మార్కెట్లో పెరిగిపోతున్న మహీంద్రా బొలెరో నియో క్రేజ్; అప్పుడే 5,500 చేరుకున్న బుకింగ్స్

మహీంద్రా అండ్ మహీంద్రా భారతీయ మార్కెట్లో కొత్త మహీంద్రా బొలెరో నియో విడుదల చేసినప్పటినుంచి మంచి స్పందన వస్తోంది. మహీంద్రా బొలెరో నియో ధర దేశీయ మార్కెట్లో రూ. 8.48 లక్షలు. ఈ కొత్త మోడల్ ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 5,500 కు పైగా బుకింగ్స్ అందుకుంది. అతి తక్కువ కాలంలోనే ఇంత మొత్తంలో బుకింగ్స్ ఆదుకోవడంతో ఈ మోడల్ కి దేశీయ మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందో అర్థమవుతుంది.

అప్పుడే 5,000 దాటిన మహీంద్రా బొలెరో నియో బుకింగ్స్

కొత్త మహీంద్రా బొలెరో నియో ని కంపెనీ తన టియువి300 స్థానంలో తీసుకువచ్చింది. కానీ ఇది టియువి300 కంటే కూడా ఎక్కువ అప్డేటెడ్ డిజైన్ కలిగి ఉండటమే కాకుండా ఫీచర్స్ మరియు పరికరాలు కూడా చాలా వరకు అప్డేట్ అయ్యాయి.

అప్పుడే 5,000 దాటిన మహీంద్రా బొలెరో నియో బుకింగ్స్

కొత్త మహీంద్రా బొలెరో నియో నాలుగు వేరియంట్లలో వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి ఎన్ 4, ఎన్ 8, ఎన్ 10 మరియు ఎన్ 10(ఓ) వేరియంట్స్. వీటి ధరల విషయానికి వస్తే ఎన్ 4 ధర రూ. 8.48 లక్షలు, ఎన్ 8 ధర రూ. 9.48 లక్షలు మరియు ఎన్ 10 ధర రూ. 9.99 లక్షల వరకు ఉంటుంది. ఎన్ 10(ఓ) ధర కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

అప్పుడే 5,000 దాటిన మహీంద్రా బొలెరో నియో బుకింగ్స్

భారత మార్కెట్లో విడుదలైన కొత్త మహీంద్రా బొలెరో నియో చాలా ఆకర్షణీయమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఇందులో పునఃరూపకల్పన చేసిన ఎల్‌ఇడి హెడ్‌లైట్ మరియు టెయిల్ లైట్లు, స్క్వేర్ ఫాగ్ లైట్లు మరియు ముదురు రంగు స్కిడ్ ప్లేట్‌లతో కొత్త బంపర్ ఉన్నాయి. అంతే కాకుండా ఇది గ్రిల్‌ను పొందుతుంది.

అప్పుడే 5,000 దాటిన మహీంద్రా బొలెరో నియో బుకింగ్స్

బొలెరో నియో యొక్క సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే, ఇక్కడ బ్లాక్ స్ట్రిప్ ఇవ్వబడింది, దానితో పాటు కొత్త ఫైవ్ స్పోక్ అల్లాయ్ వీల్ కూడా ఇవ్వబడింది. అయితే దీని యొక్క రియర్ ప్రొఫైల్ లో మాత్రమే ఎటువంటి మార్పు చేయలేదని తెలుస్తుంది. కానీ వెనుక భాగంలో రియర్ పార్కింగ్ సెన్సార్లు వంటివి ఉన్నాయి.

అప్పుడే 5,000 దాటిన మహీంద్రా బొలెరో నియో బుకింగ్స్

బొలెరో నియోలో 7.0 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే కనెక్టివిటీ, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ (మాన్యువల్), కీలెస్ ఎంట్రీ, పవర్ అడ్జస్టబుల్ ORVM లు, ఎసి వంటి ఫీచర్స్ ఇందులో ఉంటాయి. మొత్తానికి ఇది వాహనదారునికి చాలా అనుకూలంగా ఉంటుంది.

అప్పుడే 5,000 దాటిన మహీంద్రా బొలెరో నియో బుకింగ్స్

బొలెరో నియోలోని సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఎబిడి విత్ ఇబిడి, సీట్‌బెల్ట్ రిమైండర్, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, క్రూయిజ్ కంట్రోల్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్ వంటి సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి, కావున ఇది వాహనదారునికి మంచి భద్రత కల్పిస్తుంది.

అప్పుడే 5,000 దాటిన మహీంద్రా బొలెరో నియో బుకింగ్స్

మహీంద్రా బొలెరో నియో 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 3750 ఆర్‌పిఎమ్ వద్ద 100 బిహెచ్‌పి పవర్ మరియు 2250 ఆర్‌పిఎమ్ వద్ద 240 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ కి జతచేయబడి ఉంటుంది. ఈ కొత్త కార్ ఇంధనాన్ని ఆదా చేయడం కోసం స్టార్ట్-స్టాప్ టెక్నాలజీని కలిగి ఉంటుంది. ఇందులో ఇప్పుడు ఎకో డ్రైవ్ మోడ్ కూడా ఇవ్వబడింది. కావున ఇంధనాన్ని కూడా మీరు కొంతవరకు ఆదా చేయవచ్చు.

అప్పుడే 5,000 దాటిన మహీంద్రా బొలెరో నియో బుకింగ్స్

మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ కాంపాక్ట్ ఎస్‌యూవీల జాబితాలో మరో ఎస్‌యూవీ జోడించింది. భారత మార్కెట్లో అడుగుపెట్టిన కొత్త బొలెరో నియో, హ్యుందాయ్ వెన్యూ, మారుతి సుజుకి విటారా బ్రెజ్జా మరియు ఫోర్డ్ ఎకోస్పోర్ట్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

అప్పుడే 5,000 దాటిన మహీంద్రా బొలెరో నియో బుకింగ్స్

ఈ కొత్త మహీంద్రా బొలెరో నియో 5 కలర్ ఆప్షన్స్ లో విక్రయించబడుతుంది. అవి సిల్వర్, నాపోలి బ్లాక్, హైవే రెడ్, రాకీ బీజ్ మరియు పెర్ల్ వైట్ కలర్స్. మహీంద్రా బొలెరో నియో పేరుతో లాంచ్ అయిన తర్వాత గొప్ప స్పందన లభిస్తోంది. ఇది గ్రామీణా ప్రాంతాల వారికీ మరియు పట్టణ ప్రాంతాల వారికీ ఖచ్చితంగా సరిపోయే మోడల్.

మార్కెట్లో పెరిగిపోతున్న మహీంద్రా బొలెరో నియో క్రేజ్; అప్పుడే 5,500 చేరుకున్న బుకింగ్స్

మహీంద్రా బొలెరో నియో ఎటువంటి రహదారిలో అయినా ప్రయాణించడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. కావున గ్రామీణా ప్రాంతాల్లోని వినియోగదారులు మరియు పట్టణ ప్రాంతాల్లోని వినియోగదారులు కొనుగోలుచేయడానికి ఎక్కువ ఆసక్తి కనపరుస్తుంటారు. ఇందులో అప్డేటెడ్ ఫీచర్స్ మరియు పరికరాలు మాత్రమే కాకుండా మంచి సేఫ్టీ ఫీచర్స్ కూడా అందుబాటులో ఉంటాయి. రాబోయే కాలంలో ఈ మోడల్ యొక్క బుకింగ్స్ మరింత పెరిగే అవకాశం ఉంటుంది.

Most Read Articles

English summary
Mahindra bolero neo bookings crosses 5500 units details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X