మహీంద్రా కార్లపై ఇయర్ ఎండ్ ఆఫర్స్; రూ.2.86 లక్షల వరకూ తగ్గింపు
ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా ఈ డిసెంబర్ 2020 నెలలో భాగంగా, తమ వాహనాలపై స్పెషల్ డిస్కౌంట్లు, ప్రయోజనాలు మరియు వివిధ రకాల ఆఫర్లను అందిస్తోంది. మహీంద్రా ఇటీవలే మార్కెట్లో విడుదల చేసిన కొత్త తరం 2020 థార్ ఎస్‌యూవీ మినహా మిగిలిన అన్ని మోడళ్లపై ఆఫర్లను అందిస్తోంది.

కస్టమర్ ఎంచుకునే మోడల్‌ని గరిష్టంగా రూ.25,000 నుండి రూ.2.86 లక్షల వరకు విలువైన ప్రయోజనాలను పొందవచ్చు. ఈ ఆఫర్లన్నీ డిసెంబర్ 31, 2020వ తేదీ వరకూ చెల్లుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది. మోడల్ వారీగా కంపెనీ అందిస్తున్న వివరాలు ఇలా ఉన్నాయి:

మహీంద్రా అందిస్తున్న ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ, అల్టురాస్ జి4 మోడల్‌పై అత్యధిక ప్రయోజనాలను అందిస్తోంది. ఈ డిసెంబర్ నెలలో ఆల్టురాస్ జి4 మోడల్‌ని కొనుగోలు చేసే కస్టమర్లు రూ.2.86 లక్షల వరకు విలువైన ప్రయోజనాలను పొందవచ్చు. ఈ ఎస్‌యూవీపై రూ.2.25 లక్షల నగదు తగ్గింపు మరియు రూ.50,000 ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు రూ.11,500 కార్పోరేట్ డిస్కౌంట్‌ను అందిస్తున్నారు.

మహీంద్రా స్కార్పియో ఎస్‌యూవీపై గరిష్టంగా 79,000 రూపాయల వరకు భారీ డిస్కౌంట్లను అందిస్తున్నారు. ఇందులో రూ.60,000 నగదు తగ్గింపులు, రూ.15,000 ఎక్స్ఛేంజ్ మరియు రూ.4,000 కార్పొరేట్ డిస్కౌంట్ లభిస్తుంది. కంపెనీ ఈ మోడల్‌లో వచ్చే ఏడాది సరికొత్త వెర్షన్‌ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది.

మహీంద్రా ఎక్స్‌యువి500 ఎస్‌యూవీపై కంపెనీ గరిష్టంగా రూ.56,512 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో రూ.25,012 నగదు తగ్గింపు, రూ.25,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్, రూ.6,500 కార్పొరేట్ డిస్కౌంట్ లభిస్తుంది.

మహీంద్రా మరాజ్జో ఎమ్‌పివిపై కంపెనీ గరిష్టంగా రూ.40,200ల ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో రూ.25,000 నగదు తగ్గింపు, రూ.10,000 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్, రూ.5,200 కార్పొరేట్ డిస్కౌంట్ లభిస్తుంది.

మహీంద్రా కెయువి100 మోడల్‌పై కంపెనీ రూ.28,000 విలువైన ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో రూ.25,000 క్యాష్ డిస్కౌంట్ మరియు రూ.3,000 కార్పోరేట్ డిస్కౌంట్ ఉన్నాయి.

మహీంద్రా అందిస్తున్న బొలెరో ఎస్‌యూవీపై కంపెనీ రూ.25,000 ఆఫర్లను అందిస్తోంది. ఇందులో రూ.12,000 క్యాష్ డిస్కౌంట్, రూ.10,000 ఎక్సేంజ్ బోనస్ మరియు రూ.3,000 విలువైన కార్పొరేట్ ఆఫర్లు ఉన్నాయి.


Click it and Unblock the Notifications