చార్జింగ్ అయిపోందా? నో టెన్షన్! - ఐఓసీలో బ్యాటరీ స్వాపింగ్ ఆప్షన్!

పెట్రోల్, డీజిల్ ఇంధనాల వినియోగం భారీగా పెరిగిపోయి, భవిష్యత్తులో వీటి కొరత ఏర్పడే అవకాశం ఉన్నందున, రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాలే ప్రధానంగా రాజ్యమేలే అవకాశం ఉంది. రోడ్లపై మెరుగైన ఎలక్ట్రిక్ వాహనాలను అందించేందుకు ఆటోమొబైల్ తయారీదారులు దృష్టి సారించారు. మరోవైపు ఎలక్ట్రిక్ వాహనాల అభివృద్ధికి కావల్సిన నెట్‌వర్క్‌ను బలోపేతం చేయటంలో ఇతర కంపెనీలు కూడా కీలక పాత్రలను పోషిస్తున్నాయి.

చార్జింగ్ అయిపోందా? నో టెన్షన్! - ఐఓసీలో బ్యాటరీ స్వాపింగ్ ఆప్షన్!

ప్రస్తుతం మన దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి ప్రధాన అటంగా ఉన్న సమస్య, వాటి పరిధి. భారతీయ రోడ్లపై ఎలక్ట్రిక్ వాహనాల పరిధి తక్కువగా ఉంటోంది, కొంత దూరం ప్రయాణించాక అకస్మాత్తుగా వాటిలో చార్జింగ్ అయిపోతే, ఏంచేయాలో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో, ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ ఓ కొత్త ప్రణాళికతో ముందుకొచ్చింది.

చార్జింగ్ అయిపోందా? నో టెన్షన్! - ఐఓసీలో బ్యాటరీ స్వాపింగ్ ఆప్షన్!

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసి) ఇప్పటికే ఈ తరహా విధానాన్ని ఛండీఘడ్‌లో ప్రారరంభించింది. ఎలక్ట్రిక్ వాహనాలను త్వరగా ఛార్జ్ చేయడానికి బ్యాటరీ మార్పిడి సౌకర్యాన్ని స్టార్ట్ చేసింది. ఇందు కోసం దేశంలోనే మొట్టమొదటి క్విక్ ఇంటర్‌చేంజ్ సర్వీస్ (క్యూఐఎస్) వ్యవస్థను ఛండీఘడ్‌లోని ఓ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులో ప్రారంభించారు.

MOST READ: చూడటానికి కార్ లాగా కనిపించే కొత్త ఎలక్ట్రిక్ బైక్

చార్జింగ్ అయిపోందా? నో టెన్షన్! - ఐఓసీలో బ్యాటరీ స్వాపింగ్ ఆప్షన్!

ప్రారంభంలో భాగంగా, వాణిజ్య వాహనాల విభాగంలో ఈ బ్యాటరీ మార్పిడి విధానాన్ని అవలంభించనున్నారు. అంటే ఫ్యాక్టరీ ఫిట్టెడ్ లేదా రెట్రోఫిట్ చేయబడిన ఎలక్ట్రిక్ ఆటోలు, రిక్షాలు మరియు ఎలక్ట్రిక్ 2-వీలర్లలో చార్జింగ్ అయితే, ఆ బ్యాటరీని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులో ఇచ్చి కొంత మొత్తాన్ని చెల్లించి వేరొక బ్యాటరీని బిగించుకొని వెళ్లవచ్చు.

చార్జింగ్ అయిపోందా? నో టెన్షన్! - ఐఓసీలో బ్యాటరీ స్వాపింగ్ ఆప్షన్!

ఇందుకోసం ఇండియన్ ఆయిల్ సంస్థ సన్ మొబిలిటీ కంపెనీతో ఓ నాన్-బైండింగ్ వ్యూహాత్మక సహకార ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ మేరకు ఇరు కంపెనీ ఒప్పంద పత్రంపై సంతకాలు చేశాయి. తొలుతగా ఈ సేవలను న్యూఢిల్లీ, గుర్గావ్, బెంగళూరు, చండీఘడ్, అమృత్‌సర్‌లలో ఉన్న ఇండియన్ ఆయిల్ అవుట్లెట్లలో ప్రారంభించనున్నారు. ఇందు కోసం బ్యాటరీ మార్పిడి పద్ధతికి కావల్సిన మౌలిక సదుపాయాలను పెట్రోల్ బంకుల్లో ఏర్పాటు చేశారు.

