ఎలక్ట్రిక్ కార్లపై సాధారణంగా ఉండే అపోహలు మరియు వాస్తవాలు

భారతదేశంలో గత కొన్నేళ్లుగా ఎలక్ట్రిక్ వాహనాలను స్వీకరించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. నిజానికి ఇదొక శుభపరిణామంగా చెప్పుకోవచ్చు. ఈ ట్రెండ్ ఇలానే కొనసాగితే భవిష్యత్తులో వాహన కాలుష్యం తగ్గి, పర్యవరణానికి ఎంతో మేలు జరగనుంది. వాహన తయారీదారులు కూడా ఓటా కొత్త ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేస్తూనే ఉన్నాయి.

ఎలక్ట్రిక్ కార్లపై సాధారణంగా ఉండే అపోహలు మరియు వాస్తవాలు

రానున్న సంవత్సరాల్లో (సుమారు 10-15 ఏళ్లలో) వాహన తయారీదారులు కూడా కేవలం ఎలక్ట్రిక్ వాహనాలనే తయారు చేస్తామని చెబుతున్నాయి. అయితే, సాధారణంగా చాలా మందిలో ఎలక్ట్రిక్ కార్ల విషయంలో అనేక అపోహలు ఉన్నాయి. ఇవి ఎక్కువ దూరం వెళ్లవని, మధ్యలోనే ఆగిపోతాయని, బ్యాటరీ చార్జింగ్ సమస్యలు ఉంటాయని, ఇలా మరెన్నో సందేహాలు ఉన్నాయి.

ఎలక్ట్రిక్ కార్లపై సాధారణంగా ఉండే అపోహలు మరియు వాస్తవాలు

ఈ అపోహల కారణంగా, దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను స్వీకరించే వారి సంఖ్య నామమాత్రంగానే ఉందని చెప్పాలి. ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో అపోహలు తొలగిపోతే, వీటిని స్వీకరించే వారి సంఖ్య కూడా పెరుగుతుంది. మరి మనం ఈ కథనంలో ఎలక్ట్రిక్ కార్లపై సాధారణంగే ఉండే ఐదు ప్రధాన అపోహలు మరియు వాటికి సంబంధించిన వాస్తవాలను తెలుసుకుందాం రండి.

MOST READ:బ్యాంకులకు ఎగనామం పెట్టాడు ; లగ్జరీ కార్స్ కొనేసాడు

ఎలక్ట్రిక్ కార్లపై సాధారణంగా ఉండే అపోహలు మరియు వాస్తవాలు

ఎలక్ట్రిక్ కార్లపై సుదీర్ఘ ప్రయాణాలు చేయగలమా?

ఎలక్ట్రిక్ కారు అనగానే ప్రధానంగా గుర్తుకు వచ్చేది, దాని రేంజ్ (మన భాషలో చెప్పాలంటే మైలేజ్). ఎలాగైతే పెట్రోల్ కార్ల మైలేజ్ వివిధ అంశాలపై అధారపడి ఉంటుందో, ఎలక్ట్రిక్ కార్ల బ్యాటరీ రేంజ్ కూడా అలానే వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఎలక్ట్రిక్ కార్లు కేవలం సిటీ ప్రయాణాలకు మాత్రమే సరిపోతాయని, వీటిలో దూరప్రయాణాలు సాధ్యం కాదని భావిస్తుంటారు. కానీ ఇది వాస్తవం కాదు.

ఎలక్ట్రిక్ కార్లపై సాధారణంగా ఉండే అపోహలు మరియు వాస్తవాలు

బ్యాటరీల తయారీలో ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీతో ఇప్పుడు అధిక రేంజ్‌ను ఆఫర్ చేసే ఎలక్ట్రిక్ కార్లు కూడా అందుబాటులో వచ్చాయి. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న కొన్ని ఎలక్ట్రిక్ కార్లు పూర్తి చార్జ్‌పై 300 కిలోమీటర్లకు పైగా రేంజ్‌ను ఆఫర్ చేస్తాయి. బ్యాటరీలను త్వరగా చార్జ్ చేసేందుకు దేశంలో ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. కొన్ని నగరాల్లో అయితే, పెట్రోల్ బంకుల్లోనే ఎలక్ట్రిక్ కార్ల చార్జింగ్ స్టేషన్లను కూడా అమర్చుతున్నారు.

