మహారాష్ట్రలో విడుదలైన Mahindra Treo: ధర & వివరాలు

భారతీయ మార్కెట్లో రోజు రోజుకి ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న ఆదరణ కారణంగా దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. దేశంలో ఎలక్ట్రిక్ వాహన విభాగంలో స్కూటర్లు, బైకులు మరియు కార్లు కూడా ఉన్నాయి. అంతే కాకుండా ఇప్పుడు త్రీ వీలర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇందులో భాగంగానే ప్రముఖ వాహన తయారీ సంస్థ మహీంద్రా (Mahindra) కూడా కొత్త 'మహీంద్రా ట్రియో ఎలక్ట్రిక్ రిక్షా' విడుదల చేసింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

మహారాష్ట్రలో విడుదలైన Mahindra Treo: ధర & వివరాలు

మహీంద్రా ట్రియో ఎలక్ట్రిక్ రిక్షా ఇప్పుడు మహారాష్ట్రలో విడుదలయ్యింది. దీని ధర రూ. 2.09 లక్షలు. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలపైన కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల యొక్క రాయితీలు కూడా అందుబాటులో ఉన్నాయి. కావున ఈ ఎలక్ట్రిక్ రిక్షాపై మహారాష్ట్ర రాష్ట్రం నుంచి రూ. 30,000 తగ్గింపు లభిస్తుంది.

మహారాష్ట్రలో విడుదలైన Mahindra Treo: ధర & వివరాలు

అంతే కాకుండా 2021 డిసెంబర్ 31 లోపు కొనుగోలు చేస్తే మీకు రూ.37,000 వరకు తగ్గింపు లభిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ రిక్షా ఇతర CNG మోడల్స్ తో పోలిస్తే 5 సమత్సరాలలో ఏకంగా రూ. 2 లక్షల వరకు అదా చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. కావున ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

మహారాష్ట్రలో విడుదలైన Mahindra Treo: ధర & వివరాలు

మహీంద్రా ఎలక్ట్రిక్ తన మహీంద్రా ట్రియో ఎలక్ట్రిక్ త్రీ-వీలర్‌ను దేశీయ విపణిలో విక్రయిస్తోంది. కానీ ఇది దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే విక్రయిస్తోంది. కయితే త్వరలో మరిన్ని రాష్ట్రాల్లో ఇది అందుబాటులో ఉంటుంది. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా త్రీ వీలర్ ఎలక్ట్రిక్ వాహనాలకు కూడా మంచి డిమాండ్ ఉంది. ఈ డిమాండ్ దృష్ట్యా మహీంద్రా కంపెనీ ఎలక్ట్రిక్ త్రీ వీలర్ కూడా మహారాష్ట్రలో విడుదల చేసింది.

మహారాష్ట్రలో విడుదలైన Mahindra Treo: ధర & వివరాలు

మహీంద్రా ట్రియో అద్భుతమైన పనితీరుని అందిస్తుంది. ఇది 48వి 8 కిలోవాట్ సామర్థ్యం కలిగిన లేటెస్ట్ లిథియం-అయాన్ బ్యాటరీని పొందుతుంది. ఇది కేవలం 3 నుంచి 4 గంటల సమయంలో 0 నుంచి 100% వారు ఛార్జ్ చేసుకోగలదు. కావున ఇది వాహనదారుల యొక్క సమయాన్ని కూడా ఆదా చేస్తుంది.

మహారాష్ట్రలో విడుదలైన Mahindra Treo: ధర & వివరాలు

మహీంద్రా ట్రియో ఎలక్ట్రిక్ రిక్షా అనేది 3-సీటర్ ఈ-రిక్షా. ఈ ఎలక్ట్రిక్ రిక్షా యొక్క గరిష్ట వేగం గంటకు 45 కి.మీ వరకు ఉంటుంది. అంతే కాకూండా ఇది 170 కిలోమీటర్ల పరిధిని అందిస్తుందని కంపెనీ నిర్దారించింది. కావున వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

మహారాష్ట్రలో విడుదలైన Mahindra Treo: ధర & వివరాలు

మహీంద్రా ట్రియో ఫ్రంట్ హెలికల్ స్ప్రింగ్, డంపర్, హైడ్రాలిక్ షాక్ అబ్జార్బర్, రిజిడ్ రియర్ యాక్సిల్, లీఫ్ స్ప్రింగ్ మరియు షాక్ అబ్జార్బర్ వంటి వాటిని పొందుతుంది. ఇందులోని బ్రేకింగ్ విషయానికి వస్తే ముందు మరియు వెనుక భాగంలో హైడ్రాలిక్ టైప్ బ్రేక్‌లు ఇందులో ఉన్నాయి.

