ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టిన మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌ఇ, ధర రూ. 73.70 లక్షలు

మెర్సిడెస్ బెంజ్ ఇండియా తన కొత్త జిఎల్‌ఇ ఎస్‌యూవీని ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. నాల్గవ తరం మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌ఇ బేస్ 300 డి వేరియంట్‌ ప్రారంభ ధర రూ. 73.70 లక్షలతో అందించబడుతుంది. టాప్-స్పెక్ జిఎల్‌ఇ 400 డి ఎల్‌డబ్ల్యుబి ధర 1.25 కోట్ల రూపాయలు (ఎక్స్-షోరూమ్,ఇండియా).

ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టిన మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌ఇ, ధర రూ. 73.70 లక్షలు

కొత్తగా మార్కెట్లోకి విడుదలైన నాల్గవ తరం బెంజ్ జిఎల్‌ఇ ఎస్‌యూవీ లో అదనపు ఫీచర్స్ తో పాటు కొన్ని స్వల్ప మార్పులు కూడా ఉన్నాయి. 2020 మెర్సిడెస్ బెంజ్ జర్మన్ బ్రాండ్ నుంచి ఈ ఏడాది భారత మార్కెట్లోకి వచ్చిన ఫస్ట్ లాంచ్. ఇది మాత్రమే కాకుండా ఈ ఏడాది దాదాపు 10 ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేయాలని కంపెనీ యోచిస్తోంది.

ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టిన మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌ఇ, ధర రూ. 73.70 లక్షలు

కొత్త మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌ఇ గురించి మాట్లాడుతూ ఈ ఎస్‌యూవీ మరింత సొగసైన డిజైన్‌తో, మరింత వంగిన అంచులతో వస్తుంది. ఫ్రంట్ డిజైన్ మాత్రం బ్రాండ్ యొక్క ట్రెడిషినల్ ట్విన్-స్లాట్ క్రోమ్ గ్రిల్‌తో మెర్సిడెస్ బెంజ్ ‘త్రీ-పాయింటెడ్ స్టార్' దాని కేంద్రంలో వస్తుంది. ఇంకా ట్విన్-ఐబ్రో ఎల్‌ఈడీ డిఆర్‌ఎల్‌లు మరియు వెనుక వైపున ఎల్‌ఇడి టైల్లైట్‌లతో అప్‌డేట్ చేసిన హెడ్‌ల్యాంప్‌లు ఉన్నాయి.

ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టిన మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌ఇ, ధర రూ. 73.70 లక్షలు

కొత్త మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌ఇ లో డ్యూయల్ 12.3-అంగుళాల స్క్రీన్ సెటప్‌ ఉంటుంది. ఒకటి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు రెండవది టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్. జిఎల్‌ఇ ఎస్‌యూవీ లగ్జరీ జర్మన్ బ్రాండ్ నుండి మెర్సిడెస్ బెంజ్ యొక్క MBUX కనెక్ట్ టెక్నాలజీని అందించే రెండవ ఉత్పత్తి అవుతుంది.

ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టిన మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌ఇ, ధర రూ. 73.70 లక్షలు

2020 మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌ఇలోని ఫీచర్స్ ని గమనించినట్లయితే ఇందులో ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే, బర్మెస్టర్ సరౌండ్ సౌండ్ సిస్టమ్, ఎయిర్‌మాటిక్ ఎయిర్ సస్పెన్షన్, మెమరీ ఫంక్షన్‌తో ఎలక్ట్రికల్లీ కంట్రోల్డ్ ఫ్రంట్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, నాలుగు- జోన్ థర్మోట్రోనిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు అదర్ హోస్ట్ వంటివి ఉంటాయి.

ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టిన మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌ఇ, ధర రూ. 73.70 లక్షలు

కొత్త జిఎల్‌ఇ ఎస్‌యూవీలో భద్రతా లక్షణాలలో ఎబిఎస్ విత్ ఇబిడి, తొమ్మిది-ఎయిర్‌బ్యాగులు, పార్క్ అసిస్ట్, 360-డిగ్రీ కెమెరా మరియు రియర్ పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి.

ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టిన మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌ఇ, ధర రూ. 73.70 లక్షలు

కొత్త మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌ఇ ఎస్‌యువి 300 డి మరియు 400 డి ఎల్‌డబ్ల్యుబి అనే రెండు వేరియంట్లలో అందించబడుతుంది. జిఎల్‌ఇ ఎస్‌యూవీలోని రెండు డీజిల్ ఇంజన్లు 2020 ఏప్రిల్ 1 నుండి భారతదేశంలో అమలు చేయబోయే కఠినమైన బిఎస్ 6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఉంటాయి.

ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టిన మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌ఇ, ధర రూ. 73.70 లక్షలు

మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌ఇ 300 డి 2.0 లీటర్ నాలుగు సిలిండర్ యూనిట్ ద్వారా 245 బిహెచ్‌పి మరియు 500 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. మరోవైపు పెద్ద జిఎల్‌ఇ 400 డి 3.0-లీటర్ సిక్స్ సిలిండర్ యూనిట్ ద్వారా 330 బిహెచ్‌పి మరియు 700 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. రెండు ఇంజన్లు స్టాండర్డ్ 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ యూనిట్‌కు జతచేయబడి ఉంటాయి.

ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టిన మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌ఇ, ధర రూ. 73.70 లక్షలు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

2020 మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌ఇ భారత మార్కెట్లో బ్రాండ్ యొక్క నాల్గవ తరం మోడల్. భారతదేశంలోని మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌ఇ బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్ 5 మరియు ఆడి క్యూ 7 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉండబోతోంది.

Most Read Articles

English summary
2020 Mercedes-Benz GLE Launched In India: Prices Start At Rs 73.70 Lakh. Read in Telugu.
Story first published: Wednesday, January 29, 2020, 17:40 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X