కొత్త 2020 మహీంద్రా థార్ బుకింగ్స్ ప్రారంభం; అక్టోబర్ 2న విడుదల

ప్రముఖ దేశీయ యుటిలిటీ వాహన దిగ్గజం మహీంద్రా ఇటీవలే ఆవిష్కరించిన తమ సరికొత్త తరం 2020 మహీంద్రా థార్ కోసం అధికారికంగా బుకింగ్‌లను స్వీకరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ అధునాతన ఆఫ్-రోడర్‌ను అక్టోబర్ 2, 2020వ తేదీన మార్కెట్లో విడుదల చేయన్నట్లు కంపెనీ తెలిపింది. ఇందుకు సంబంధించి మహీంద్రా ఓ టీజర్ వీడియోని కూడా విడుదల చేసింది.

కొత్త 2020 మహీంద్రా థార్ బుకింగ్స్ ప్రారంభం; అక్టోబర్ 2న విడుదల

సరికొత్త డిజైన్, ఫీచర్స్, పెర్ఫార్మెన్స్ మరియు టెక్నాలజీలతో రూపుదిద్దుకున్న ఈ కొత్త తరం మహీంద్రా థార్ ఇప్పటికే మార్కెట్లో మంచి హైప్ తెచ్చకుంది. సరికొత్త ప్లాట్‌ఫామ్, పూర్తిగా రీడిజైన్ చేయబడిన రూపం, భారీగా అప్‌గ్రేడ్ చేసిన ఇంటీరియర్స్ వంటి ఫీచర్లతో కొత్త తరం థార్‌ను తయారు చేశారు.

ఈ కొత్త తరం మహీంద్రా థార్‌లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఇందులోని అప్‌డేట్ చేయబడిన ఇంజన్ ఆప్షన్స్ గురించి. ఇందులో 2.0-లీటర్ టి-జిడి ఎమ్‌స్టాలియన్ పెట్రోల్ ఇంజన్ మరియు 2.2-లీటర్ ఎమ్‌హాక్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. పెట్రోల్ ఇంజన్ 150 బిహెచ్‌పి పవర్‌ను మరియు 320 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. డీజిల్ ఇంజన్ 130 బిహెచ్‌పి మరియు 300 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

కొత్త 2020 మహీంద్రా థార్ బుకింగ్స్ ప్రారంభం; అక్టోబర్ 2న విడుదల

ఈ రెండు ఇంజన్లు సిక్స్-స్పీడ్ మాన్యువల్ లేదా సిక్స్-స్పీడ్ టార్క్-కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తాయి. అంతేకాకుండా, ఇందులోని అన్ని మోడళ్లను స్టాండర్డ్‌గా షిఫ్ట్-ఆన్-ఫ్లై ఫోర్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌తో అందించనున్నారు.

కొత్త 2020 మహీంద్రా థార్ బుకింగ్స్ ప్రారంభం; అక్టోబర్ 2న విడుదల

అప్‌డేట్ చేయబడిన మహీంద్రా థార్ ఆఫ్-రోడ్ ఎస్‌యూవీ రెండు వేరియంట్లలో లభ్యం కానుంది. అవి: ఏఎక్స్ మరియు ఎల్ఎక్స్. ఏఎక్స్ వేరియంట్ చాలా తక్కువ ఎలక్ట్రానిక్స్ అసిస్టెన్స్ ఫీచర్లతో హార్డ్‌కోర్ ఆఫ్-రోడ్ ఔత్సాహికులను ఉద్దేశించి డిజైన్ చేయబడినది. ఇకపోతే టాప్-ఎండ్ ఎల్ఎక్స్ వేరియంట్ మార్కెట్లో సాధారణ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకొని అప్‌డేటెడ్ ఎలక్ట్రానిక్స్ ప్యాకేజీతో తయారు చేయబడినది.

కొత్త 2020 మహీంద్రా థార్ బుకింగ్స్ ప్రారంభం; అక్టోబర్ 2న విడుదల

మునుపటి తరం మోడల్‌తో కొత్త తరం థార్ ఎస్‌యూవీలో డిజైన్, ఫీచర్స్, ఇంజన్, పెర్ఫార్మెన్స్, టెక్నాలజీ పరంగా అనేక మార్పులు చేర్పులు ఉన్నాయి. ఇది ఇదివరకటి థార్ కన్నా మరింత మెరుగ్గా ఉంటుంది. మహీంద్రా ఈ కొత్త 2020 థార్ మోడల్‌ను కేవలం ఆఫ్-రోడ్ ప్రయోజనాల కోసం మాత్రమే కాకుండా, రెగ్యులర్‌గా ఉపయోగించుకునే వాహనం మాదిరిగా కూడా తయారు చేసింది.

