ప్రపంచంలోనే టెస్లా మోడల్ 3 నెంబర్ వన్, ఈ మోడల్ ఇండియాలో కూడా..

యావత్ ప్రపంచం ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్లవైపు మొగ్గు చూపుతోంది. ఎలక్ట్రిక్ కార్లను నడపడం మాత్రమే కాదు నిర్వహించడం కూడా చాలా సులువుగా ఉంటాయి. పెట్రోల్/డీజిల్ వంటి కార్లతో పోల్చుకుంటే ఎలక్ట్రిక్ వాహనాల వలన మనకు మరియు మన పర్యావరణానికి కలిగే ప్రయోజనాలే ఎక్కువగా ఉన్న నేపథ్యంలో, వీటి వినియోగం కూడా గణనీయంగా పెరుగుతోంది.

ప్రపంచంలోనే టెస్లా మోడల్ 3 నెంబర్ వన్, ఈ మోడల్ ఇండియాలో కూడా..

గడచిన 2020లో ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడుపోయిన ఎలక్ట్రిక్ వాహనాల జాబితా తాజాగా విడుదలైంది. ఇందులో అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ కంపెనీ టెస్లా విక్రయిస్తున్న 'మోడల్ 3' ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది.

ప్రపంచంలోనే టెస్లా మోడల్ 3 నెంబర్ వన్, ఈ మోడల్ ఇండియాలో కూడా..

టెస్లా ఐఎన్‌సి నుండి లభిస్తున్న ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్ కారు ఈ మోడల్ 3. దీని సరసమైన ధర మరియు అద్భుతమైన ఫీచర్ల కారణంగా ఇది ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ కారుగా నిలిచింది. టెస్లా కంపెనీ నుండి హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న కార్లలో ఇదే అగ్రస్థానంలో ఉంది.

MOST READ:ఈ వాహనంలో మనుషులకు మాత్రమే కాదు, కుక్కలకు కూడా లగ్జరీ ఫీచర్స్.. ఆ వాహనాన్ని మీరు చూసారా..!

ప్రపంచంలోనే టెస్లా మోడల్ 3 నెంబర్ వన్, ఈ మోడల్ ఇండియాలో కూడా..

గత 2020 సంవత్సరంలో టెస్లా మొత్తం 3,65,240 యూనిట్ల మోడల్ 3 ఎలక్ట్రిక్ కార్లను విక్రయించింది. ఇది మొత్తం ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో 12 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. టెస్లా ఇటీవలే భారతదేశంలోకి కూడా ప్రవేశిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసినదే. టెస్లా నుండి ముందుగా మన మార్కెట్లో విడుదల కానున్న కారు కూడా ఈ 'మోడల్ 3'నే కావటం విశేషం.

ప్రపంచంలోనే టెస్లా మోడల్ 3 నెంబర్ వన్, ఈ మోడల్ ఇండియాలో కూడా..

టెస్లా మోడల్ 3 తరువాత, ఈ జాబితాలో ద్వితీయ స్థానాన్ని దక్కించుకుంది చైనాకి చెందిన ఉలింగ్ హాంగ్‌గువాంగ్ మినీ ఎలక్ట్రిక్ కారు. ఇది చిన్న కారే అయినా అమ్మకాల పరంగా అద్భుతాలను సృష్టించిన కారు. గతేడాది మొత్తం 119,255 ఉలింగ్ మినీ కార్లు ప్రపంచ వ్యాప్తంగా అమ్ముడయ్యాయి.

MOST READ:భారత్‌లో శరవేగంగా జరుగుతున్న రోడ్డు నిర్మాణం.. ప్రతిరోజు రికార్డ్ స్థాయిలో పూర్తి

ప్రపంచంలోనే టెస్లా మోడల్ 3 నెంబర్ వన్, ఈ మోడల్ ఇండియాలో కూడా..

ఫ్రెంచ్ కార్ బ్రాండ్ రెనో గ్లోబల్ మార్కెట్లలో విక్రయిస్తున్న జోయి ఎలక్ట్రిక్ కారు ఈ జాబితాలో తృతీయ స్థానంలో ఉంది. గతేడాదిలో ఈ కారు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 1,00,431 యూనిట్ల విక్రయాలను నమోదు చేసుకుంది.

ప్రపంచంలోనే టెస్లా మోడల్ 3 నెంబర్ వన్, ఈ మోడల్ ఇండియాలో కూడా..

రెనో జోయి తర్వాత ఈ జాబితాలో టాప్ 4 స్థానాన్ని దక్కించుకుంది టెస్లా కంపెనీకి మోడల్ వై ఎలక్ట్రిక్ కారు. ఇది చూడటానికి ఎస్‌యూవీలా కనిపించే ఓ క్రాసోవర్. ఇందులో మూడు వరుసల సీటింగ్ ఉండి, ఏడుగురు ప్రయాణీకులు ప్రయాణించేందుకు వీలుగా ఉంటుంది. గతేడాది మొత్తం 79,734 యూనిట్ల టెస్లా మోడల్ వై కార్లు అమ్ముడుపోయాయి.

MOST READ:విమనాలు ల్యాండ్ అయ్యేటప్పుడు వాటర్ సెల్యూట్ ఎదుకు చేస్తారో మీకు తెలుసా..?

ప్రపంచంలోనే టెస్లా మోడల్ 3 నెంబర్ వన్, ఈ మోడల్ ఇండియాలో కూడా..

కాగా, ఈ జాబితాలో ఐదవ స్థానంలో ఉన్నది హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ కారు. గత 2020లో హ్యుందాయ్ ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 65,075 యూనిట్ల కోనా ఎలక్ట్రిక్ కార్లను విక్రియంచింది. ఈ మోడల్ మన భారత మార్కెట్లో కూడా లభ్యమవుతోంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ ఫిబ్రవరిలో కోనా ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేసే కస్టమర్లకు కంపెనీ రూ.1.50 లక్షల డిస్కౌంట్‌ను కూడా అందిస్తోంది.

ప్రపంచంలోనే టెస్లా మోడల్ 3 నెంబర్ వన్, ఈ మోడల్ ఇండియాలో కూడా..

మన భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు గిరాకీ క్రమంగా పెరుగుతోంది. భారత మార్కెట్లో టాటా నెక్సా ఈవీ అత్యధిక మార్కెట్ వాటాతో ఈ విభాగంలో నెంబర్ వన్ ఎలక్ట్రిక్ కారుగా కొనసాగుతోంది. ఎలక్ట్రిక్ కార్లను వినియోగించడం వలన పర్యావరణానికి ఎంతో కొంత మేలు చేయటమే కాకుండా, నిరంతరం పెరుగుతున్న పెట్రోల్ మరియు డీజిల్ ధరల నుండి మన పర్స్‌ని ఆదా చేయటంలో ఇవి సహకరిస్తాయి.

MOST READ:తండ్రి దూరమయ్యాక జ్ఞాపకార్థం హార్దిక్ పాండ్యా పంచుకున్న వీడియో, ఇదే

Most Read Articles

English summary
Top 5 Best Selling EVs In 2020; Tesla Model 3 Takes The Lead. Read In Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X