రూ.16,000 పెరిగిన టాటా నెక్సాన్ ఈవీ ధరలు; ప్రారంభ ధర రూ.13.99 లక్షలు

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ తమ పోర్ట్‌ఫోలియోలో కొన్ని కార్ల ధరలను పెంచింది. ఇందులో టాటా మోటార్స్ అందిస్తున్న ఎలక్ట్రిక్ కారు 'టాటా నెక్సాన్ ఈవీ' ధరలు కూడా పెరిగాయి. ప్రస్తుతం టాటా నెక్సాన్ ఈవీ మూడు వేరియంట్లలో లభిస్తుంది.

రూ.16,000 పెరిగిన టాటా నెక్సాన్ ఈవీ ధరలు; ప్రారంభ ధర రూ.13.99 లక్షలు

దేశీయ మార్కెట్లో టాటా నెక్సాన్ ఈవీ ఎక్స్ఎమ్, ఎక్స్‌జెడ్ ప్లస్ మరియు ఎక్స్‌జెడ్ ప్లస్ లగ్జరీ అనే మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇందులో బేస్ వేరియంట్ మినహా మిగిలిన అన్ని వేరియంట్ల ధరలను కంపెనీ పెంచింది.

రూ.16,000 పెరిగిన టాటా నెక్సాన్ ఈవీ ధరలు; ప్రారంభ ధర రూ.13.99 లక్షలు

ప్రస్తుతం మార్కెట్లో బేస్ వేరియంట్ ప్రారంభ ధర రూ.13.99 లక్షలుగా (ఎక్స్-షోరూమ్, ఇండియా) ఉంది. కాగా, టాటా నెక్సాన్ ఎక్స్‌జెడ్ ప్లస్ మరియు ఎక్స్‌జెడ్ ప్లస్ లగ్జరీ వేరియంట్ల ధరలను కంపెనీ రూ.16,000 మేర పెంచింది.

MOST READ:వావ్.. అమేజింగ్ ట్యాలెంట్.. వీడియో చూస్తే హవాక్కవ్వాల్సిందే

రూ.16,000 పెరిగిన టాటా నెక్సాన్ ఈవీ ధరలు; ప్రారంభ ధర రూ.13.99 లక్షలు

ధరల పెంపుకు ముందు ఎక్స్‌జెడ్ ప్లస్ వేరియంట్‌ను రూ.15.40 లక్షలకు విక్రయిస్తుండగా, ఇప్పుడు దీని ధర రూ.15.66 లక్షలకు పెరిగింది. అలాగే, టాటా నెక్సాన్ ఈవీ ఎక్స్‌జెడ్ ప్లస్ లగ్జరీ వేరియంట్ ధర రూ.16.40 లక్షల నుండి రూ.16.56 లక్షలకు పెరిగింది (పైన పేర్కొన్న అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా).

రూ.16,000 పెరిగిన టాటా నెక్సాన్ ఈవీ ధరలు; ప్రారంభ ధర రూ.13.99 లక్షలు

టాటా నెక్సాన్ ఈవీ ధరలు పెరిగినప్పటికీ, ఇది ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ఎలక్ట్రిక్ కార్లలో కెల్లా చవకైన మరియు లాంగ్ రేంజ్ ఎలక్ట్రిక్ కార్లలో ఒకటిగా కొనసాగుతుంది. ఇటీవలే టాటా నెక్సాన్ ఈవీ దేశంలోనే అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ కారుగా అవతరించింది.

MOST READ:ఈ వాహనాలు టోల్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు; NHAI

రూ.16,000 పెరిగిన టాటా నెక్సాన్ ఈవీ ధరలు; ప్రారంభ ధర రూ.13.99 లక్షలు

టాటా మోటార్స్ నెక్సాన్ ఈవీని మార్కెట్లో ప్రవేశపెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు సుమారు 4,000 యూనిట్లకు పైగా విక్రయించినట్లు కంపెనీ పేర్కొంది. జనవరి 28, 2020వ తేదీన టాటా నెక్సాన్ ఈవీ కారును తొలిసారిగా భారత మార్కెట్లో విడుదల చేశారు. ఆగస్టు 18, 2020 నాటికి నెక్సాన్ ఈవీ 1,000 యూనిట్ల మార్కును మరియు డిసెంబర్ 2, 2020 నాటికి 2000 యూనిట్ల మార్కును చేరుకుంది.

రూ.16,000 పెరిగిన టాటా నెక్సాన్ ఈవీ ధరలు; ప్రారంభ ధర రూ.13.99 లక్షలు
Variants Old Price New Price Difference
XM ₹13.99 Lakh ₹13.99 Lakh NIL
XZ+ ₹15.40 Lakh ₹15.56 Lakh ₹16,000
XZ+ LUX ₹16.40 Lakh ₹16.56 Lakh ₹16,000

MOST READ:వావ్.. అమేజింగ్ ట్యాలెంట్.. వీడియో చూస్తే హవాక్కవ్వాల్సిందే

రూ.16,000 పెరిగిన టాటా నెక్సాన్ ఈవీ ధరలు; ప్రారంభ ధర రూ.13.99 లక్షలు

కంపెనీ పేర్కొన్న ప్రకారం, నెక్సాన్ ఈవి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ పూర్తి ఛార్జీపై 312 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్‌ను ఆఫర్ చేస్తుంది. నెక్సాన్ ఈవీ స్టాండర్డ్ మరియు ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీలని సపోర్ట్ చేస్తుంది. హోమ్ ఛార్జర్ ద్వారా ఈ కారు పూర్తిగా ఛార్జ్ చేయటానికి సుమారు 7 నుండి 8 గంటల సమయం పడుతుంది. అదే ఫాస్ట్ ఛార్జర్ ద్వారా అయితే, కేవలం 60 నిమిషాల్లో బ్యాటరీని 0 నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు.

Most Read Articles

English summary
Tata Nexon EV Price Increased Upto INR 16000, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X