Just In
- 21 hrs ago
బైడెన్ ఉపయోగించే 'మృగం' లాంటి కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు
- 23 hrs ago
మీకు తెలుసా.. ఇది ప్రపంచంలో అత్యంత వేగవంతమైన ట్రైన్ కానుంది
- 1 day ago
నిస్సాన్ మాగ్నైట్ అప్డేట్: 35,000కి పైగా బుకింగ్స్, 2 లక్షలకు పైగా ఎంక్వైరీస్
- 1 day ago
డిసెంబర్లో ఫర్వాలేదనిపించిన బజాజ్; ఏ మోడల్ ఎక్కువగా అమ్ముడైందంటే..
Don't Miss
- Lifestyle
సోమవారం దినఫలాలు : ఉద్యోగులు ఈరోజు పనిని సకాలంలో పూర్తి చేయడంలో విఫలమవుతారు...!
- News
ఘోరం: పూజల పేరుతో ఇద్దరు కుమార్తెలను చంపిన తల్లిదండ్రులు, మళ్లీ బతికిస్తాం, కరోనా శివుడి తల నుంచే..
- Movies
ట్రెండింగ్ : ఆమె నా తల్లి కాదు.. ప్రైవేట్ పార్టు చూపిస్తూ.. పర్సనల్ సీక్రెట్ లీక్ చేసిన దీపిక పదుకొనే
- Sports
Sri Lanka vs England: జోరూట్ జోరు.. శ్రీలంక బేజారు!
- Finance
బడ్జెట్, మొబైల్ యాప్‌లో 14 డాక్యుమెంట్ల పూర్తి వివరాలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
2020లో విడుదలైన టాప్ కార్లు ఇవే.. ఇందులో మీ ఫేవరేట్ కార్ ఏది?
ఈ సంవత్సరం (2020)లో కోవిడ్-19 వంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ, దేశంలోని ఆటోమొబైల్ కంపెనీలు మాత్రం ఆ సవాళ్లను అధిగమిస్తూ ముందుకు సాగుతున్నాయి. ఈ ఏడాదిలో అనేక కొత్త కార్లు మార్కెట్లోకి ప్రవేశించాయి. ఇందులోని కొన్ని పూర్తిగా సరికొత్త మోడళ్లు కాగా మరికొన్ని ఇదివరకటి మోడళ్లకు రిఫ్రెష్డ్ వెర్షన్లుగా వచ్చాయి.

ఈ కథనంలో మేము ఈ ఏడాది మార్కెట్లో విడుదలైన టాప్ 7 కార్లను మీ ముందుకు తీసుకువస్తున్నాయి. ఇవన్నీ కూడా మార్కెట్లో పెద్ద విజయాన్ని సాధించాయి మరియు అమ్మకాల పరంగా ఆయా కంపెనీలకు మంచి ఫలితాలను తెచ్చిపెట్టాయి. మరి ఆ మోడళ్లు వాటి వివరాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి:

కియా సోనెట్
కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగాన్ని షేక్ చేసిన మోడల్ కియా సోనెట్. విడుదలకు ముందు నుంచే ఈ మోడల్‌పై మార్కెట్లో పెద్ద ఎత్తున ఆసక్తి నెలకొంది. సెల్టోస్ విజయం తర్వాత కియా మోటార్స్ నుండి వచ్చిన సోనెట్ కూడా సెల్టోస్‌ని మించిన విజయాన్ని సాధించింది. కాంపాక్ట్ సైజులో స్టైల్ మరియు ఫుల్లీ లోడెడ్ ఫీచర్లతో వచ్చిన కియా సోనెట్ కంపెనీని విజయపథంలో నడిపించేందుకు సహకరించింది.

కియా సోనెట్ కాంపాక్ట్ ఎస్‌యూవీని సెప్టెంబర్ 18, 2020వ తేదీన భారత మార్కెట్లో విడుదల చేశారు. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ రూ.6.71 లక్షల నుంచి రూ.12.89 లక్షల మధ్యలో (ఎక్స్-షోరూమ్, ఇండియా) విక్రయించబడుతోంది. కియా సోనెట్ రెండు పెట్రోల్ మరియు రెండు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో విభిన్న వేరియంట్లలో అందుబాటులో ఉంది. - ఈ కారుకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

2020 హ్యుందాయ్ క్రెటా
కొరియన్ కార్ బ్రాండ్ హ్యుందాయ్ మోటార్ ఇండియా ఈ ఏడాది మార్చ్ నెలలో తమ సరికొత్త 2020 హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీని భారత మార్కెట్లో విడుదల చేసింది. అప్పట్లో ఈ మోడల్ ప్రారంభ ధర రూ.9.99 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉండేది. కొత్త 2020 హ్యుందాయ్ క్రెటాలో కంపెనీ అనేక కొత్త ఫీచర్లను జోడించింది.

