భారత మార్కెట్లో విడుదలైన Mahindra Furio 7 ట్రక్స్; ధర & వివరాలు

మార్కెట్లో కార్లు మరియు బైకులకు మాత్రమే కాదు, కమర్షియల్ వాహనాలకు కూడా మంచి డిమాండ్ ఉంది. ఈ కారణంగానే చాలా కంపెనీలు దేశీయ మార్కెట్లో కమర్షియల్ వాహనాలను విడుదల చేస్తున్నాయి. ఇందులో భాగంగానే దేశీయ మార్కెట్లోని వాణిజ్య వాహనాల తయారీ సంస్థ Mahindra And Mahindra (మహీంద్రా అండ్ మహీంద్రా) తన పోర్ట్ ఫోలియోను విస్తరిస్తూ కొత్త Mahindra Furio 7 (మహీంద్రా ఫ్యూరియో 7) ను విడుదల చేసింది. దీని గురించి మరింత సమాచారం ఈ ఆర్టికల్ లో చూద్దాం.

భారత మార్కెట్లో విడుదలైన Mahindra Furio 7 ట్రక్స్; ధర & వివరాలు

Mahindra And Mahindra ఇప్పుడు దేశీయ మార్కెట్లో Mahindra Furio 7 కింద నాలుగు వేరియంట్లలో ట్రక్కును విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ .14.79 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) కాగా, టాప్ వేరియంట్ ధర రూ. 16.82 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది.

భారత మార్కెట్లో విడుదలైన Mahindra Furio 7 ట్రక్స్; ధర & వివరాలు

Mahindra And Mahindra యొక్క Mahindra Furio 7 ట్రక్కుల ధరలను వేరియంట్స్ వారీగా పరిశీలిస్తే, Mahindra Furio 7 (4-టైర్ కార్గో) 10.5 ఫీట్ హై సైడ్ డెక్ ధర రూ .14.79 లక్షలు (ఎక్స్-షోరూమ్). అదే విధంగా Mahindra Furio 7 (4-టైర్ కార్గో) 14 ఫీట్ హై సైడ్ డెక్ వేరియంట్ ధర రూ. 15.32 లక్షలు. ( ఎక్స్-షోరూమ్).

భారత మార్కెట్లో విడుదలైన Mahindra Furio 7 ట్రక్స్; ధర & వివరాలు

అంతే కాకుండా Mahindra Furio 7 (6-టైర్ కార్గో) 10.5 ఫీట్ హై సైడ్ డెక్ ధర రూ .15.18 లక్షలు (ఎక్స్-షోరూమ్) మరియు Mahindra Furio 7 (6-టైర్ ట్రిప్పర్) 2.8 క్యూబిక్ మీటర్ ఫుల్లీ బిల్ట్ ట్రిప్పర్ వేరియంట్ ధర రూ. 16.82 లక్షలు. (ఎక్స్-షోరూమ్). Mahindra And Mahindra (మహీంద్రా అండ్ మహీంద్రా) తన కొత్త Mahindra Furio 7 ను లైట్ కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్లో లాంచ్ చేసింది.

భారత మార్కెట్లో విడుదలైన Mahindra Furio 7 ట్రక్స్; ధర & వివరాలు

మహీంద్రా కంపెనీ 2019 సంవత్సరంలో మహీంద్రా ఫ్యూరియో యొక్క మొదటి మోడల్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కంపెనీ దాదాపు 2,000 కంటే ఎక్కువ ఫ్యూరియోలను విక్రయించినట్లు తెలిపింది. ఇవి అధునాతన ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటాయి.

భారత మార్కెట్లో విడుదలైన Mahindra Furio 7 ట్రక్స్; ధర & వివరాలు

కొత్త Mahindra Furio 7 బెస్ట్-ఇన్-క్లాస్ మైలేజ్‌తో పరిచయం చేయబడినట్లు కంపెనీ తెలిపింది. ఇది మాత్రమే కాకుండా ఈ ట్రక్ అధిక పేలోడ్, బెస్ట్-ఇన్-క్లాస్ క్యాబిన్ కంఫర్ట్, మెరుగైన సేఫ్టీ మరియు సౌలభ్యం మరియు రిస్క్-ఫ్రీ కొనుగోలుతో మార్కెట్లో లాంచ్ చేయబడింది. ఇవన్నీ కూడా వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

భారత మార్కెట్లో విడుదలైన Mahindra Furio 7 ట్రక్స్; ధర & వివరాలు

దేశీయ మార్కెట్లో విడుదలైన Mahindra Furio 7 10.55 ఫీట్స్ మరియు 14 ఫీట్స్ ట్రక్కుల స్థూల బరువు 6,950 కిలోలు. అదేవిధంగా Mahindra Furio 7HD యొక్క 10.55 ఫీట్స్ మరియు 14 ఫీట్స్ ట్రక్కుల స్థూల బరువు కూడా 6,950 కిలోలు. ఇక Mahindra Furio 7 ట్రిప్పర్ 2.8 క్యూబిక్ మీటర్ల ట్రక్కు బరువు కూడా 6,950 కిలోలు, అంతే కంపెనీ విడుదల చేసిన అన్ని ట్రక్కుల బరువులు దాదాపు సమానంగా ఉన్నాయి.

భారత మార్కెట్లో విడుదలైన Mahindra Furio 7 ట్రక్స్; ధర & వివరాలు

Mahindra And Mahindra యొక్క Mahindra Furio 7 ట్రక్కులో ఫ్యూయల్ స్మార్ట్ టెక్నాలజీ ఉపయోగించబడింది. ఈ కారణంగానే ఈ ట్రక్కులు మంచి మైలేజ్ అందిస్తాయని కంపెనీ తెలిపింది. అంతే కాకూండా కంపెనీ ఈ ట్రక్కులో 2.5-లీటర్ మరియు 3.5-లీటర్ రెండు ఇంజిన్ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించింది. దీనితో పాటు, దీనికి పెద్ద క్లచ్ ఇవ్వబడింది, ఇది వాహన డ్రైవర్లకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.

భారత మార్కెట్లో విడుదలైన Mahindra Furio 7 ట్రక్స్; ధర & వివరాలు

ఇవి చూడటానికి చాలా దృడంగా ఉండటమే కాకుండా మంచి డిజైన్ కలిగి మంచి ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఇందులోని ఫీచర్స్ విషయానికి వస్తే, ఇది హైడ్రాలిక్ లాష్ అడ్జస్టర్, ఆటో బెల్ట్ టెన్షనర్, క్లచ్ బూస్టర్, 5 డిగ్రీ మోర్ కూల్ క్యాబిన్, స్లీపింగ్ ప్రొవిజన్, 8 పాయింట్ ఎయిర్ అవుట్‌లెట్ వెంటిలేషన్, టిల్ట్ మరియు టెలిస్కోపిక్ స్టీరింగ్ వీల్, క్యాబిన్‌లో ఎక్కువ హెడ్‌రూమ్, డ్యూయెల్ చాంబర్ హెడ్‌ల్యాంప్ మరియు వెడల్పు అంతటా విస్తరించిన ఫాగ్‌లాంప్‌లు ఉన్నాయి. ఇవన్నీ కూడా రోడ్డుపైన మంచి దృశ్యమానతను అందిస్తాయి.ఇవన్నీ రవాణాకి చాలా అనుకూలంగా ఉంటాయి. అంతే కాకుండా ఇవి వాహనదారులకు చాలా నమ్మికైనవిగా ఉన్నాయి.

Most Read Articles

English summary
Mahindra furio 7 light commercial truck launched at rs 14 79 lakhs details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X