Just In
- 55 min ago
కారు విలువ 10 లక్షలు.. రిపేర్ ఫీజు 20 లక్షలు; ఇదేంటనుకుంటున్నారా.. ఇది చూడండి
- 2 hrs ago
కారు దొంగలించిన తర్వాత ఓనర్‌కే SMS చేసిన దొంగ.. చివరికి ఏమైందంటే?
- 3 hrs ago
కొత్త తరం మెర్సిడెస్ జిఎల్ఏ బుకింగ్స్ ఓపెన్; త్వరలోనే ఇండియా లాంచ్!
- 4 hrs ago
కరోనా వేళ అందరికోసం 'ఆక్సిజన్ మ్యాన్‌గా' మారిన వ్యక్తి.. ఎక్కడంటే?
Don't Miss
- News
COVID-19: దెబ్బకు హడల్, 10, 000 మంది పోలీసులకు కోవిడ్ పాజిటివ్, సెకండ్ వేవ్ తో షాక్!
- Lifestyle
కరోనా కాలంలో.. రెగ్యులర్ గా రొమాన్స్ చేస్తే ఎన్ని లాభాలో తెలుసా...
- Movies
నైట్ కర్ఫ్యూలో షూటింగ్ చేస్తున్న ఒకే ఒక్క హీరో.. ఆయన కోసమే స్పెషల్ పర్మిషన్
- Finance
Petrol, Diesel Price: స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు
- Sports
అతినితో అతనికే సమస్య: గవాస్కర్ ఆగ్రహానికి గురైన సంజు శాంసన్: టీమిండియాలో చోటు దక్కదంటూ ఫైర్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఈ జట్కా బండ్లకు గుర్రాలు అక్కర్లేదు; వీటిపై సామాన్యులు కూడా సెలబ్రిటీల్లా తిరగొచ్చు!
సుదీర్ఘ విరామం తరువాత ముంబైలో చార్టెడ్ వాహనాలు తిరిగి వాడుకలోకి వచ్చాయి. ఒకప్పుడు గుర్రాలతో నడిపించబడే విక్టోరియా క్యారేజ్‌లను ఈసారి మోడ్రన్ పద్ధతిలో పూర్తిగా బ్యాటరీ పవర్‌తో నడిపించనున్నారు.

అవును మీరు విన్నది నిజమే. ఈ విక్టోరియా క్యారేజ్‌లను నపడటానికి ఇక గుర్రాలు అవసరం లేదు. ఇవి పూర్తిగా బ్యాటరీ మరియు ఎలక్ట్రిక్ మోటార్ల సాయంతో నడుస్తాయి. అంతేకాదు, ఒకప్పుడు సెలబ్రిటీలకు మాత్రమే పరిమితమైన ఈ తరహా వాహనాలు ఇప్పుడు సామాన్యులకు కూడా అందుబాటులోకి వచ్చాయి.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ టాక్రే ముంబైలో ఎలక్ట్రిక్ విక్టోరియా క్యారేజ్‌లను లాంఛనంగా ప్రారంభించారు. ముంబై నగరంలో ఒకప్పుడు ఇలాంటి వాహనాలు చాలా ప్రాచుర్యాన్ని కలిగి ఉండేవి. అయితే, కాలక్రమంలో నగరంలో పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకొని, నగర వీధుల్లో వీటిని నిషేధించారు.
MOST READ:యువకులు కూడా చేయలేని బైక్ స్టంట్ చేసిన యువతి అరెస్ట్

కాగా, ఇవి ఇప్పుడు అదే క్లాసిక్ రూపంలో మోడ్రన్ టెక్నాలజీతో అందుబాటులోకి వచ్చాయి. ఈ ఎలక్ట్రిక్ విక్టోరియా క్యారేజ్‌ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మహారాష్ట్ర పర్యాటక మరియు పర్యావరణ మంత్రి ఆదిత్య థాక్రే మరియు రవాణా మంత్రి అనిల్ ప్రణబ్‌లు కూడా పాల్గొన్నారు.

గతంలో గుర్రాలను ఉపయోగించి ఇలాంటి వాహనాలను నడిపిన యజమానులు ఇప్పుడు బ్యాటరీలతో సాయంతో వీటిని నడపనున్నారు. ముఖ్యమంత్రి ఈ వాహనాలకు సంబంధించిన తాళం చెవులను సదరు వాహన యజమానులకు అందజేశారు. గతంలో (2015లో) బొంబాయి హైకోర్టు ఈ నగర వీధుల్లో గుర్రాలతో నడిచే ఈ వాహనాలను నిషేధించింది.
MOST READ:షిప్పుల గురించి తెలియని ఎన్నో ఆసక్తికర విషయాలు.. ఇక్కడ మీకోసం..ఓ లుక్కేసెయ్యండి

అయితే, తాజాగా గుర్రాలు లేని మరియు ఎలక్ట్రిక్ పవర్‌తో నడిచే ఈ తరహా వాహనాలను ముంబై ప్రభుత్వం ఆమోదించడంతో, నగరంలో చాలా మందికి కొత్త జీవనోపాధి లభించినట్లు అయింది. ప్రారంభంలో భాగంగా మహారాష్ట్ర ప్రభుత్వం మొత్తం 12 రథాలకు ఆమోదం తెలిపింది.

వీటిని గేట్‌వే ఆఫ్ ఇండియా, ఫ్లోరా ఫౌంటెన్, గాలా కోటా, మెరైన్ డ్రైవ్, కిర్కావుమ్ చౌపతి మరియు నారిమన్ పాయింట్లతో సహా ముంబై నగరంలో టూరిస్టులు అధికంగా పలు ప్రాంతాల్లో వీటిని ఉపయోగించనున్నారు. ఈ వాహనాలను ఉబో రైడ్స్ అనే ప్రైవేట్ సంస్థ నిర్వహిస్తోంది. ఇవి పూర్తిగా పర్యావరణ సాన్నిహిత్యమైనవి మరియు సున్నా ఉద్ఘారాలను విడుదల చేస్తాయి.
MOST READ:ఒక చార్జితో 300 కి.మీ ప్రయాణించే వాహనం.. ఇది తయారుచేసింది కంపెనీలు కాదు.. ఒక రైతు

బ్యాటరీతో నడిచే ఈ విక్టోరియా క్యారేజ్ వాహనాలు గరిష్టంగా గంటకు 20 కిలోమీటర్ల వేగంతో మాత్రమే ప్రయాణిస్తాయి. వీటిని ప్రత్యేకించి టూరిజం ప్రయోజనాల కోసం తయారు చేశారు. పూర్తి చార్జ్‌పై ఇవి 70 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తాయి. ఇందులో లిథియం అయాన్ బ్యాటరీలను ఉపయోగించారు.

ఈ వాహనాల్లో డ్రైవర్ కాకుండా మొత్తం ఆరుగురు ప్రయాణీకులు కూర్చోవచ్చు. ఈ వాహనం మొత్తం బరువు 650 కిలోలుగా ఉంటుంది. ముంబై నగరంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న విస్తృతమైన చార్జింగ్ నెట్‌వర్క్ సాయంతో వీటిని ఎప్పుడైనా ఎక్కడైనా సులువుగా చార్జ్ చేసుకునే వెసలుబాటు ఉంటుంది.
MOST READ:రోడ్డుపై యాక్టివా స్కూటర్‌పై ఉన్న యువతి చేసిన పనికి చిర్రెత్తిన కెటిఎమ్ బైక్ రైడర్