16 ఏళ్లుగా నేనే నెంబర్ వన్: మారుతి సుజుకి ఆల్టో

మారుతి సుజుకి ఇండియా విక్రయిస్తున్న పాపులర్ స్మాల్ కార్ 'ఆల్టో 800' (Alto 800)కి భారత కార్ మార్కెట్లో ఓ ప్రత్యేకమైన డిమాండ్ ఉంది. ఎంట్రీ-లెవల్ కార్ సెగ్మెంట్లో బడ్జెట్ ధరలో అందుబాటులో ఉన్న ఈ కారు అమ్మకాల పరంగా దూసుకుపోతుంది. వరుసగా 16వ సంత్సరం కూడా మారుతి సుజుకి ఆల్టో కారు దేశంలో కెల్లా అత్యధికంగా అమ్ముడవుతున్న కారుగా అగ్రస్థానంలో నిలిచింది.

16 ఏళ్లుగా నేనే నెంబర్ వన్: మారుతి సుజుకి ఆల్టో

మద్యతరగతి ప్రజలు కలల కారుగా మారుతి ఆల్టో వారి గుండెల్లో ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకుంది. తొలిసారిగా కారును కొనుగోలు చేసేవారి మొదటి ఎంపిక మారుతి ఆల్టో.

మారుతి సుజుకి మొట్టమొదటి సారిగా ఆల్టో కారును 2002లో భారత మార్కెట్లో విడుదల చేసింది. ఆ తర్వాత మారుతి ఈ మోడల్‌లో అనేక మార్పులు చేస్తూ, ఎప్పటికప్పుడు అప్‌గ్రేడెడ్ వెర్షన్లను ప్రవేశపెడుతూ వచ్చింది. అప్పటి నుండి ఇప్పటి వరకూ భారతీయులు అత్యధికంగా అభిమానంచే కారుగా మంచి పాపులారిటీని దక్కించుకుంది.

16 ఏళ్లుగా నేనే నెంబర్ వన్: మారుతి సుజుకి ఆల్టో

మారుతి ఆల్టో మొట్టమొదటి సారిగా 2004లో భారతదేశంలో కెల్లా అత్యధికంగా అమ్ముడవుతున్న కారుగా రికార్డు దక్కించుకుంది. అప్పటి నుంచి 16 ఏళ్లుగా ఆల్టో తన అగ్రస్థాన్ని అలానే నిలుపుకుంటూ వచ్చింది. మారుతి ఆల్టో కారుకి వచ్చిన మాస్ రెస్ఫాన్స్ దేశంలో మరే ఇతర కారుకి రాలేదు.

16 ఏళ్లుగా నేనే నెంబర్ వన్: మారుతి సుజుకి ఆల్టో

కాంపాక్ట్ డిజైన్, మోడ్రన్ స్టైలింగ్, లేటెస్ట్ టెక్నాలజీ, బెటర్ మైలేజ్ మరియు సరసమైన ధరలే ఈ మోడల్ విజయానికి ప్రధాన కారణాలు. చిన్న పరిమాణంలో ఉండే ఈ ఫ్యామిలీ కార్ రద్దీగా ఉండే నగర వీధుల్లో సులువుగా దూసుకెళ్లిపోతుంది. ఈ సెగ్మెంట్లో ఇది ప్రయాణీకులకు అత్యుత్తమ భద్రతను అందిస్తుంది.

16 ఏళ్లుగా నేనే నెంబర్ వన్: మారుతి సుజుకి ఆల్టో

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న మారుతి ఆల్టో కారుని ఏరో ఎడ్జ్ డిజైన్ మరియు కొత్త-తరం సేఫ్టీ ఫీచర్లతో తయారు చేశారు. సన్నగా ఉండే బ్లాక్ కలర్ గ్రిల్, ఫ్రంట్ బంపరుపై పెద్ద హనీకోంబ్ డిజైన్ గ్రిల్ మరియు అందులోని పెద్ద ఎయిర్ డ్యామ్‌తో ఇదొక అద్భుతమైన ఓనర్‌షిప్ అనుభూతిని అందిస్తుంది.

