గత వారం టాప్ కార్ న్యూస్ ఇవే..

ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న పండుగ సీజన్ సెంటిమెంట్‌ను క్యాష్ చేసుకునేందుకు వాహన తయారీదారులు భారత ఆటోమొబైల్ మార్కెట్లో సరికొత్త మోడళ్లను ప్రవేశపెట్టడమే కాకుండా, ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మోడళ్లలో స్పెషల్ ఎడిషన్ల పేరిట లిమిటెడ్ ఎడిషన్ మోడళ్లను కూడా ప్రవేశపెడుతున్నారు.

గత వారం టాప్ కార్ న్యూస్ ఇవే..

నిజానికి దశరా, దీపావళి సెంటిమెంట్ మార్కెట్లో చాలా బలంగా ఉంటుంది. ప్రత్యేకించి ఆటోమొబైల్స్ విషయంలో కస్టమర్లు ఈ ప్రత్యేకమైన రోజు కోసం వేచి చూస్తుంటారు. ఈ సమయంలో వాహనాలను కొనుగోలు చేస్తే మంచి జరుగుతుందనేది వారి అభిప్రాయం. అంతేకాకుండా, ఈ సీజన్‌లో కస్టమర్లను ఆకర్షించేందుకు కార్ కంపెనీలు కూడా ప్రత్యేకమైన తగ్గింపులు మరియు రాయితీలను అందిస్తుంటాయి. గత వారంలో భారత మార్కెట్లోని టాప్ కార్ న్యూస్ ఏంటో ఈ కథనంలో చూద్దాం రండి.

గత వారం టాప్ కార్ న్యూస్ ఇవే..

హోండా సిఆర్-వి స్పెషల్ ఎడిషన్ విడుదల

భారత మార్కెట్లో హోండా విక్రయిస్తున్న ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ 'సిఆర్-వి'లో కంపెనీ ఓ కొత్త స్పెషల్ ఎడిషన్ మోడల్‌ను విడుదల చేసింది. మార్కెట్లో హోండా సిఆర్-వి స్పెషల్ ఎడిషన్ ధరను రూ.29.50 లక్షలుగా నిర్ణయించారు. స్టాండర్డ్ మోడల్‌తో పోల్చుకుంటే ఈ స్పెషల్ ఎడిషన్‌లో అనేక కొత్త ఫీచర్లు లభ్యం కానున్నాయి.

MOST READ:ఎట్టకేలకు భారత్‌లో అడుగుపెట్టిన BMW X3 M ; ధర & ఇతర వివరాలు

గత వారం టాప్ కార్ న్యూస్ ఇవే..

కొత్త సిఆర్-వి లిమిటెడ్ ఎడిషన్ మోడల్ రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ ఫాసియాను కలిగి ఉంటుంది. ఇందులో రెగ్యులర్ మోడల్‌లో కనిపించే క్రోమ్-ఫినిష్డ్ యూనిట్ స్థానంలో కొత్త గ్లోస్ బ్లాక్ గ్రిల్ ఉంటుంది. రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ బంపర్ ఇప్పుడు మరింత అగ్రెసివ్‌గా కనిపిస్తుంది.

గత వారం టాప్ కార్ న్యూస్ ఇవే..

స్టాండర్డ్ మోడల్‌తో పోల్చుకుంటే స్పెషల్ ఎడిషన్ హోండా సిఆర్-విలో కొన్ని అదనపు ఫీచర్లు లభిస్తాయి. ఇందులో కార్నరింగ్ లైట్లు, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, 4-వే పవర్-అడ్జస్టబల్ ప్యాసింజర్ సీట్, హ్యాండ్స్ ఫ్రీ పవర్డ్ టెయిల్‌గేట్ మరియు ఆటో ఫోల్డింగ్ సైడ్ మిర్రర్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

MOST READ:దీపావళి ఆఫర్స్ ప్రకటించిన హీరో మోటోకార్ప్

గత వారం టాప్ కార్ న్యూస్ ఇవే..

హ్యుందాయ్ ఐ20 విడుదల తేదీ ఖరారు

హ్యుందాయ్ మోటార్ ఇండియా నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొత్త తరం 2020 హ్యుందాయ్ ఐ20 ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ను నవంబర్ 5, 2020వ తేదీన మార్కెట్లో విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ మోడల్ కోసం బుకింగ్‌లను కూడా స్వీకరిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. కస్టమర్లు ఇప్పుడు రూ.21,000 టోకెన్ అమౌంట్ చెల్లించి కొత్త హ్యుందాయ్ ఐ20 కారును బుక్ చేసుకోవచ్చు.

గత వారం టాప్ కార్ న్యూస్ ఇవే..

కొత్త హ్యుందాయ్ ఐ20 హ్యాచ్‌బ్యాక్‌ను ఇంటీరియర్ మరియు ఎక్స్టీరియర్ పరంగా పూర్తిగా రీడిజైన్ చేశారు. భారత మార్కెట్లో లభ్యం కానున్న కొత్త-తరం ఐ20లో లభించే వేరియంట్లు, రంగులు, ఇంజన్ మరియు ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ల వివరాలను కంపెనీ వెల్లడి చేసింది. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

గత వారం టాప్ కార్ న్యూస్ ఇవే..

