మొట్టమొదటి మహీంద్రా థార్ ఎవరికో తెలుసా?

ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తు కొత్త తరం 2020 మహీంద్రా థార్‌ను కంపెనీ అక్టోబర్ 2, 2020వ తేదీన మార్కెట్లో విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో, మొట్టమొదటి మహీంద్రా థార్ ఎస్‌యూవీని చారిటీ కోసం వేలం వేయనున్నట్లు కంపెనీ పేర్కొంది.

మొట్టమొదటి మహీంద్రా థార్ ఎవరికో తెలుసా?

దేశంలోనే మొట్టమొదటి మహీంద్రా థార్ ఎస్‌యూవీని ఈ వేలంలో అత్యధికంగా బిడ్ చేసిన వారికి విక్రయించనున్నారు. కస్టమర్స్ బిడ్ చేసిన మొత్తానికి సమానంగా మహీంద్రా కూడా తమ వంతుగా అంతే మొత్తాన్ని జోడించి, ఆ రెండింటినీ కలిపి చారిటీ కోసం దానం చేయనున్నారు. దేశంలో కొనసాగుతున్న కోవిడ్-19 మహమ్మారి సమయంలో వివిధ సహాయ కార్యక్రమాల కోసం ఈ నిధులను ఉపయోగిస్తారు.

మొట్టమొదటి మహీంద్రా థార్ ఎవరికో తెలుసా?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా వ్యాపించిన ఈ ప్రాణాంతక వైరస్‌తో పోరాడటానికి గరిష్ట సహాయాన్ని అందించాలని మహీంద్రా లక్ష్యంగా పెట్టుకుంది. ఈ వేలం ద్వారా వచ్చిన నగదు మొత్తాన్ని నాంది ఫౌండేషన్, వి ఆర్ స్వదేష్ ఫౌండేషన్ లేదా పిఎమ్ కేర్స్ ఫండ్‌కు విరాళంగా ఇవ్వబడుతుందని కంపెనీ తెలిపింది.

MOST READ:టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 200 4వి విడుదల: ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

మొట్టమొదటి మహీంద్రా థార్ ఎవరికో తెలుసా?

కొత్త తరం 2020 మహీంద్రా థార్ కోసం ఇప్పటికే దేశవ్యాప్తంగా బుకింగ్‌లు మరియు రిజిస్ట్రేషన్లు కూడా ప్రారంభమయ్యాయి. మొదటి ఆఫ్-రోడ్ ఎస్‌యూవీ కోసం అక్టోబర్ 24, 2020వ తేదీ నుండి వేలం ప్రారంభమవుతుంది. ఇటీవలే ఆవిష్కరించిన ఈ ఎస్‌యూవీకి లభిస్తున్న ఆదరణ చూస్తుంటే, వేలం కోసం అధిక మొత్తాల్లో బిడ్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మొట్టమొదటి మహీంద్రా థార్ ఎవరికో తెలుసా?

ఇటీవలే కొత్త మహీంద్రా థార్‌కు సంబంధించిన ధరల వివరాలు కూడా ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. వచ్చే నెలలో అధికారికంగా విడుదల కావటానికి ముందే, కొత్త థార్ ధరలు వాట్సాప్‌లో లీక్ అయ్యాయి. ఈ వివరాల ప్రకారం, కొత్త మహీంద్రా థార్ బేస్ వేరియంట్ ఏఎక్స్ ధర రూ.9.75 లక్షలుగా ఉంటే, టాప్-ఎండ్ వేరియంట్ ఏల్ఎక్స్ పెట్రోల్-ఆటోమేటిక్ ధర రూ.12.49 లక్షలుగా ఉంది (అన్ని ఎక్స్-షోరూమ్, ధరలు). - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

MOST READ:టయోటా అర్బన్ క్రూయిజర్ లాంచ్ : ధర & ఇతర వివరాలు

మొట్టమొదటి మహీంద్రా థార్ ఎవరికో తెలుసా?

మునుపటి తరం మోడల్‌తో కొత్త తరం థార్ ఎస్‌యూవీలో డిజైన్, ఫీచర్స్, ఇంజన్, పెర్ఫార్మెన్స్, టెక్నాలజీ పరంగా అనేక మార్పులు చేర్పులు ఉన్నాయి. ఇది ఇదివరకటి థార్ కన్నా మరింత మెరుగ్గా ఉంటుంది. మహీంద్రా ఈ కొత్త 2020 థార్ మోడల్‌ను కేవలం ఆఫ్-రోడ్ ప్రయోజనాల కోసం మాత్రమే కాకుండా, రెగ్యులర్‌గా ఉపయోగించుకునే వాహనం మాదిరిగా కూడా తయారు చేసింది.

మొట్టమొదటి మహీంద్రా థార్ ఎవరికో తెలుసా?