మహారాష్ట్రలో విడుదలైన Mahindra Treo: ధర & వివరాలు

మహీంద్రా యొక్క కొత్త ఎలక్ట్రిక్ త్రీ వీలర్ కేవలం 50 పైసలకు 1 కి.మీ పరిధిని అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ రిక్షా 42 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది. ఈ రిక్షాపైన కంపెనీ అద్భుతమైన వారంటీని కూడా అందిస్తుంది. ఇందులో 5 సంవత్సరాల కంటే ఎక్కువ మరియు 150000 కి.మీ వరకు వారంటీ, మరియు 3 సంవత్సరాలు లేదా 80,000 కి.మీ వారంటీ అందుబాటులో ఉన్నాయి.

మహారాష్ట్రలో విడుదలైన Mahindra Treo: ధర & వివరాలు

కంపెనీ యొక్క మహీంద్రా ట్రియో ఎలక్ట్రిక్ రిక్షా గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి 1800 120 150150 కి మిస్డ్ కాల్ ఇచ్చి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ఎలక్ట్రిక్ రిక్షాను కేవలం రూ. 41,500 డౌన్ పేమెంట్‌తో కొనుగోలు చేయవచ్చు. అంతే కాకుండా దీనిపైన కంపెనీ ఫైనాన్స్ సదుపాయం కూడా కల్పిస్తుంది.

మహారాష్ట్రలో విడుదలైన Mahindra Treo: ధర & వివరాలు

ఈ ఎలక్ట్రిక్ రిక్షాపైన ఎస్‌బిఐ 10.8 శాతం చొప్పున ఫైనాన్స్‌ అందిస్తుంది. అంతే కాకుండా దీనిపైన రూ. 7,500 ఎక్స్ఛేంజ్ బోనస్‌ కూడా లభిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ రిక్షాపై కొనుగోలుదారులకు 16 A సాకెట్ ఛార్జర్‌ కూడా లభిస్తుంది. మహీంద్రా ట్రియో దేశవ్యాప్తంగా 13,000 యూనిట్లను విక్రయించింది, దాని విభాగంలో కంపెనీ 67 శాతం వాటాను కలిగి ఉంది.

మహారాష్ట్రలో విడుదలైన Mahindra Treo: ధర & వివరాలు

ఈ ఎలక్ట్రిక్ రిక్షా కొనుగోలు చేసిన కస్టమర్లకు రోడ్ టాక్స్ మరియు రిజిస్ట్రేషన్ వంటివి కూడా అవసరం లేదు. ఈ కారణంగా ఎక్కువమంది వినియోగదారులు సాధారణ లేదా CNG రిక్షాకు బదులుగా ఎలక్ట్రిక్ రిక్షాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. నగరంలో ఇది నడపడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. మహీంద్రా తన కమర్షియల్ త్రీ వీలర్ సెగ్మెంట్‌లో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలను పెంచడానికి తగిన ప్రయత్నాలు చేస్తోంది.

మహారాష్ట్రలో విడుదలైన Mahindra Treo: ధర & వివరాలు

మహీంద్రా కంపెనీ 2025 నాటికి దేశంలోని త్రీ వీలర్ సెగ్మెంట్‌లో దాదాపు 30 శాతం ఎలక్ట్రిక్ వాహనాలే ఉంటాయని తెలిపింది. కమర్షియల్ త్రీ వీలర్ విభాగంలో కంపెనీ త్వరలో 5 కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. దేశంలో ద్విచక్ర వాహనాలతో పాటు, ఎలక్ట్రిక్ త్రీ వీలర్ల డిమాండ్ కూడా పెరుగుతోంది. ఈ ఎలక్ట్రిక్ వాహనాలు పర్యావరణానికి చాలా అనుకూలంగా ఉంటాయి. కావున రానున్న కాలంలో ఎక్కువ భాగం ఎలక్ట్రిక్ వాహనాలే వినియోగంలో ఉంటాయని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు.

Most Read Articles

English summary
Mahindra treo electric rickshaw launched in india price rs 2 09 lakh features details
Story first published: Friday, December 17, 2021, 14:20 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X