MOST READ: భారత్ - చైనా సరిహద్దులో ఇండియన్ ఆర్మీ ఉపయోగించే బైక్స్

చార్జింగ్ అయిపోందా? నో టెన్షన్! - ఐఓసీలో బ్యాటరీ స్వాపింగ్ ఆప్షన్!

ఈ అవుట్‌లెట్లలో 14 బ్యాటరీలు, ప్రీలోడ్ చేసిన కార్డులు, బ్యాటరీలు మార్చుకోవడానికి టచ్ స్క్రీన్ మరియు విద్యుత్ సబ్ మీటర్ ఉంటాయి.

చార్జింగ్ అయిపోందా? నో టెన్షన్! - ఐఓసీలో బ్యాటరీ స్వాపింగ్ ఆప్షన్!

ఇక ఇతర ఆటో వార్తలను గమనిస్తే, హ్యుందాయ్ అందిస్తున్న పాపులర్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ వెన్యూ, గత సంవత్సరం మార్కెట్లో విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకూ 1 లక్ష యూనిట్ల అమ్మకాల మార్కును దాటింది. హ్యుందాయ్ భారతదేశంలో 97,400 యూనిట్ల వెన్యూ వాహనాలను విక్రయించగా, అంతర్జాతీయ మార్కెట్లలో 7,400 యూనిట్లను విక్రయించింది.

MOST READ: సాహస యాత్రలు చేయాలనుకుంటున్నారా.. అయితే భారతదేశంలో అత్యంత ఎత్తైన మోటార్ రహదారులు ఇవే

చార్జింగ్ అయిపోందా? నో టెన్షన్! - ఐఓసీలో బ్యాటరీ స్వాపింగ్ ఆప్షన్!

కప్పా 1.0-లీటర్ టి-జిడి పెట్రోల్ ఇంజన్‌తో లభించే హ్యుందాయ్ ఈ మోడల్ మొత్తం అమ్మకాలలో దాదాపు 44 శాతం వాటాను దక్కించుకుంది. ఇది అత్యంత ప్రజాదరణ పొందిన ఇంజన్‌గా నిలిచింది. ఇకపోతే ఇందులో 30 శాతం అమ్మకాలు 1.5 లీటర్ యు2 సిఆర్‌డి డీజిల్ బిఎస్ 6 ఇంజన్ నుండి వచ్చినట్లు కంపెనీ పేర్కొంది. అంతేకాకుండా, సుమారు 30,000 వేల మంది హ్యుందాయ్ వెన్యూ కస్టమర్లు బ్లూలింక్ కనెక్టెడ్ టెక్నాలజీతో లభించే వేరియంట్లను ఎంచుకున్నట్లు కంపెనీ తెలిపింది.

చార్జింగ్ అయిపోందా? నో టెన్షన్! - ఐఓసీలో బ్యాటరీ స్వాపింగ్ ఆప్షన్!

హ్యుందాయ్ ఇటీవలే బిఎస్ 6-కంప్లైంట్ డీజిల్ పవర్డ్ ఎలంట్రా సెడాన్‌ను ఎస్ఎక్స్ మరియు ఎస్ఎక్స్ (ఓ) అనే రెండు వేరియంట్లలో విడుదల చేసింది. ఎలంట్రా డీజిల్ బేస్ వేరియంట్ ప్రారంభ ధర రూ.18.70 లక్షలు మరియు టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ.20.65 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్)గా ఉన్నాయి.

MOST READ: ముంబైలో కనుమరుగు కానున్న ప్రీమియర్ పద్మిని టాక్సీలు, ఎందుకో తెలుసా ?

చార్జింగ్ అయిపోందా? నో టెన్షన్! - ఐఓసీలో బ్యాటరీ స్వాపింగ్ ఆప్షన్!

ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకుల్లో ఎలక్ట్రిక్ వాహనాల కోసం బ్యాటరీ స్వాపింగ్ సిస్టమ్‌ను ప్రారంభించడంపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ఎలక్ట్రిక్ వాహనాల పరిధిని పెంచడం కోసం ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ ప్రారంభించిన ఈ కొత్త ప్రణాళిక చాలా ప్రసంశనీయమైనది. ఇది ఎలక్ట్రిక్ వాహనాలను వాటి పూర్తి సామర్థ్యానికి వినియోగించేలా సహాయపడుతుంది, అదే సమయంలో పర్యావరణాన్ని కూడా మేలు చేసినట్లు అవుతుంది.

Most Read Articles

English summary
Electric vehicles are said to be the future of mobility as our natural resources (petrol & diesel) are getting scarce. Manufacturers are focusing on getting better EVs on the roads. One thing that is a disadvantage in an electric vehicle is the range. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X