XUV700 బుకింగ్స్ ప్రారంభించిన Mahindra.. దీనిని ఎలా బుక్ చేసుకోవాలంటే?

Mahindra & Mahindra కంపెనీ దేశీయ మార్కెట్ కోసం తయారుచేస్తున్న అధునాతన ఎస్‌యువి Mahindra XUV700. ఈ కొత్త ఎస్‌యువి గురించి కంపెనీ ఇప్పటికే చాలా సమాచారాన్ని అందించింది. అయితే ఇప్పుడు తాజాగా కంపెనీ ఈ కొత్త SUV యొక్క బుకింగ్స్ అధికారికంగా స్వీకరించడం ప్రారంభించింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

XUV700 బుకింగ్స్ ప్రారంభించిన Mahindra.. దీనిని ఎలా బుక్ చేసుకోవాలంటే?

Mahindra XUV700 కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు కంపెనీ డీలర్‌షిప్‌లో లేదా కంపెనీ యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవచ్చు. Mahindra XUV700 యొక్క ప్రారంభ ధర రూ. 11.99 లక్షలతో మొదలవుతుంది. ఇది ప్రధానంగా నాలుగు ట్రిమ్‌లలో అందుబాటులో ఉంది. కావున వీటి ధరలు రూ. 22.89 లక్షల వరకు ఉన్నాయి. Mahindra XUV700 SUV కి సంబంధించిన ధరలు ఇటీవల అధికారికంగా విడుదలయ్యాయి.

XUV700 బుకింగ్స్ ప్రారంభించిన Mahindra.. దీనిని ఎలా బుక్ చేసుకోవాలంటే?

Mahindra కంపెనీ తన XUV700 ను దేశీయ మార్కెట్లో ప్రవేశపెట్టినప్పటి నుంచి మంచి డిమాండ్ ఉంది. అయితే ఈ కొత్త SUV యొక్క ధరలను ప్రకటించిన తరువాత దీనికున్న డిమాండ్ మరింత పెరిగింది. కొత్త Mahindra XUV700 కి రోజురోజుకి పెరుగుతున్న డిమాండ్ చూసి కంపెనీ చైర్మన్ ఆనంద్ మహీంద్రా కూడా ట్విట్టర్ ద్వారా సంతోషాన్ని వ్యక్తం చేశారు.

XUV700 బుకింగ్స్ ప్రారంభించిన Mahindra.. దీనిని ఎలా బుక్ చేసుకోవాలంటే?

Mahindra XUV700 బుక్ చేసుకునే విధానం:

Mahindra XUV700 యొక్క బుకింగ్స్ ప్రారంభమయ్యాయి, కానీ దీనిని ఎలా బుక్ చేసుకోవాలి అనే విషయం చాలామందికి తెలిసి ఉన్నప్పటికీ కొంతమందికి తెలియక పోవచ్చు, కావున కొత్త Mahindra XUV700 ని ఎలా బుక్ చేసుకోవాలి అనే విషయం ఇక్కడ తెలుసుకుందాం..

Mahindra XUV700 కొనుగోలు చేయదలసిన వారు, డీలర్‌షిప్‌ను సందర్శించడం ద్వారా నేరుగా ఈ SUV ని బుక్ చేసుకోవచ్చు. అయితే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే వారు ముందుగా కంపెనీ యొక్క అధికారిక వెబ్‌సైట్‌ ఓపెన్ చేయాలి. వెబ్‌సైట్‌ ఓపెన్ చేసిన తరువాత XUV700 ని ఎంచుకున్న తరువాత, మీరు వాహనం యొక్క వేరియంట్, ఇంజిన్ ఆప్సన్ మరియు కలర్ వంటివి ఎంచుకోవాలి.

XUV700 బుకింగ్స్ ప్రారంభించిన Mahindra.. దీనిని ఎలా బుక్ చేసుకోవాలంటే?

ఇవన్నీ చేసిన తరువాత, డీలర్ల ఆప్సన్ కనిపిస్తుంది, అక్కడ మీ నగరాన్ని చూపించనప్పటికీ, స్క్రీన్ కుడి వైపున ఇవ్వబడిన ఆప్సన్ ఎంచుకుని మీ నగరాన్ని ఎంచుకోవచ్చు. డీలర్‌ను ఎంచుకున్న తర్వాత, మీ గురించి సమాచారం కొంత అక్కడ ఇవ్వవలసి ఉంటుంది. అంటే మీ మొబైల్ నంబర్‌ను నమోదు చేసిన తర్వాత, మీ నంబర్‌కు OTP వస్తుంది.

OTP ధృవీకరించిన తర్వాత, మీరు మీ పేరు మరియు ఇమెయిల్ ఐడిని నమోదు చేయాలి, ఆ తర్వాత అనేక ఇతర రకాల సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ SUV ముందస్తు మొత్తాన్ని చెల్లించడం ద్వారా బుక్ చేసుకోవచ్చు, ఆ తర్వాత పూర్తి సమాచారం కూడా మీరు పొందవచ్చు.