అంతేకాకుండా, మునుపటి తరం క్రెటాతో పోలిస్తే కంపెనీ దీని డిజైన్‌ను కూడా రిఫ్రెష్ చేసింది. ఇందులో ఇప్పుడు కొత్తగా కనెక్టింగ్ టెక్నాలజీతో కూడిన ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అందిస్తున్నారు. కొత్త తరం క్రెటా ఇప్పుడు మూడు రకాల ఇంజన్ ఆప్షన్లతో విస్తృతమైన వేరియంట్లలో అందుబాటులో ఉంది. - ఈ కారుకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

కొత్త తరం 2020 మహీంద్రా థార్
ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో తమ కొత్త తరం 2020 మహీంద్రా థార్ ఎస్‌యూవీని మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఇంతకు ముందు వరకూ మహీంద్రా థార్ అంటే కేవలం ఆఫ్-రోడ్ ఉపయోగానికి బాగుటుంది అనేది చాలా మందిలో ఉండే అభిప్రాయం. అయితే, మహీంద్రా ఇందుకు ధీటుగా థార్‌లో ఓ రెగ్యులర్ వెర్షన్‌ను కూడా ప్రవేశపెట్టింది.

దీంతో, ఇప్పుడు కొత్త తరం మహీంద్రా థార్ ఎస్‌యూవీని కేవలం ఆఫ్-రోడ్ ప్రయోజనాల కోసం మాత్రమే కాకుండా ఇటు రోజూవారీ సిటీ ప్రయాణాల కోసం కూడా ఉపయోగించుకునేలా మారింది. మార్కెట్లో 2020 మహీంద్రా థార్‌ను రూ.9.80 లక్షల ప్రారంభ ధర (ఎక్స్-షోరూమ్)తో విడుదల చేశారు. ఇప్పుడు మహీంద్రా థార్‌కు భారీ సంఖ్యలో బుకింగ్స్ రావటంతో దీని వెయిటింగ్ పీరియడ్ కూడా భారీగా పెరిగిపోయింది. - ఈ కారుకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

కొత్త 2020 టాటా హారియర్ క్యామో
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్, మార్కెట్లో విక్రయిస్తున్న హారియర్ ఎస్‌యూవీలో కంపెనీ క్యామో పేరిట ఓ కొత్త స్పెషల్ ఎడిషన్‌ను ప్రవేశపెట్టింది. దేశీయ విపణిలో కొత్త 2020 టాటా హారియర్ క్యామో ఎడిషన్ ధర రూ.16.50 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు.

టాటా హారియర్ క్యామో స్టాండర్డ్ వెర్షన్ హారియర్ కన్నా భిన్నంగా మరియు ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇందులో మొత్తం ఆరు వేరియంట్లు (ఎక్స్‌టి, ఎక్స్‌టి ప్లస్, ఎక్స్‌జడ్, ఎక్స్‌జడ్ ప్లస్, ఎక్స్‌జెఎ మరియు ఎక్స్‌జెఎ ప్లస్) అందుబాటులో ఉన్నాయి. ఇందులో టాప్-ఎండ్ వేరియంట్ అయిన ఎక్స్‌జెఎ ప్లస్ ధర రూ.20.30 లక్షలుగా ఉంది. - ఈ కారుకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

ఆల్-న్యూ 2020 హ్యుందాయ్ ఐ20
హ్యుందాయ్ మోటార్ ఇండియా నుండి ఈ ఏడాది మార్కెట్లోకి వచ్చిన మరొక కొత్త మోడల్ ఆల్-న్యూ 2020 హ్యుందాయ్ ఐ20. ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో విడుదలైన హ్యుందాయ్ ఐ20 మునుపటి తరం కన్నా మరింత ప్రీమియం డిజైన్ మరియు ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా, ఇందులో కొత్త ఇంజన్ ఆప్షన్లను కూడా కంపెనీ పరిచయం చేసింది.