భారత్‌లో మహీంద్రా ట్రియో జోర్ ఎలక్ట్రిక్ త్రీ వీల్ విడుదల

మహీంద్రా గ్రూపుకు చెందిన ఎలక్ట్రిక్ వాహన విభాగం, భారత మార్కెట్లో తమ కొత్త ట్రియో జోర్ ఎలక్ట్రిక్ త్రీ వీలర్ కార్గో వాహనాన్ని మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ విపణిలో దీని ప్రారంభ ధరను రూ.2.73 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. ఈ ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని ఇందులో పికప్‌, డెలివరీ వ్యాన్, ఫ్లాట్ బెడ్‌ అనే మూడు వేరియంట్లను అందుబాటులోకి తీసుకురానున్నారు.

గత వారం టాప్ కార్ న్యూస్ ఇవే..

ఈ ఎలక్ట్రిక్ వాహనాలను డీజిల్ కార్గో వాహనాలతో పోల్చితే ప్రతి సంవత్సరం యజమానులకు సుమారు 60,000 రూపాయలు ఆదా అవుతుందని కంపెనీ పేర్కొంది. మహీంద్రా ట్రియో జోర్ పూర్తి చార్జ్‌పై 125 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుందని, ఇది 8 కిలోవాట్ల శక్తిని, 42 న్యూటన్ మీటర్ టార్క్ ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటారుతో పనిచేస్తుందని కంపెనీ వివరించింది. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

MOST READ:కొత్త బిజినెస్‌లో అడుగుపెట్టిన విజయ్ దేవరకొండ, ఏంటో తెలుసా ?

గత వారం టాప్ కార్ న్యూస్ ఇవే..

ఫోక్స్‌వ్యాగన్ పోలో, వెంటో కార్లలో స్మార్ట్‌ఫోన్ కనెక్టింగ్ టెక్నాలజీ

ఫోక్స్‌వ్యాగన్ తమ పాపులర్ పోలో, వెంటో కార్లలో కొత్త తరహా స్మార్ట్ కనెక్టింగ్ టెక్నాలజీని ప్రవేశపెట్టింది. కంపెనీ అందిస్తున్న ఈ కార్ కనెక్టింగ్ టెక్నాలజీకి 'మై ఫోక్స్‌వ్యాగన్ కనెక్ట్' అనే పేరుతో పిలుస్తారు. త్వరలోనే ఈ కొత్త కనెక్ట్ కార్ టెక్నాలజీ అన్ని ఫోక్స్‌వ్యాగన్ మోడళ్లలోనూ అందుబాటులోకి రానుంది.

గత వారం టాప్ కార్ న్యూస్ ఇవే..

మెరుగైన ఫీచర్ల కోసం ఈ కనెక్టింగ్ టెక్నాలజీలో ఎంబెడెడ్ సిమ్‌ను కూడా జోడించారు. కంపెనీ ఇటీవలే విడుదల చేసిన కొత్త పోలో జిటి టిఎస్‌ఐ మరియు వెంటో హైలైన్ ప్లస్ మోడళ్లలో ఈ కొత్త కనెక్టింగ్ టెక్నాలజీని స్టాండర్డ్ ఫీచర్‌గా అందిస్తున్నారు. మై ఫోక్స్‌వ్యాగన్ కనెక్ట్ టెక్నాలజీ చాలా సింపుల్‌గా ఉండి, వినియోగదారులకు సులువుగా అర్థమయ్యేలా ఉంటుంది. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

MOST READ:రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన న్యూ హాలండ్ కంపెనీ ; ఏంటో తెలుసా ?

గత వారం టాప్ కార్ న్యూస్ ఇవే..

స్కొడా కరోక్ ఎస్‌యూవీ సోల్డ్ అవుట్

స్కొడా భారత మార్కెట్లో విక్రయిస్తున్న ప్రీమియం ఎస్‌యూవీ కరోక్ మొదటి బ్యాచ్ అమ్మకాలు పూర్తయ్యాయని, 2020 సంవత్సరానికి గానూ ఈ మోడల్ దేశీయ మార్కెట్లో దాదాపుగా అమ్ముడైందని స్కోడా ఆటో ప్రకటించింది. స్కొడా ఆటో 2020 మే నెలలో కరోక్‌ను ప్రారంభించింది. ఈ మోడల్‌ను పూర్తిగా విదేశాల్లో తయారు చేసి, ఇక్కడికి దిగుమతి చేసుకుంటున్నారు.

గత వారం టాప్ కార్ న్యూస్ ఇవే..

కరోక్ ఎస్‌యూవీకి లభిస్తున్న ఆదరణను దృష్టిలో ఉంచుకొని, కంపెనీ ఈ మోడల్‌ను ఇక్కడే స్థానికంగా తయారు చేయాలని భావిస్తోంది. ఇలా చేయటం వలన స్కొడా కరోక్ ఉత్పాదక వ్యయం తగ్గి, సరసమైన ధరకే అందుబాటులోకి వచ్చే ఆస్కారం ఉంటుంది.

Most Read Articles

English summary
Due to the ongoing festive season in the country, automakers are launching special edition variants of its existing models in the country. Brands aim to offer something unique and exclusive products for its customers to purchase this Diwali. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X