ఈ కొత్త తరం ఎస్‌యూవీలో ముఖ్యంగా చెప్పుకోవల్సింది ఇందులోని అప్‌డేట్ చేయబడిన ఇంజన్ ఆప్షన్స్. ఇందులో 2.0-లీటర్ టి-జిడి ఎమ్‌స్టాలియన్ పెట్రోల్ ఇంజన్ మరియు 2.2-లీటర్ ఎమ్‌హాక్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. పెట్రోల్ ఇంజన్ 150 బిహెచ్‌పి పవర్‌ను మరియు 320 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. డీజిల్ ఇంజన్ 130 బిహెచ్‌పి మరియు 300 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

MOST READ:విదేశీ దళాలు ఉపయోగిస్తున్న మేడ్ ఇన్ ఇండియా కార్లు, ఇవే

మొట్టమొదటి మహీంద్రా థార్ ఎవరికో తెలుసా?

ఈ రెండు ఇంజన్లు సిక్స్-స్పీడ్ మాన్యువల్ లేదా సిక్స్-స్పీడ్ టార్క్-కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తాయి. అంతేకాకుండా, ఇందులోని అన్ని మోడళ్లను స్టాండర్డ్‌గా షిఫ్ట్-ఆన్-ఫ్లై ఫోర్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌తో అందించనున్నారు.

మొట్టమొదటి మహీంద్రా థార్ ఎవరికో తెలుసా?

అప్‌డేట్ చేయబడిన ఈ కొత్త ఎస్‌యూవీలో సరికొత్త గ్రిల్ డిజైన్, హెడ్‌ల్యాంప్స్, ఫ్రంట్ బంపర్‌పై స్కఫ్ ప్లేట్లతో ఇది కొత్త ఫ్రంట్ ఫాసియాను కలిగి ఉంటుంది. ఇంకా ఇందులో కొత్త 18 ఇంచ్ వీల్స్ మరియు కొత్త టెయిల్ లైట్స్ డిజైన్‌ను కూడా గమనించవచ్చు. మహీంద్రా మొట్టమొదటిసారిగా ఈ ఆఫ్‌-రోడర్‌కు ఫ్యాక్టరీ ఫిట్టెడ్ హార్డ్-టాప్‌ను కూడా అందిస్తోంది.

MOST READ:ఇండియన్ మార్కెట్లో మెర్సిడెస్ ఎఎమ్‌జి జిఎల్‌ఇ 53 లాంచ్ : ధర & ఇతర వివరాలు

మొట్టమొదటి మహీంద్రా థార్ ఎవరికో తెలుసా?

ఇంటీరియర్స్ విషయానికి వస్తే, ఈ కొత్త ఎస్‌యూవీలో ఇప్పుడు అనేక ఫీచర్లు మరియు పరికరాలను జోడించారు. ఇందులో ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లేకు సపోర్ట్ ఇచ్చే 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, క్రూయిజ్ కంట్రోల్, మాన్యువల్ షిఫ్ట్-ఆన్-ఫ్లై 4x4 సిస్టమ్, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు రూఫ్-మౌంటెడ్ స్పీకర్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

మొట్టమొదటి మహీంద్రా థార్ ఎవరికో తెలుసా?

కొత్త 2020 మహీంద్రా థార్ వివిధ రకాల సీటింగ్ కాన్ఫిగరేషన్లతో లభిస్తుంది. కస్టమర్ ఎంచుకునే వేరియంట్‌ను బట్టి ఇందులో నాలుగు ఫ్రంట్ ఫేసింగ్ సీట్లు లేదా రెండు ఫ్రంట్ మరియు నాలుగు సైడ్ ఫేసింగ్ సీట్ల ఆప్షన్‌లో ఇది లభిస్తుంది.

మొట్టమొదటి మహీంద్రా థార్ ఎవరికో తెలుసా?

కొత్త మహీంద్రా థార్ మొదటి మోడల్ చారిటీ సేల్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

దేశంలో కొనసాగుతున్న కోవిడ్-19 మహమ్మారి నుండి కోలుకునేందుకు దేశానికి సహకరించే విషయంలో మహీంద్రా ముందంజలో ఉంది. దేశ భవిష్యత్తు కోసం కృషి చేస్తున్న వివిధ స్వచ్ఛంద సంస్థలకు విరాళాలను అందించేందుకు గతంలో కూడా మహీంద్రా తమ వాహనాలను వేలం వేసింది. కాగా, ఇప్పుడు కొత్త 2020 మహీంద్రా థార్‌ను కూడా ఇదే కోవలం వేలం వేయనుంది.

Most Read Articles

English summary
The 2020 Mahindra Thar is among the most anticipated launch of the year. The SUV was unveiled last month and Mahindra has received an overwhelming response in the country. The company has now announced that the first example of the off-road SUV will be put for auction. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X