపయోగించే ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లలో ఒకదానిని నడుపుతున్న వీడియో కూడా ఉంది.

ఎలక్ట్రిక్ వాహనాల్లో ప్రోడక్ట్ డెలివరీలను అందించనున్న అమెజాన్!

అమెజాన్ యొక్క కస్టమర్ ఫిల్లిమెంట్ - ఎపిఐసి మరియు ఎమర్జింగ్ మార్కెట్స్ వైస్ ప్రెసిడెంట్ అఖిల్ సక్సేనా మాట్లాడుతూ, అమెజాన్ ఇండియా ఈ విధంగా ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించడానికి ప్రధాన కారణం పర్యావరణ హితాన్ని కోరుకోవడమే అన్నారు. ఇప్పుడు డెలివరీ చేయడానికి 10,000 వాహనాలను విస్తరించడం, ఇంకా రాబోయే రోజుల్లో వీటిని గణనీయంగా పెంచడానికి ఆలోచిస్తున్నాము అన్నారు. ఈ విధంగా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టడం వల్ల ఎటువంటి ఇంధనాలు ఉపయోగించాల్సిన అవసరం లేదు, కాబట్టి పర్యావరణ సమతుల్యతను కాపాడవచ్చు.

ఎలక్ట్రిక్ వాహనాల్లో ప్రోడక్ట్ డెలివరీలను అందించనున్న అమెజాన్!

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం:

కార్బన్ ఉద్గారాల నుండి పర్యావరణాన్ని కాపాడటానికి అమెజాన్ ఇటువంటి చర్య తీసుకోవడం ప్రశంసనీయం. భవిష్యత్ లో ఎలక్ట్రిక్ వాహనాల ఉపయోగం చాలా ఉంటుంది. ఇవన్నీ పర్యావరణాన్ని కాపాడటానికి దోహదం చేస్తాయి. ప్రతి తయారీదారు పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఇటువంటి చర్యలు తీసుకోవడంపై దృష్టి పెట్టాలని మేము భావిస్తున్నాము.

Most Read Articles

English summary
Amazon Introduces Three And Four Wheeler EVs For Product Delivery. Read in Telugu.
Story first published: Wednesday, January 22, 2020, 11:00 [IST]
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X