MOST READ:వామ్మో.. పెట్రోల్ బంకులో ఇంత మోసమా.. మీరే చూడండి

ఎలక్ట్రిక్ కార్లపై సాధారణంగా ఉండే అపోహలు మరియు వాస్తవాలు

ఎలక్ట్రిక్ కార్లపై దూరప్రయాణాలు చేసేటప్పుడు సరిగ్గా ప్లాన్ చేసుకుంటే, ఎన్ని వేల కిలోమీటర్ల దూరాన్నైనా ఇబ్బంది లేకుండా చేరుకోవచ్చు. ఉదాహరణకు ఎలక్ట్రిక్ కారులో 600 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలని ప్లాన్ చేసుకున్నప్పుడు, ముందుగా ఆ మార్గంలో ఉండే చార్జింగ్ స్టేషన్లను జిపిఎస్ సాయంతో గుర్తించుకోవాలి. ఆయా ప్రాంతాల్లో హాల్ట్ వేసుకొని, బ్యాటరీలను పూర్తిగా చార్జ్ చేసుకొని ముందుకు సాగిపోవాలి.

ఎలక్ట్రిక్ కార్లపై సాధారణంగా ఉండే అపోహలు మరియు వాస్తవాలు

ఎలక్ట్రిక్ కార్లు ఎక్కువ వేగంతో ప్రయాణించలేవా?

ఎలక్ట్రిక్ కార్లపై సాధారణంగా ఉండే అపోహలలో వాటి వేగం కూడా ఒకటి. ఇలాంటి కార్లు ఎక్కువ వేగంతో ప్రయాణించలేవని, హైవేలపై ప్రయాణాలకు ఇవి ఇబ్బందిగా ఉంటాయని భావిస్తుంటారు. నిజానికి ఇది పూర్తిగా అవాస్తవం. దేశంలోనే అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కారు టాటా నెక్సాన్ ఈ.వి టాప్ స్పీడ్ గంటకు 120 కిలోమీటర్లు, ఇది కేవలం 9 సెకన్లలో 0-100 కి.మీ. వేగాన్ని చేరుకుంటుంది.

MOST READ:వావ్.. ల్యాండ్‌రోవర్ డిఫెండర్ క్యాపబిలిటీ అద్భుతః ; ఎందుకో మీరే చూడండి

ఎలక్ట్రిక్ కార్లపై సాధారణంగా ఉండే అపోహలు మరియు వాస్తవాలు

అలాగే, మరొక ఎలక్ట్రిక్ కారు ఎమ్‌జి జిఎస్ కేవలం 8.5 సెకన్లలో 0-100 కి.మీ వేగాన్ని చేరుకుంటుంది. ఈ రోజుల్లో, చాలా ఎలక్ట్రిక్ కార్లు కేవలం 2-3 సెకన్లలోనే గంటకు 100 కి.మీ వేగాన్ని చేరుకునే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. నిజానికి పెట్రోల్/డీజిల్ కార్ల కంటే ఎలక్ట్రిక్ కార్లే వేగంగా స్పందిస్తాయి మరియు పవర్, టార్క్‌లను కూడా అధికంగానే ఉత్పత్తి చేస్తాయి. ఉదాహరణకు, టాటా నెక్సాన్ ఈవీ 129 బిహెచ్‌పి పవర్‌ను 245 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఎలక్ట్రిక్ కార్లపై సాధారణంగా ఉండే అపోహలు మరియు వాస్తవాలు

ఛార్జింగ్ సమయం అధికంగా ఉంటుందా?

సాధారణంగా ఎలక్ట్రిక్ కార్లను ఛార్జ్ చేయడానికి ఎక్కువ సమయమే పడుతుంది. స్టాండర్డ్ హోమ్ చార్జర్ల సాయంతో వీటిని చార్జ్ చేయటానికి సుమారు 6-10 గంటల సమయం పడుతుంది. అయితే, ఇప్పుడు అనేక రకాల ఫాస్ట్ ఛార్జర్లు అందుబాటులోకి వచ్చాయి. వీటి సహాయంతో కేవలం 60 నిమిషాల్లోనే బ్యాటరీలను అత్యధిక స్థాయిలో ఛార్జ్ చేసుకోవచ్చు.

MOST READ:రైల్వే ట్రాక్ వద్ద సహనం లేకుంటే ఏమవుతుందో తెలుసా.. అయితే వీడియో చూడండి

ఎలక్ట్రిక్ కార్లపై సాధారణంగా ఉండే అపోహలు మరియు వాస్తవాలు

మరోవైపు దేశంలో టాటా మోటార్స్, హ్యుందాయ్, ఎమ్‌జి మోటార్ వంటి పలు సంస్థలు ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నాయి. పబ్లిక్ ప్లేస్‌లు, పెట్రోల్ బంకులు మరియు వారి డీలర్‌షిప్ కేంద్రాలలో ఇలాంటి వాటిని నిర్మిస్తున్నాయి. అలాంటి ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్లలో కారును వేగంగా ఛార్జ్ చేసుకోవచ్చు. కొన్ని కంపెనీలైతే ఇప్పుడు కస్టమర్ల ఇళ్లు లేదా కార్యాలయాల వద్దనే సూపర్‌ఫాస్ట్ ఛార్జర్‌లను ఏర్పాటు చేయడం కూడా ప్రారంభించాయి.