16 ఏళ్లుగా నేనే నెంబర్ వన్: మారుతి సుజుకి ఆల్టో

కొత్త మారుతి ఆల్టో చూడటానికి కాస్తంత అటూ ఇటుగా పాత మోడళ్ల మాదిరిగానే కనిపించినప్పటికీ, కంపెనీ ఇందులో 800 అనే బ్యాడ్జింగ్‌ని తీసివేసింది. ఈ కారు 796సీసీ త్రీ-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌తో కానీ లేదా సిఎన్‌జి ఇంజన్‌తో కానీ వస్తుంది. ఇవి రెండూ కూడా 48 బిహెచ్‌పిల శక్తిని, 69 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తాయి. రెండు ఇంజన్లు స్టాండర్డ్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తాయి.

16 ఏళ్లుగా నేనే నెంబర్ వన్: మారుతి సుజుకి ఆల్టో

మారుతి సుజుకి ఆల్టోలో డ్యూయెల్ టోన్ డ్యాష్‌బోర్డ్, యూఎస్‌బి, బ్లూటూత్ మరియు ఆక్స్-ఇన్ కనెక్టివిటీతో కూడిన డబుల్ డిన్ ఆడియో సిస్టమ్ వంటి ఫీచర్లున్నాయి. టాప్-ఎండ్ వేరియంట్ మారుతి ఆల్టో కారులో కీలెస్ ఎంట్రీ, సెంట్రల్ డోర్ లాకింగ్ సిస్టమ్, ముందువైపు పవర్ విండోస్, లోపలి వైపు నుంచి సర్దుబాటు చేయగలిగే సైడ్ మిర్రర్స్ వంటి ఫీచర్లు లభిస్తాయి.

16 ఏళ్లుగా నేనే నెంబర్ వన్: మారుతి సుజుకి ఆల్టో

సేఫ్టీ విషయానికి వస్తే.. ఈ చిన్నకారులో పెద్ద సేఫ్టీ ఫీచర్లే ఉన్నాయి. ఈబిడి (ఎలక్ట్రానిక్ బ్రేక్ అసిస్ట్)తో కూడిన ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), డ్రవైర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్, సీట్‌బెల్ట్ రిమైండర్, హై-స్పీడ్ అలెర్ట్ సిస్టమ్, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ వంటి ఫీచర్లు లభిస్తాయి.

16 ఏళ్లుగా నేనే నెంబర్ వన్: మారుతి సుజుకి ఆల్టో

ఎనిమిది వేరియంట్లు, ఆరు రంగుల్లో లభించే మారుతి సుజుకి ఆల్టో కారు ధరలు ప్రస్తుతం రూ.3 లక్షల నుంచి రూ.4.37 లక్షల మధ్యలో (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ఉన్నాయి.

16 ఏళ్లుగా నేనే నెంబర్ వన్: మారుతి సుజుకి ఆల్టో

మారుతి ఆల్టో అరుదైన మైలురాయిపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

మారుతి సుజుకి బ్రాండ్‌కి భారతీయ మార్కెట్లో ప్రత్యేకమైన ఆదరణ ఉంది. కొన్ని దశాబ్ధాలుగా దేశీయ కస్టమర్లకు విస్తృతమైన సేవలు, వినూత్నమైన ఉత్పత్తులను అందిస్తున్న మారుతి సుజుకి తయారు చేస్తున్న మేడ్ ఇన్ ఇండియా కారు 'ఆల్టో' అంటే ఇష్టపడని వారెవ్వరూ ఉండరు. మొదటి సారిగా కారు కొనేవారికి చూడటానికి ముద్దుగా కనిపించే ఈ ఫ్యామిలీ కారు బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, June 16, 2020, 11:42 [IST]
English summary
The Maruti Suzuki Alto has retained its crown as the country's best-selling car for the 16th consecutive year. The hatchback has rather consistently remained 'the' choice for first time car owners. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+