XUV700 బుకింగ్స్ ప్రారంభించిన Mahindra.. దీనిని ఎలా బుక్ చేసుకోవాలంటే?

Mahindra XUV700 అక్టోబర్ 1 నుండి డీలర్‌షిప్‌లలో ప్రదర్శించడం ప్రారంభమైంది, కావున కస్టమర్లు డీలర్‌షిప్‌లను సందర్శించి దానిని తనిఖీ చేయవచ్చు. అయితే కంపెనీ ఈ SUV యొక్క మొదటి దశ టెస్ట్ డ్రైవ్ అక్టోబర్ 2 నుండి ప్రారంభించబడింది. మీరు బుకింగ్‌కు ముందు టెస్ట్ డ్రైవ్ చేయాలనుకుంటే, మీరు నేరుగా డీలర్‌షిప్‌ను సందర్శించవచ్చు లేదా వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా టెస్ట్ డ్రైవ్‌ను ఎంచుకోవచ్చు.

XUV700 బుకింగ్స్ ప్రారంభించిన Mahindra.. దీనిని ఎలా బుక్ చేసుకోవాలంటే?

మొదటి దశలో, ఢిల్లీ NCR, బెంగళూరు, ముంబై, హైదరాబాద్, చెన్నై, అహ్మదాబాద్, పూణే, ఇండోర్, లక్నో, కోయంబత్తూర్ మరియు వడోదర ప్రారంభించబడ్డాయి. ఆ తర్వాత రెండవ దశ టెస్ట్ డ్రైవ్ ఈ రోజు (2021 అక్టోబర్ 7) నుండి ప్రారంభమైంది. ఈ దశలో జైపూర్, సూరత్, పాట్నా, కొచ్చిన్, కటక్, కాన్పూర్, కాలికట్ మరియు నాసిక్‌లో టెస్ట్ డ్రైవ్ ప్రారంభమవుతుంది.

XUV700 బుకింగ్స్ ప్రారంభించిన Mahindra.. దీనిని ఎలా బుక్ చేసుకోవాలంటే?

మహీంద్రా కంపెనీ ఇప్పటికే అందించిన సమాచారం ప్రకారం, డెలివరీ తేదీ అక్టోబర్ 10 లోపు ప్రకటించనుంది. అయితే డెలివరీ సమయంలో కంపెనీ ముందుగా పెట్రోల్ మోడల్‌ను డెలివరీ చేయబోతోంది, ఆ తర్వాత డీజిల్ మోడల్ డెలివరీ ప్రారంభమవుతుంది. ఈ పండుగ సీజన్‌లో దీపావళికి ముందు డెలివరీలు ప్రారంభమవుతాయని భావిస్తున్నారు.

XUV700 బుకింగ్స్ ప్రారంభించిన Mahindra.. దీనిని ఎలా బుక్ చేసుకోవాలంటే?

Mahindra XUV700 యొక్క విక్రయాలు త్వరలో ప్రారంభం కానున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఈ కొత్త SUV 5 కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. ఇందులో రెడ్, సిల్వర్, బ్లాక్, బ్లూ మరియు వైట్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి.

XUV700 బుకింగ్స్ ప్రారంభించిన Mahindra.. దీనిని ఎలా బుక్ చేసుకోవాలంటే?

Mahindra XUV700 రెండు ఇంజన్ ఆప్షన్‌లలో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో మొదటిది 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు రెండవది 2.2-లీటర్ టర్బో-డీజిల్ ఇంజన్‌. పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 200 బిహెచ్‌పి పవర్‌ను మరియు 380 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

XUV700 బుకింగ్స్ ప్రారంభించిన Mahindra.. దీనిని ఎలా బుక్ చేసుకోవాలంటే?

ఇక రెండవ ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 2.2-లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్, ఇది 183 బిహెచ్‌పి పవర్ మరియు 420 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది కూడా 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలను కలిగి ఉంటుంది. Mahindra XUV700 నాలుగు డ్రైవింగ్ మోడ్స్ కలిగి ఉంటుంది. అవి జిప్, జామ్, జూమ్ మరియు కస్టమ్ డ్రైవింగ్ మోడ్స్.

Mahindra XUV700 యొక్క బుకింగ్స్ ఎట్టకేలకు ప్రారంభంమయ్యాయి, కావున ఈ కొత్త SUV మంచి ఆదరణ పొందుతుందని మేము ఆశిస్తున్నాము. అయితే ఇది ఎలాంటి ఆదరణ పొందుతుందో త్వరలో తెలుస్తుంది.

Most Read Articles

English summary
Mahindra xuv700 bookings open step wise details
Story first published: Thursday, October 7, 2021, 12:12 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X