ఎలక్ట్రిక్ కార్లపై సాధారణంగా ఉండే అపోహలు మరియు వాస్తవాలు

ఎలక్ట్రిక్ కార్లు ఖరీదైనవి, కొనడం కష్టం?

ప్రస్తుతం, దేశంలో చాలా ఎలక్ట్రిక్ కార్లు సాధారణ కస్టమర్లకు అందుబాటులో లేవు. ఇది వాస్తవమే, కాకపోతే భవిష్యత్తులో ఈ ధోరణిలో భారీ మార్పులు రానున్నాయి. ఉదాహరణకు టాటా నెక్సాన్ ఈవీనే. ప్రస్తుతం ఇదే మనదేశంలో అత్యంత సరమైన ఎలక్ట్రిక్ కారు (రూ.14 లక్షల ప్రారంభ ధర). ఇప్పుడిప్పుడే కొత్త కంపెనీలు, కొత్త మోడళ్లు మార్కెట్లోకి వస్తున్నాయి. రానున్న ఐదేళ్లలో భారీ సంఖ్యలో కొత్త ఎలక్ట్రిక్ కార్లు కస్టమర్ల బడ్జెట్ రేంజ్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ఎలక్ట్రిక్ కార్లపై సాధారణంగా ఉండే అపోహలు మరియు వాస్తవాలు

వాస్తవానికి పెట్రోల్, డీజిల్ ఇంజన్లతో నడిచే వాహనాలతో పోలిస్తే, ఎలక్ట్రిక్ వాహనాలకు అయ్యే మెయింటినెన్స్ కాస్ట్ మరియు రన్నింగ్ కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇటీవలి కాలంలో, భారత ఎలక్ట్రిక్ వాహన తయారీ కంపెనీలు తమ వాహనాలను నేరుగా ఏకకాలంలో కొనుగోలు చేయలేని కస్టమర్ల కోసం లీజింగ్, సబ్‌స్క్రిప్షన్ ఆప్షన్లను అందిస్తున్నాయి. టాటా నెక్సాన్ ఈవీ, ఎమ్‌జి జిఎస్ ఈవీల కోసం కూడా ఈ తరహా ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

ఎలక్ట్రిక్ కార్లపై సాధారణంగా ఉండే అపోహలు మరియు వాస్తవాలు

బ్యాటరీ రీప్లేస్‌మెంట్ సమస్య

ఎలక్ట్రిక్ కారును ఛార్జ్ చేయడం గురించి, దాని బ్యాటరీకి సంబంధించిన సమస్యల గురించి చాలా అపోహలు ఉన్నాయి. సాధారణంగా, ఒక ఎలక్ట్రిక్ కారులోని బ్యాటరీ జీవితకాలం 1.5 లక్షల నుండి 2 లక్షల కిలోమీటర్ల వరకూ ఉంటుంది. ఆ తర్వాత కూడా ఇవి పనిచేస్తాయి, కాకపోతే వాటి రేంజ్ మరియు పెర్ఫార్మెన్స్‌లు తగ్గిపోయే అవకాశం ఉంది. కంపెనీలు కూడా ఈ బ్యాటరీ కార్లపై వీలైనంత అధిక వారంటీని ఆఫర్ చేస్తున్నాయి.

ఎలక్ట్రిక్ కార్లపై సాధారణంగా ఉండే అపోహలు మరియు వాస్తవాలు

ఎలక్ట్రిక్ కార్లలో అత్యంత ఖరీదైనది మరియు ముఖ్యమైనది ఇందులోని బ్యాటరీలు. ప్రస్తుతం చాలా వరకూ దేశీయ కంపెనీలు ఈ బ్యాటరీల విషయంలో విదేశాలపై ఆధారపడి ఉన్నాయి. బ్యాటరీలపై దిగుమతి సుంఖాలను తగ్గించినా లేదా స్థానికంగానే వీటిని తయారు చేసినా, వాటి ఖర్చు తగ్గి ఎలక్ట్రిక్ వాహనాల ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది. కేంద్రం కూడా మేక్ ఇన్ ఇండియా చొరవలో భాగంగా స్థానిక కంపెనీలను ప్రోత్సహిస్తోంది.

Most Read Articles

English summary
Five Common Myths About Electric Cars Know The Reality. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X