సరికొత్త 2020 మహీంద్రా థార్ విడుదల ఖరారు; వివరాలు
భారత ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా అందిస్తున్న బెస్ట్ ఆఫ్-రోడ్ వాహనం 'మహీంద్రా థార్' (Mahindra Thar) లో కంపెనీ ఓ కొత్త అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను విడుదల చేయనున్నట్లు తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఇదివరకటి కథనాల్లో ప్రచురించిన సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, కొత్త తరం మహీంద్రా థార్ విడుదలకు సంబంధించి కంపెనీ ఇప్పుడు అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది.

వాస్తవానికి ఫిబ్రవరి 2020లో జరిగిన ఆటో ఎక్స్‌పోలో మహీంద్రా తమ కొత్త థార్‌ను ప్రదర్శనకు ఉంచుతుందని అందరూ ఊహించారు, కానీ అద జరగలేదు. ఆ తర్వాత లాక్‌డౌన్ ప్రకటించడంతో, లాక్‌డౌన్ పూర్తవ్వగానే ఈ మోడల్ మార్కెట్లో విడుదల అవుతుందనే పుకార్లు వినిపించాయి. కానీ అది కూడా జాప్యం అయ్యింది.

కాగా.. ఇప్పుడు మహీంద్రా మేనేజింగ్ డైరెక్టర్ పవన్ గోయెంకా కొత్త థార్ విడుదల గురించి ఓ అధికారిక ప్రకటన చేశారు. గడచిన ఆర్థిక సంవత్సరం (2019-20) నాల్గన త్రైమాసికపు ఫలితాలను వెల్లడించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అక్టోబర్ తొలినాళ్లలో తమ కొత్త తరం మహీంద్రా థార్‌ను మార్కెట్లో విడుదల చేస్తామని చెప్పారు.

కోవిడ్-19 వ్యాప్తి నివారణ కోసం చేపట్టిన లాక్‌డౌన్ కారణంగా దాదాపు రెండు నెలల పాటు ఉత్పత్తి నిలిచిపోయిన నేపథ్యంలో సరికొత్త 2020 మహీంద్రా థార్ విడుదల ఆలస్యమైందని గోయెంకా వివరించారు. ఈ ఏడాది మహీంద్రా నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న వాహనాల్లో సరికొత్త థార్ ఆఫ్-రోడ్ ఎస్‌యూవీ కూడా ఒకటి.

గత 2012లో మహీంద్రా తమ థార్ ఎస్‌యూవీని మార్కెట్లో విడుదల చేసింది. అప్పటి నుండి ఇది ఇండియన్ మార్కెట్లో మంచి పాపులారిటీని దక్కించుకుంది. రిఫ్రెష్డ్ డిజైన్‌తో పాటుగా సరికొత్త ఫీచర్లు మరియు ఇంజన్ అప్‌గ్రేడ్స్‌తో కొత్త 2020 మహీంద్రా థార్ మార్కెట్లోకి రానుంది.

టెస్టింగ్ దశలో కొత్త తరం మహీంద్రా థార్ ఇప్పటికే పలుమార్లు కెమెరాకు చిక్కింది. మరింత ప్రీమియం లుక్ అండ్ ఫీల్‌నిచ్చేలా సరికొత్త స్టయిలింగ్‌తో ఇది మార్కెట్లోకి రానుంది. ఈ సరికొత్త థార్ ఎస్‌యూవీని పూర్తిగా కొత్త ప్లాట్‌ఫామ్‌పై, మునుపటి వెర్షన్ల కన్నా మరికాస్త పెద్దగా ఉండేలా డిజైన్ చేయనున్నారు.

ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లతో కూడిన ఎల్ఈడి హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్, టెయిల్ గేట్‌పై స్పేర్ టైర్ వంటి మార్పులతో పాటుగా ఇంటిరీయర్లలో యాపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోను సపోర్ట్ చేసే పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఎయిర్‌బ్యాగ్స్ వంటి ఫీచర్లు ఉండనున్నట్లు సమాచారం. కొత్త థార్ కోసం విస్తృతమైన కస్టమైజేషన్ ఆప్షన్లను కూడా అందుబాటులో ఉంచే అవకాశం ఉంది.

ఇంజన్ విషయానికి వస్తే, కొత్త తరం మహీంద్రా థార్‌లో 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ మరియు 2.2 లీటర్ డీజిల్ ఇంజన్లను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్లను బిఎస్6 కాలుష్య నిబంధనలకు ధీటుగా అప్‌గ్రేడ్ చేయనున్నారు. ఈ రెండు ఇంజన్లను కూడా స్టాండర్డ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్‌లో రానున్నాయి.

కొత్త తరం మహీంద్రా థార్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
ఆఫ్-రోడ్ మార్కెట్లో మహీంద్రా థార్‌కి ఓ ప్రత్యేకమైన డిమాండ్ ఉంది. మారుతున్న ఆటో ట్రెండ్స్‌కి అనుగుణంగా కార్లను కూడా అప్‌గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉంది. మహీంద్రా కూడా తమ థార్‌ను మునుపెన్నడూ లేనంతగా సరికొత్త ప్లాట్‌ఫామ్‌పై అధునాతన ఫీచర్లతో అప్‌గ్రేడ్ చేస్తోంది. మరికొద్ది రోజుల్లోనే ఈ మోడల్ భారత మార్కెట్లో సందడి చేయనుంది.


Click it and Unblock the Notifications








