Just In
- 3 hrs ago
స్విఫ్ట్, బాలెనో, ఐ20 వంటి మోడళ్లకు వణుకు పుట్టిస్తున్న టాటా ఆల్ట్రోజ్
- 4 hrs ago
దక్షిణ భారత్‌లో కొత్త డీలర్షిప్ ఓపెన్ చేసిన బెనెల్లీ; వివరాలు
- 6 hrs ago
భారత్‌లో మరే ఇతర కార్ కంపెనీ సాధించని ఘతను సాధించిన కియా మోటార్స్!
- 6 hrs ago
రిపబ్లిక్ డే పరేడ్‌లో టాటా నెక్సాన్ ఈవీ; ఏం మెసేజ్ ఇచ్చిందంటే..
Don't Miss
- News
నిమ్మకాయ, మిరపకాయల ముగ్గు: చెల్లిని చంపిన తర్వాత తననూ చంపమన్న అలేఖ్య
- Finance
ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7300 తక్కువకు బంగారం, ఫెడ్ పాలసీకి ముందు రూ.49,000 దిగువకు
- Sports
ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.. కమిన్స్‌ను మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌ను చేయండి: క్లార్క్
- Movies
మళ్లీ రాజకీయాల్లోకి చిరంజీవి.. పవన్ కల్యాణ్‌కు అండగా మెగాస్టార్.. జనసేన నేత సంచలన ప్రకటన!
- Lifestyle
Study : గాలి కాలుష్యం వల్ల అబార్షన్లు పెరిగే ప్రమాదముందట...! బీకేర్ ఫుల్ లేడీస్...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
డ్రైవర్ రహిత అటానమస్ ఎలక్ట్రిక్ కారుని ప్రవేశపెట్టిన అమెజాన్ జూక్స్.. ఈ కారు ఎలా ఉందో మీరే చూడండి
సాధారణంగా డీజిల్ వాహనాలు మరియు పెట్రోల్ వాహనాలు వచ్చాయి.. కాలక్రమంలో ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులో ఉన్నాయి. కానీ సమాజం రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్న కారణంగా ఇప్పుడు డ్రైవర్ రహిత వాహనాలు ప్రవేశపెట్టడానికి తగిన అన్ని సన్నాహాలు సిద్ధం చేయబయబడుతున్నాయి.

వాహన తయారీదారులు తమ వాహనాలను అటానమస్ టెక్నాలజీతో మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. దేశంలోని అతిపెద్ద ఆన్‌లైన్ రిటైలర్ కంపెనీ అమెజాన్ యాజమాన్యంలోని జూక్స్ తన డ్రైవర్‌లెస్ రోబోట్-టాక్సీని ఆవిష్కరించింది. ఆటోమాటిక్ టెక్నాలజీ కలిగిన ఇవి ఏ దిశలోనైనా వెళ్ళే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

అమెజాన్ యొక్క ఈ కాన్సెప్ట్ వెహికల్ మల్టీడైరెక్షనల్ వాహనం, ఇది పట్టణ వాతావరణానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ కొత్త ఆటోమాటిక్ వెహికల్ లో క్యారేజ్-స్టైల్ ఇంటీరియర్, రెండు బెంచీలు ఒకదానికొకటి ఎదురుగా ఉన్నాయి. మనం దీనిని ఇక్కడ ఫొటోలో చూడవచ్చు.
MOST READ:ఎక్స్‌యూవీ 500 ని కాపాడిన మహీంద్రా థార్ ఎస్‌యూవీ, ఎలాగో చూసారా ?

ఇక్కడ ప్రత్యేకంగా గమనించవలసిన విషయం ఏమిటంటే ఇందులో డ్రైవర్ సీటు లేదు, ఎందుకంటే ఇది ఆటోమాటిక్ గా నడిచే వాహనం కాబట్టి దీనికి డ్రైవర్ సీటు అవసరం లేదు. అంతే కాకుండా ఈ వాహనంలో స్టీరింగ్ వీల్ కూడా లేదు. ఈ రోబోటిక్ టాక్సీ అధిక జనాభా ఉన్న పట్టణ ఉపయోగం కోసం రూపొందించబడింది. ఇది 12 అడుగుల పొడవైన వాహనం. ఇది మినీ కూపర్ కారు కంటే కొన్ని కొంత తక్కువగానే ఉంటుంది.

