హెక్టర్ అంబులెన్స్‌లను విరాళంగా ఇచ్చిన ఎంజీ మోటార్ కంపెనీ

భారతదేశంలో కరోనా మహమ్మారి ప్రవేశించి ఒక సంవత్సర కాలం అవుతోంది. ఈ మహమ్మరి భారినపది ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఈ భయంకరమైన మహమ్మరితో ఇప్పటికి మనదేశం పోరాడుతోంది. ఇందులో భాగంగా మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రభుత్వాలకు ఆటోమొబైల్ కంపెనీలు కూడా తమవంతు సహాయం చేస్తున్నాయి.

హెక్టర్ అంబులెన్స్‌ను విరాళంగా ఇచ్చిన ఎంజీ మోటార్ కంపెనీ

ఇప్పుడు ఎంజీ మోటార్ ఇండియా కంపెనీ కూడా తనదైన రీతిలో సహాయం చేయడానికి ముందుకు వచ్చింది. నాగ్‌పూర్‌లోని ఎంజి మోటార్ ఇండియా, ఎంజి డీలర్లు ఐదు రెట్రోఫిట్ హెక్టర్ అంబులెన్స్‌లను నాగ్‌పూర్‌లోని నంగియా స్పెషాలిటీ ఆసుపత్రికి పంపిణీ చేస్తున్నట్లు ప్రకటించారు.

హెక్టర్ అంబులెన్స్‌ను విరాళంగా ఇచ్చిన ఎంజీ మోటార్ కంపెనీ

ఈ కొత్త అంబులెన్స్‌లను కేంద్ర రహదారి రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. కోవిడ్ -19 ఇన్ఫెక్షన్ల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈ రెట్రోఫిట్ హెక్టర్ అంబులెన్సులు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

MOST READ:ఒకేసారి 12 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన బీహార్ గవర్నమెంట్.. కారణం ఏంటో తెలుసా..!

హెక్టర్ అంబులెన్స్‌ను విరాళంగా ఇచ్చిన ఎంజీ మోటార్ కంపెనీ

ప్రత్యేకంగా రూపొందించిన ఈ ఎంజి హెక్టర్ అంబులెన్స్‌లలో అత్యవసర సమయంలో ప్రాణాలను రక్షించే వైద్య పరికరాలు ఉన్నాయి. ఇందులో ఆటో లోడింగ్ స్ట్రెచర్, సిలిండర్ ఆక్సిజన్ సప్లై సిస్టమ్, ఫైవ్ పారామీటర్ మానిటర్‌తో డ్రగ్ క్యాబినెట్, ఫైర్ ఎక్స్‌టూయిషర్‌తో ఎక్స్టీరియర్ లైట్ బార్, సైరన్, యాంప్లిఫైయర్, బ్యాటరీ మరియు సాకెట్ ఇన్వర్టర్ వంటివి ఉన్నాయి.

హెక్టర్ అంబులెన్స్‌ను విరాళంగా ఇచ్చిన ఎంజీ మోటార్ కంపెనీ

దీని గురించి ఎంజీ మోటార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ చాబా మాట్లాడుతూ, అత్యవసర సమయంలో అవసరమైన వారికి సహాయం చేయడానికి సంస్థ తన ఎంజి హెక్టర్ లను అందిస్తోంది. భవిష్యత్తులో ఇలాంటి ప్రాజెక్టులను కూడా కంపెనీ తమదైన రీతిలో సహాయం చేస్తూనే ఉంటుందని చెప్పారు.

MOST READ:ఆనంద్ మహీంద్రానే ఫిదా చేసిన ఆటో వాలా ఇళ్ళు.. మీరూ చూడండి

హెక్టర్ అంబులెన్స్‌ను విరాళంగా ఇచ్చిన ఎంజీ మోటార్ కంపెనీ

పూణేలోని రూబీ హాల్ క్లినిక్ సహకారంతో అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ నంగియా స్పెషాలిటీ హాస్పిటల్ లో ఈ అంబులెన్స్ సర్వీస్ నిర్వహించబడుతుందని ఎంజి నాగ్పూర్ డీలర్ హెడ్ చెప్పారు. ఈ రకమైన అంబులెన్సులు ప్రస్తుత పరిస్థితులకు చాలా అవసరం.

హెక్టర్ అంబులెన్స్‌ను విరాళంగా ఇచ్చిన ఎంజీ మోటార్ కంపెనీ

ఇటీవల, ఎంజి మోటార్ ఇండియా కంపెనీ సివిటి గేర్‌బాక్స్‌తో ఎంజి హెక్టర్, హెక్టర్ ప్లస్ ఎస్‌యూవీలను విడుదల చేసింది. ఎంజీ హెక్టర్ సివిటి ధర రూ. 16.52 లక్షలు కాగా, హెక్టర్ ప్లస్ సివిటి ధర రూ. 17.22 లక్షలు. కంపెనీ తన స్మార్ట్ మరియు షార్ప్ మోడళ్లలో సివిటి గేర్‌బాక్స్ ఆప్షన్‌ను అందిస్తోంది.

MOST READ:విలేజ్‌లో తయారైన ఈ ఎలక్ట్రిక్ బైక్ ధర చాలా చీప్ గురూ..

హెక్టర్ అంబులెన్స్‌ను విరాళంగా ఇచ్చిన ఎంజీ మోటార్ కంపెనీ

హెక్టర్ ప్లస్ యొక్క ఆరు మోడళ్లకు మాత్రమే సివిటి ఆప్షన్ ఉంది. ఇందులో ఇంజిన్ పరంగా, 1.5-లీటర్ పెట్రోల్ మరియు 2.0-లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లలలో అమ్ముడవుతాయి. ఇందులో ఉన్న పెట్రోల్ ఇంజన్ 141 బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగా, డీజిల్ ఇంజన్ 168 బిహెచ్‌పి పవర్ మరియు 350 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

Most Read Articles

English summary
MG Motor India And MG Nagpur Dealership Donates 5 Hector Ambulance To Speciality Hospital. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X