Just In
Don't Miss
- News
కువైట్‌లో నారా లోకేష్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన టీడీపీ నేతలు
- Sports
వైరల్ ఫొటో.. ధోనీ, సాక్షితో పంత్!!
- Movies
ప్రదీప్ కోసం టాప్ యాంకర్స్.. చివరకు వారితో జంప్.. మొత్తానికి సద్దాం బక్రా!
- Finance
Budget 2021: పన్ను తగ్గించండి, తుక్కు పాలసీపై కూడా
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
టాటా టియాగో ఎన్ఆర్‌జి క్రాసోవర్ వేరియంట్; ఇది చాలా రఫ్ గురూ..!
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ భారత మార్కెట్ కోసం అనేక కొత్త వాహనాలను విడుదల చేయాలని చూస్తోంది. వీటిలో ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మోడళ్ల యొక్క కొత్త వేరియంట్లతో పాటుగా టైమెరో మరియు గ్రావిటాస్ వంటి సరికొత్త మోడళ్లు కూడా ఉన్నాయి.
తాజాగా, ఎస్పీ ఆటో టెక్ టాక్స్ నుండి వచ్చిన ఓ స్పై వీడియోలో టాటా టియాగో హ్యాచ్‌బ్యాక్ క్రాసోవర్ వేరియంట్‌ను కంపెనీ భారత రోడ్లపై పరీక్షిస్తోంది. ఈ వీడియోలో టాటా టియాగో క్రింది భాగాన్ని మాత్రమే క్యామోఫ్లేజ్ చేశారు. ఇందులోని ఆల్‌రౌండ్ బాడీ క్లాడింగ్స్, బ్లాక్-అవుట్ రూఫ్ ట్రాక్స్ మరియు వీల్స్‌ను గమనిస్తే, ఇది టియాగో ఎన్ఆర్జి వేరియంట్ యొక్క అప్‌డేటెడ్ వెర్షన్ అని తెలుస్తోంది.

టాటా మోటార్స్ తొలిసారిగా టియాగో హ్యాచ్‌బ్యాక్ యొక్క ఎన్‌ఆర్‌జి వేరియంట్‌ను 2018లో విడుదల చేసింది. ఆ సమయంలో దీనిని స్టాండర్డ్ హ్యాచ్‌బ్యాక్ యొక్క క్రాస్ఓవర్ వేరియంట్‌గా పిలిచేవారు. ఎందుకంటే స్టాండర్డ్ టియాగోతో పోల్చుకుంటే, ఇందులో ఆల్-రౌండ్ బాడీ క్లాడింగ్‌తో పాటు మరికొన్ని కాస్మెటిక్ అప్‌డేట్స్‌ను కలిగి ఉంటుంది.
MOST READ:ఒక్క క్షణం ఆలస్యం అయ్యుంటే ఈ బైక్ రైడర్ ఏమయ్యేవాడు ; కావాలంటే వీడియో చూడండి

ఈ కారులోని ఇతర ఫీచర్లలో బ్లాక్-అవుట్ ఫ్రంట్ గ్రిల్, బ్లాక్ బాడీ క్లాడింగ్‌తో కూడిన వీల్ ఆర్చ్ డిజైన్, బూట్-లిడ్‌పై పెద్ద బ్లాక్ క్లాడింద్ మరియు రగ్గడ్ స్కిడ్ ప్లేట్, 14 ఇంచ్ డ్యూయెల్ టోన్ అల్లాయ్ వీల్స్ మరియు బ్లాక్-అవుట్ రూఫ్ మొదలైనవి ఉన్నాయి.

టాటా టియాగో ఎన్ఆర్‌జి వేరియంట్‌లో కాస్మెటిక్ మార్పులే కాకుండా, ఈ వేరియంట్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్‌ను కూడా 180 మిమీకి పెంచారు. అయితే, టియాగో ఎన్‌ఆర్‌జి ఎడిషన్ ఓవరాల్ సిల్హౌట్ మాత్రం చూడటానికి స్టాండర్డ్ టియాగో హ్యాచ్‌బ్యాక్ మాదిరిగానే ఉంటుంది.
MOST READ:మరో వాహనాన్ని కాఫీ కొట్టిన చైనా కంపెనీ.. ఈ సారి ఏ వాహనంలో తెలుసా ?

