తొలిసారి రోడ్డెక్కిన మారుతి వ్యాగన్ఆర్ ఎలక్ట్రిక్ కారు

మారుతి సుజుకి వ్యాగన్ఆర్ ఎలక్ట్రిక్ కారును ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ చేసేందుకు సర్వం చేసుకుంది. ఇండియన్ రోడ్ల మీద పరీక్షలు పూర్తి చేసుకున్న వ్యాగన్ఆర్ ఎలక్ట్రిక్ ఢిల్లీలో జరగబోయే 2020 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో ప్రజా సందర్శనకు రానుంది.

ఇప్పటి వరకూ పెట్రోల్ మరియు డీజల్ కార్లను తీసుకొచ్చిన మారుతి సుజుకి, ఇప్పుడు వ్యాగన్ఆర్ ఎలక్ట్రిక్ కారుతో దేశీయ ఎలక్ట్రిక్ కార్ల పరిశ్రమలోకి ప్రవేశిస్తోంది.

తొలిసారి రోడ్డెక్కిన మారుతి వ్యాగన్ఆర్ ఎలక్ట్రిక్ కారు

ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించడానికి ముందే 91వీల్స్ అనే వెబ్‌సైట్ మారుతి వ్యాగన్ఆర్ ఎలక్ట్రిక్ కారును రహస్యంగా పరీక్షిస్తున్నపుడు సేకరించిన ఫోటోలతో వీడియోను తయారు చేసింది. ప్రత్యేకించి ఇంటీరియర్‌కు సంభందించిన వివరాలు బయటికొచ్చాయి.

ఇంటీరియర్‌లో అతి పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, గేర్ లీవర్ పక్కనే బి మరియు డి అనే అక్షరాలు ఉన్నాయి. ఎలక్ట్రిక్ వెర్షన్‌లో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ మాత్రమే ఉంటుంది కాబట్టి, బహుశా డ్రైవింగ్ మోడ్స్ ఉండవచ్చు.

తొలిసారి రోడ్డెక్కిన మారుతి వ్యాగన్ఆర్ ఎలక్ట్రిక్ కారు

డ్యాష్‌బోర్డ్ మీదున్న ఫీచర్లు గుర్తించడానికి వీల్లేకుండా బ్లాక్ పేపర్‌తో కవర్ చేశారు. సెంటర్ కన్సోల్ మీద పొడవాటి ఏసీ వెంట్స్, వీటి చుట్టూ క్రోమ్ ఫినిషింగ్స్ చూడవచ్చు. ఇన్ఫోటైన్‌మెంట్ కిందనే క్లైమేట్ కంట్రోల్ ఫంక్షన్స్ కోసం మరో చిన్న డిస్ల్పే కూడా అందించారు.

తొలిసారి రోడ్డెక్కిన మారుతి వ్యాగన్ఆర్ ఎలక్ట్రిక్ కారు

ఎక్ట్సీరియర్‌లో ఇగ్నిస్ నుండి సేకరించిన అల్లాయ్ వీల్స్, ఫ్రంట్ డిజైన్ కనబడకుండా పూర్తిగా కవర్ చేశారు. రియర్ డిజైన్‌లో పొడవాటి టెయిల్ లైట్లు, రియర్ విండో వైపర్ మరియు చలి కాలంలో కురిసే మంచును కరిగించేందుకు అద్దాలలో ఢీఫాగర్ టెక్నాలజీని కూడా జోడించారు.

తొలిసారి రోడ్డెక్కిన మారుతి వ్యాగన్ఆర్ ఎలక్ట్రిక్ కారు

మారుతి సుజుకి వ్యాగన్ఆర్ ఎలక్ట్రిక్ కారును గత ఏడాదిలో 50 మార్లుకు పైగా పరీక్షలు నిర్వహించింది. భారతీయ రహదారులకు సరిపోయేలా సిద్దం చేసేందుకుగాను ఈ పరీక్షలు నిర్వహించారు.

తొలిసారి రోడ్డెక్కిన మారుతి వ్యాగన్ఆర్ ఎలక్ట్రిక్ కారు

మారుతి సుజుకి వ్యాగన్ఆర్ ఎలక్ట్రిక్ కారుకు సంబంధించిన సాంకేతిక వివరాలను ఇంకా రివీల్ చేయలేదు. సిగంల్ ఛార్జింగ్‌తో కనీసం 200కిలోమీటర్లు ప్రయాణించే బ్యాటరీ ప్యాక్‌తో రానుంది. రెగ్యులర్ మరియు ఫాస్ట్-ఛార్జింగ్ రెండు ఆప్షన్లలో కూడా రానుంది.

తొలిసారి రోడ్డెక్కిన మారుతి వ్యాగన్ఆర్ ఎలక్ట్రిక్ కారు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

మారుతి సుజుకి వ్యాగన్ఆర్ ఎలక్ట్రిక్ కారును అత్యుత్తమ మైలేజ్ రేంజ్‌తో బడ్జెట్ ధరలో తీసుకొచ్చే ఆలోచనలో ఉంది. వ్యాగన్ఆర్ ఎలక్ట్రిక్ ఇండియాలో కంపెనీ యొక్క మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు కావడంతో అంచనాలు కూడా అధికంగా ఉన్నాయి.

Most Read Articles

English summary
New Maruti WagonR Interiors Spied For The First Time: Spy Pics, Video & Details. Read in Telugu.
Story first published: Monday, January 13, 2020, 11:31 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X