భారతదేశంలో మూడవ తరానికి చెందిన ఈ కొత్త 2020 హ్యుందాయ్ ఐ20 కారు పూర్తిగా కొత్త స్టైలింగ్‌ను కలిగి ఉండి, హ్యుందాయ్ యొక్క సరికొత్త గ్లోబల్ డిజైన్ ఫిలాసఫీకి అనుగుణంగా డిజైన్ చేయబడి ఉంటుంది. గడచిన నవంబర్ మార్కెట్లో విడుదలైన ఈ కారు ధరలు రూ.6.79 లక్షల నుండి రూ.11.17 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) మధ్యలో ఉన్నాయి. - ఈ కారుకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

ఎమ్‌జి గ్లోస్టర్ ప్రీమియం ఎస్‌యూవీ
చైనాలో అత్యంత ప్రాచుర్యం పొంది ఎమ్‌జి మోటార్స్ బ్రాండ్, భారత మార్కెట్లో తమ సరికొత్త ప్రీమియం ఎస్‌యూవీ 'గ్లోస్టర్'ను ఈ ఏడాది అక్టోబర్ నెలలో విడుదల చేసింది. ఎమ్‌జి గ్లోస్టర్ భారతదేశంలోనే మొట్టమొదటి అటానమస్ లెవల్ 1 ఎస్‌యూవీ కావటం విశేషం. ఈ ప్రీమియం కారుని భారత మార్కెట్లో రూ.28.98 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) ప్రారంభ పరిచయ ధరతో విడుదల చేశారు.

దేశీయ మార్కెట్లో ఎమ్‌జి గ్లోస్టర్ సూపర్, స్మార్ట్, షార్ప్ మరియు శావీ అనే నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో ప్రతి వేరియంట్ కూడా విభిన్నమైన ఫీచర్లను కలిగి ఉంటుంది. మార్కెట్లో బేస్ వేరియంట్ గ్లోస్టర్ ధర రూ.28.98 లక్షలుగా ఉంటే, టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ.35.38 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా)గా ఉంది. కస్టమర్ ఎంపికను బట్టి ఇందులో 6-సీటర్ మరియు 7-సీటర్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. - ఈ కారుకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

నిస్సాన్ మాగ్నైట్
ఈ ఏడాది నిస్సాన్ నుండి వచ్చిన అతిపెద్ద లాంచ్ మాగ్నైట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ. నిస్సాన్ ఇండియా తమ మాగ్నైట్ కాంపాక్ట్ ఎస్‌యూవీని నేడు (డిసెంబర్ 2, 2020)వ తేదీన అధికారికంగా దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. నిస్సాన్ మాగ్నైట్ కాన్సెప్ట్ కారును కంపెనీ ఈ ఏడాది ప్రారంభంలో ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించగా, తాజాగా ఇందులో ప్రొడక్షన్ వెర్షన్‌ను కంపెనీ నేడు విడుదల చేసింది.

మార్కెట్లో నిస్సాన్ మాగ్నైట్ ఎక్స్ఈ, ఎక్స్ఎల్, ఎక్స్‌వి మరియు ఎక్స్‌వి ప్రీమియం అనే నాలుగు వేరియంట్లలో లభ్యం కానుంది. కాగా, ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీని డిసెంబర్ 31, 2020వ తేదీ వరకూ రూ.4.99 లక్షల పరిచయ ప్రారంభ ధరతో విక్రయించనున్నారు. ఆ తర్వాత దీని ప్రారంభ ధరను రూ.5.54 లక్షలకు పెంచనున్నారు. - ఈ కారుకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

ఈ ఏడాదిలో టాప్ 7 కొత్త కార్ లాంచ్‌లపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.
ఇదివరకు చెప్పుకున్నట్లుగానే భారత ఆటోమొబైల్ పరిశ్రమపై కోవిడ్-19 ప్రతికూల ప్రభావం చూపినప్పటికీ, కార్ల తయారీదారులు మాత్రం వెనుకడుగు వేయకుండా సరికొత్త మోడళ్లను మార్కెట్‌కు పరిచయం చేశారు. ఈ ట్రెండ్ ఇలానే కొనసాగితే, వచ్చే ఏడాది ఆరంభంలో మరిన్ని కొత్త మోడళ్లు మార్కెట్లో విడుదల అవుతాయని మేము ఆశిస్తున్నాము.