టాటా మోటార్స్ ఎన్‌ఆర్‌జి ఎడిషన్ ఇంటీరియర్స్‌ను గమనిస్తే, ఇది దాని అగ్రెసివ్ ఎక్స్‌టీరియర్స్‌కు సరిపోయేలా క్యాబిన్ డిజైన్ కలిగి ఉంటుంది. క్యాబిన్ అంతటా ఆరెంజ్ డీటేల్స్‌తో కూడిన బ్లాక్ థీమ్, ప్రత్యేకమైన డెనిమ్-ఇన్‌స్పైర్డ్ ఫ్యాబ్రిక్‌తో తయారు చేసిన కొత్త సీట్స్ ఇందులో ఉన్నాయి.

పైన పేర్కొన్న మార్పుల మినహా, స్టాండర్డ్ టియాగో మోడల్‌లో కనిపించే అన్ని ఇతర పరికరాలు మరియు ఫీచర్లు కూడా ఈ ఎన్‌ఆర్‌జి వేరియంట్‌లో యధావిధిగా కొనసాగుతాయి. ఇందులో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్ మొదలైనవి ఉన్నాయి.
MOST READ:మీకు తెలుసా.. ఇప్పుడు సియట్ టైర్ బ్రాండ్ అంబాసిడర్‌గా అమీర్ ఖాన్

టాటా టియాగో ఎన్‌ఆర్‌జిలో డ్యూయెల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగులు, ఏబిఎస్, ఈబిడి, కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్, రివర్స్ పార్కింగ్ అసిస్ట్, డ్రైవర్ సీట్ బెల్ట్ రిమైండర్, ఆర్మర్డ్ బాడీ అండ్ క్యాబిన్, స్మార్ట్ రియర్ వైపర్ మరియు ఫాలో-మి హెడ్‌ల్యాంప్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

స్టాండర్డ్ టియాగోలో పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు క్లైమేట్ కంట్రోల్ వంటి అప్‌గ్రేడ్స్ ఉన్నాయి. ఇవన్నీ కొత్త 2020 టియాగో ఎన్‌ఆర్‌జి ఎడిషన్‌లో కూడా ఉంటాయని అంచనా.
MOST READ:దేవెగౌడకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఖరీదైన లగ్జరీ కార్, ఇదే.. చూసారా ?

బిఎస్6 అప్‌డేట్ తరువాత, టాటా టియాగోను ఒకే ఒక పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో విక్రయిస్తున్నారు. ఇందులో 1.2-లీటర్, త్రీ-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 85 బిహెచ్‌పి పవర్‌ను మరియు 113 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ ఏఎమ్‌టి గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

టాటా మోటార్స్‌కు టియాగో బ్రాండ్ యొక్క ఎంట్రీ లెవల్ మోడల్ మరియు మార్కెట్లో దీని ధరలు రూ.4.69 లక్షల నుండి రూ.6.73 లక్షల మధ్యలో (ఎక్స్-షోరూమ్, ఇండియా) ఉన్నాయి. కొత్తగా రానున్న టియాగో ఎన్ఆర్జి వేరియంట్ ధరలు స్టాండర్డ్ టియాగో టాప్-ఎండ్ వేరియంట్ కన్నా అధికంగా ఉండొచ్చని అంచనా.

టాటా టియాగో ఎన్ఆర్‌జి వేరియంట్‌పై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరిన్ని కొత్త మోడళ్లను ప్రవేశపెట్టడం ద్వారా తమ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోను వేగంగా విస్తరించుకోవాలని భావిస్తోంది. టాటా మోటార్స్‌కు టియాగో హ్యాచ్‌బ్యాక్ ఎంతో ముఖ్యమైన మోడల్. భారతదేశంలో ఇది ప్రీమియం ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ విభాగంలో టాటా బ్రాండ్‌కు మంచి పురోగతిని తెచ్చిపెట్టింది. టాటా టియాగో సొగసైన రూపాన్ని కలిగి ఉంది, దేశంలోని యువ మరియు పరిణతి చెందిన కొనుగోలుదారులను ఆకర్షిస్తోంది.
Image Courtesy: SP Auto Tech Talks