జూక్స్ ఈ రోబోటిక్ టాక్సీకి రిమోట్ కార్ల వంటి రెండు దిశలలో కదిలే సామర్థ్యం ఉంది. అంతే కాకుండా ఈ కారు యొక్క నాలుగు చక్రాలకు తిరిగే సామర్థ్యం ఇవ్వబడుతుంది. కనుక ఇది అన్నివైపులా తిరిగే విధంగా ఉంటుంది. ఈ ఆటోమాటిక్ వాహనం యొక్క గరిష్ట వేగం గంటకి 75 కిమీ.
MOST READ:10 కంటే ఎక్కువ రోల్స్ రాయిస్ కార్లు కలిగి ఉన్న బిలీనియర్ : అతని కార్ల వివరాలు

ఈ రోబోట్ టాక్సీ కోసం జుక్స్ ప్రస్తుతం ఫోక్స్ సిటీ, కాలిఫోర్నియా, లాస్ వెగాస్ మరియు శాన్ఫ్రాన్సిస్కోలోని కంపెనీ స్థావరాల వద్ద ఈ వాహనాన్ని పరీక్షిస్తున్నారని, ఇది మెరుగైన పనితీరు కనబరుస్తున్నట్లు కంపెనీ నివేదించింది. త్వరలో ఈ మానవరహిత వాహనాన్ని ఈ నగరాల్లో అద్దె వాహన సేవలో ప్రవేశపెట్టనున్నారు.

జూక్స్ ఒక స్టార్టప్ ఆటోమేకర్. ఈ సంస్థను 2014 లో సిలికాన్ వ్యాలీలో ప్రారంభించారు. ఈ ఏడాది జూన్‌లో ఆన్‌లైన్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ దీనిని కొనుగోలు చేసింది. ఈ సంస్థ అమెజాన్‌లో స్వతంత్ర అనుబంధ సంస్థగా పనిచేస్తోంది. ఇది అమెజాన్ యొక్క అనుబంధ సంస్థ అయినప్పటికీ, ప్రస్తుతం ఇది సజావుగా పనిచేస్తోంది. దీని ఆధారంగా కొత్త జూక్స్ రోబోట్ టాక్సీని విడుదల చేయనున్నారు.
MOST READ:తల్లిదండ్రులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి 1,100 కి.మీ ప్రయాణించిన కొడుకు

ఈ వాహనం లోపలి భాగం అద్భుతమైనదిగా రూపొందించబడింది. అంటే, రోల్స్ రాయిస్ వంటి ఖరీదైన లగ్జరీ కార్లలో ఉన్నందున టాక్సీ ఉపరితలంపై స్టార్ ఎలక్ట్రిక్ లైటింగ్ సిస్టమ్ ఇవ్వబడుతుంది. అదనంగా, ప్రయాణీకులకు స్పెషల్ మ్యూజిక్ సిస్టం మరియు సౌకర్యవంతమైన సీటింగ్ అందించబడతాయి.

ఇటీవల కాలంలో ఆటోమాటిక్ వాహనాలు ప్రపంచవ్యాప్తంగా వాడుకలోకి రావడం ప్రారంభించాయి. ఈ సాంకేతిక పరిజ్ఞానం కలిగిన వాహనాలు మానవ మెదడు కంటే ఎక్కువ వేగంతో పనిచేయగలవు కాబట్టి అవి మరింత సురక్షితమైనవిగా భావిస్తారు. ఈ కారణంగా, వాహనదారులు హై-ఎండ్ కార్లలో అటానమస్ టెక్నాలజీని ప్రవేశపెట్టడం ప్రారంభించారు. తదనంతరం, టాక్సీలు మరియు డెలివరీల వంటి సర్వీస్ వాహనాల్లో ఈ టెక్నాలజీ ప్రవేశపెడుతున్నారు.
MOST READ:సాధారణ కారుని సోలార్ కార్‌గా మార్చిన ఘనుడు.. పూర్తి వివరాలు

హెవీ డ్యూటీ ట్రక్ మరియు బస్సుల తయారీ సంస్థ డైమ్లెర్ భారతదేశంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ ట్రక్కును ప్రారంభించాలని యోచిస్తోంది. జర్మన్ ఆటోమొబైల్ సంస్థ డైమ్లెర్, భారత్ బెంజ్ భారీ ట్రక్కులు మరియు బస్సులను ఉత్పత్తి చేస్తుంది. డైమ్లెర్ వచ్చే ఏడాది 'ఫ్యూచర్ మొబిలిటీ' అనే కార్యక్రమాన్ని నిర్వహించబోతోంది.

ఏది ఏమైనా రాబోయే కాలంలో మొత్తం వాహనాలు ఎలక్ట్రిక్ వాహనాలు అవ్వనున్నాయి. ఈ ఎలక్ట్రిక్ వాహనాల వల్ల పర్యావరణానికి ఎటువంటి కాలుష్యం ఉండదు, అంతే కాకుండా ఇతర దేశాల నుంచి ముడి చమురు వంటి వాటిని దిగుమతి చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఇప్పుడు ప్రపంచంలోని దాదాపు అన్నిదేశాలూ ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహిస్తున్నాయి. ఇది మాత్రమే కాకుండా త్వరలో డ్రైవర్ రహిత ఆటోమాటిక్ వాహనాలు కూడా రోడ్డెక్కనున్నాయి.