పెట్రోల్, డీజిల్ కార్లను కొంటున్నారా? అయితే ఒక్కసారి ఈ వార్తను చదవండి!

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ ప్రణాళికలను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా, ఎలక్ట్రిక్ వాహనాలపై సబ్సిడీ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.10,000 కోట్ల నిధులను కేటాయించింది.

పెట్రోల్, డీజిల్ కార్లను కొంటున్నారా? అయితే ఒక్కసారి ఈ వార్తను చదవండి!

దేశంలోని అన్ని రంగాల్లో ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం 'ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ (హైబ్రిడ్ అండ్) ఎలక్ట్రిక్ వెహికల్స్' (ఫేమ్ ఇండియా) అనే కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఈ ఫేమ్ పథకం కింద ప్రభుత్వం కొత్త ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుదారులకు సబ్సిడీతో సహా పలు ప్రత్యేక ఆఫర్లను కూడా అందిస్తోంది.

పెట్రోల్, డీజిల్ కార్లను కొంటున్నారా? అయితే ఒక్కసారి ఈ వార్తను చదవండి!

ఈ ఫేమ్ పథకం కిందకు మరిన్ని కొత్త ఎలక్ట్రిక్ వాహనాలకు చేర్చనున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. నిన్న (గురువారం) పార్లమెంటులో మాట్లాడిన మంత్రి, దేశంలో 62,000 ప్యాసింజర్ బస్సులు, కార్లు మరియు 15 లక్షల ద్విచక్ర వాహనాలకు సబ్సిడీ ఇవ్వనున్నట్లు తెలిపారు.

MOST READ:కవాసకి ఆఫ్-రోడ్ బైక్‌లపై అదిరిపోయే ఆఫర్లు.. త్వరపడండి, కేవలం పరిమిత కాలం వరకు మాత్రమే

పెట్రోల్, డీజిల్ కార్లను కొంటున్నారా? అయితే ఒక్కసారి ఈ వార్తను చదవండి!

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించడమే కాకుండా, వాటి వినియోగానికి అవసరమైన ఎలక్ట్రిక్ ఛార్జింగ్ మౌలిక సదుపాయాల కల్పనపై కూడా ప్రభుత్వం దృష్టి సారిస్తోందని రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ లోక్‌లభకు లిఖితపూర్వకంగా తెలియజేశారు..

పెట్రోల్, డీజిల్ కార్లను కొంటున్నారా? అయితే ఒక్కసారి ఈ వార్తను చదవండి!

అవసరమైన భద్రత మరియు ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా ఉండే అన్ని వాహనాలను ఫేమ్ ఇండియా స్కీమ్ ఫేజ్-2 కింద నమోదు చేసుకోవచ్చు. ఇప్పటివరకు, ఈ పథకం కింద 98 ఎలక్ట్రిక్ వెహికల్ మోడల్స్ (32 ద్విచక్ర వాహనాలు, 50 త్రీ వీలర్లు మరియు 16 నాలుగు చక్రాల వాహనాలు) నమోదు చేయబడ్డాయి.

MOST READ:టైర్లు లేని ఈ ట్రాక్టర్, వ్యవసాయానికి బలేగుంది గురూ..!

పెట్రోల్, డీజిల్ కార్లను కొంటున్నారా? అయితే ఒక్కసారి ఈ వార్తను చదవండి!

దీని కోసం (ఫేమ్ 2 ప్రాజెక్ట్ కోసం) కేంద్రం రూ.10 వేల కోట్ల బడ్జెట్‌ను కేటాయించినట్లు మంత్రి చెప్పారు. ఈసారి ప్రజా రవాణా మరియు షేర్డ్ ట్రాన్స్‌పోర్ట్‌పై ఎక్కువ దృష్టి పెడతామని ఆయన అన్నారు. ఈ స్కీమ్‌లో భాగంగా, 7000 ఈ-బస్సులు, 5 లక్షల ఎలక్ట్రిక్ త్రీ వీలర్లు మరియు 55,000 ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్స్ మరియు 10 లక్షల బ్యాటరీ పవర్డ్ టూవీలర్లకు ప్రభుత్వం సబ్సిడీలను ఆఫర్ చేయనుంది.

పెట్రోల్, డీజిల్ కార్లను కొంటున్నారా? అయితే ఒక్కసారి ఈ వార్తను చదవండి!

వీటికి అదనంగా, ఎలక్ట్రిక్ వాహనాలపై విధించే పన్నును తగ్గించడానికి కూడా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని రెవెన్యూ మంత్రి తెలిపారు. ఈ వాహనాలపై జీఎస్టీని ప్రస్తుతం 5 శాతం వరకు విధిస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల ప్రమోషన్ కోసం భవిష్యత్తులో దీనిని మరింత తగ్గించాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది.

MOST READ:యువకులు కూడా చేయలేని బైక్ స్టంట్ చేసిన యువతి అరెస్ట్

పెట్రోల్, డీజిల్ కార్లను కొంటున్నారా? అయితే ఒక్కసారి ఈ వార్తను చదవండి!

అదే జరిగితే, భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాల ధర మరింత గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. తగ్గిన జీఎస్టీ మరియు అదనపు సబ్సిడీల కారణంగా, కొత్త ఎలక్ట్రిక్ వాహనం కొనుగోలుకు అయ్యే ఖర్చు బాగా తగ్గిపోనుంది. దీని ఫలితంగా, ప్రజల్లో ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయాలన్ని ఆసక్తి కూడా పెరిగే అవకాశం ఉంది.

పెట్రోల్, డీజిల్ కార్లను కొంటున్నారా? అయితే ఒక్కసారి ఈ వార్తను చదవండి!

ఫేమ్ స్కీమ్ క్రింద ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలు సదరు ఎలక్ట్రిక్ వాహనం యొక్క కిలోవాట్ (KWh)పై ఆధారపడి ఉంటాయి. అంటే, ఎలక్ట్రిక్ టూవీలర్లు, త్రీవీలర్లు మరియు ఫోర్-వీలర్లను కొనుగోలు చేసే కస్టమర్లకు కిలోవాట్ బ్యాటరీ సామర్థ్యానికి రూ.10,000 చొప్పున సబ్సిడీని అందించాల్సి ఉంటుంది.

MOST READ:గ్రామస్థుల మాటలు తప్పుగా అర్థం చేసుకుని వారిపై విరుచుకుపడిన యువతి [వీడియో]

Most Read Articles

English summary
Government To Boost Electric Mobility In India Through Huge Subsidies. Read In Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X