కొత్త 2020 మహీంద్రా థార్ బుకింగ్స్ ప్రారంభం; అక్టోబర్ 2న విడుదల

అప్‌డేట్ చేయబడిన ఈ కొత్త ఎస్‌యూవీలో సరికొత్త గ్రిల్ డిజైన్, హెడ్‌ల్యాంప్స్, ఫ్రంట్ బంపర్‌పై స్కఫ్ ప్లేట్లతో ఇది కొత్త ఫ్రంట్ ఫాసియాను కలిగి ఉంటుంది. ఇంకా ఇందులో కొత్త 18 ఇంచ్ వీల్స్ మరియు కొత్త టెయిల్ లైట్స్ డిజైన్‌ను కూడా గమనించవచ్చు. మహీంద్రా మొట్టమొదటిసారిగా ఈ ఆఫ్‌-రోడర్‌కు ఫ్యాక్టరీ ఫిట్టెడ్ హార్డ్-టాప్‌ను కూడా అందిస్తోంది.

కొత్త 2020 మహీంద్రా థార్ బుకింగ్స్ ప్రారంభం; అక్టోబర్ 2న విడుదల

ఇంటీరియర్స్ విషయానికి వస్తే, ఈ కొత్త ఎస్‌యూవీలో ఇప్పుడు అనేక ఫీచర్లు మరియు పరికరాలను జోడించారు. ఇందులో ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లేకు సపోర్ట్ ఇచ్చే 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, క్రూయిజ్ కంట్రోల్, మాన్యువల్ షిఫ్ట్-ఆన్-ఫ్లై 4x4 సిస్టమ్, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు రూఫ్-మౌంటెడ్ స్పీకర్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

కొత్త 2020 మహీంద్రా థార్ బుకింగ్స్ ప్రారంభం; అక్టోబర్ 2న విడుదల

కొత్త 2020 మహీంద్రా థార్ వివిధ రకాల సీటింగ్ కాన్ఫిగరేషన్లతో లభిస్తుంది. కస్టమర్ ఎంచుకునే వేరియంట్‌ను బట్టి ఇందులో నాలుగు ఫ్రంట్ ఫేసింగ్ సీట్లు లేదా రెండు ఫ్రంట్ మరియు నాలుగు సైడ్ ఫేసింగ్ సీట్ల ఆప్షన్‌లో ఇది లభిస్తుంది. మార్కెట్లో దీని ధరలు రూ.9.75 లక్షల నుండి రూ.12.49 లక్షల మధ్యలో ఉండొచ్చని అంచనా (అన్ని ఎక్స్-షోరూమ్, ధరలు).

కొత్త 2020 మహీంద్రా థార్ బుకింగ్స్ ప్రారంభం; అక్టోబర్ 2న విడుదల

మహీంద్రాకు సంబంధించిన ఇటీవలి వార్తలను గమనిస్తే, కంపెనీ తమ మొట్టమొదటి 2020 థార్ ఎస్‌యూవీని చారిటీ కోసం వేలం వేయనున్నట్లు కంపెనీ పేర్కొంది. దేశంలోనే మొట్టమొదటి మహీంద్రా థార్ ఎస్‌యూవీని ఈ వేలంలో అత్యధికంగా బిడ్ చేసిన వారికి విక్రయించనున్నారు. కస్టమర్స్ బిడ్ చేసిన మొత్తానికి సమానంగా మహీంద్రా కూడా తమ వంతుగా అంతే మొత్తాన్ని జోడించి, ఆ రెండింటినీ కలిపి చారిటీ కోసం దానం చేయనున్నారు. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

కొత్త 2020 మహీంద్రా థార్ బుకింగ్స్ ప్రారంభం; అక్టోబర్ 2న విడుదల

కొత్త 2020 మహీంద్రా థార్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

దేశంలో లభిస్తున్న ఆఫ్-రోడ్ వాహనాలలో మహీంద్రా థార్ ఎప్పటి నుంచో ధరకు తగిన విలువను అందిస్తూ, మార్కెట్లోనే అత్యుత్తమ ఆఫ్-రోడ్ వాహనంగా ఉంది. కొత్తగా వస్తున్న 2020 మహీంద్రా థార్ ఖచ్చితంగా దాని మునుపటి తరం మోడళ్ల కన్నా ఎన్నో రెట్లు మెరుగ్గా అనిపిస్తుంది. ఈ కొత్త తరం ఎస్‌యూవీ ఇప్పుడు మరింత మెరుగైన స్థలం, ప్రీమియం ఇంటీరియర్స్, కొత్త ఇంజన్ ఆప్షన్స్ మరియు తాజా డిజైన్‌ను కలిగి ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Monday, September 28, 2020, 11:25 [IST]
English summary
Mahindra will be launching the new Thar on October 2, 2020, in India. The company will be announcing the prices and begin to accept bookings for the updated offroader on the same day. The company recently launched a teaser video confirming the news. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+