2021 సెప్టెంబర్‌లో పెరిగిన Toyota సేల్స్.. ఏకంగా 14% వృద్ధి: వివరాలు

ప్రముఖ వాహన తయారీ సంస్థ Toyota 2021 సెప్టెంబర్ అమ్మకాల నివేదికను అధికారికంగా విడుదల చేసింది. కంపెనీ విడుదల చేసిన నివేదికల ప్రకారం, సెప్టెంబర్ నెలలో మొత్తం 9,284 యూనిట్లను విక్రయించి, మార్కెట్లో 14 శాతం వృద్ధిని నమోదు చేసింది. గత సంవత్సరం అంటే 2020 లో కంపెనీ మొత్తం 8,116 యూనిట్ల ప్యాసింజర్ వాహనాలను విక్రయించినట్లు తెలిపింది.

2021 సెప్టెంబర్‌లో పెరిగిన Toyota సేల్స్.. ఏకంగా 14% వృద్ధి: వివరాలు

కంపెనీ మొత్తం అమ్మకాల విషయానికొస్తే, ఈ ఏడాది 2021 జనవరి మరియు 2021 సెప్టెంబర్ మధ్య 94,493 యూనిట్ల ప్యాసింజర్ వాహనాలను విక్రయించింది. గత సంవత్సరం ఇదే సమయంలో (2020 జనవరి మరియు 2020 సెప్టెంబర్) 47,743 యూనిట్లను విక్రయించింది. దీన్ని బట్టి చూస్తే కంపెనీ యొక్క మొత్తం అమ్మకాలు మునుపటికంటే 98 శాతం వృద్ధిని నమోదు చేయగలిగింది.

2021 సెప్టెంబర్‌లో పెరిగిన Toyota సేల్స్.. ఏకంగా 14% వృద్ధి: వివరాలు

భారతదేశంలో కరోనా మహమ్మారి అధికంగా వ్యాపించిన సమయంలో ఆటో పరిశ్రమ మొత్తం చాలా నష్టాలను ఎదుర్కోవలసి వచ్చింది. ఇందులో Toyota కంపెనీ కూడా ఉంది. అయితే ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టి పరిస్థితి సాధారణ స్థితికి చేరింది. కావున ఈ సమయంలో Toyota యొక్క అమ్మకాలు మళ్ళీ పుంజుకున్నాయి.

2021 సెప్టెంబర్‌లో పెరిగిన Toyota సేల్స్.. ఏకంగా 14% వృద్ధి: వివరాలు

ప్రస్తుతం భారతదేశంలో పండుగ సీజన్ ప్రారంభమయ్యింది. కావున కంపెనీ యొక్క అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా టొయోటా కిర్లోస్కర్ మోటార్స్ సేల్స్ అండ్ మార్కెటింగ్ హెడ్ వి. విసిలిన్ సిగమణి మాట్లాడుతూ, పండుగ సీజన్ దగ్గరపడే కొద్దీ కంపెనీ అమ్మకాలు మరింత పెరుగుదల దిశవైపు సాగుతుందని తెలిపారు. దీన్ని బట్టి చూస్తే, కంపెనీ యొక్క అమ్మకాలు పెరుగుతాయని ఖచ్చితంగా చెప్పవచ్చు.

2021 సెప్టెంబర్‌లో పెరిగిన Toyota సేల్స్.. ఏకంగా 14% వృద్ధి: వివరాలు

ప్రస్తుతం ప్రపంచ ఆటో పరిశ్రమ సెమీకండక్టర్ల కొరతను ఎదుర్కొంటుంది. ఈ కారణంగా చాలా కంపెనీలు ఆశించిన స్థాయిలో వాహనాలను ఉత్పత్తి చేయలేకపోతున్నాయి. Toyota కంపెనీ కూడా ఈ ఆర్థిక సంవత్సరంలో 3,00,000 కార్లను ఉత్పత్తి చేస్తుందని, ప్రకటించింది. కానీ సెమీకండక్టర్ల కొరత ఈ లక్ష్యాన్ని చేరుకోనివ్వలేదు.

2021 సెప్టెంబర్‌లో పెరిగిన Toyota సేల్స్.. ఏకంగా 14% వృద్ధి: వివరాలు

సెమీకండక్టర్ల కొరత కర్నాటకలోని కంపెనీ ఫ్యాక్టరీలో ఉత్పత్తిని ప్రభావితం చేస్తుందో లేదో టయోటా ఇంకా నిర్ధారించలేదు. టయోటా ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ఇన్నోవా క్రిస్టా, ఫార్చ్యూనర్, అర్బన్ క్రూయిజర్, గ్లాంజా, యారిస్, క్యామ్రీ మరియు వెల్‌ఫైర్ వంటి మోడళ్లను విక్రయిస్తోంది. ఇవన్నీ కూడా మార్కెట్లో మంచి ప్రజాదరణ పొందుతున్నాయి.

2021 సెప్టెంబర్‌లో పెరిగిన Toyota సేల్స్.. ఏకంగా 14% వృద్ధి: వివరాలు

ఇది మాత్రమే కాకుండా, దక్షిణ ఆసియాలో కరోనా వ్యాప్తి వల్ల, ఆటో విడిభాగాల కొరత ఏర్పడిందని టయోటా తెలిపింది. ఇవన్నీ ఉత్పత్తిపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. రానున్న రోజుల్లో కూడా ఈ చిప్స్ కొరత ఇలాగే కొనసాగే అవకాశం ఉంటుంది. కావున దీని ప్రభావం అమ్మకాలపైన ఎటువంటి ప్రభావం చూపుతుందో తెలియరావాలి.

2021 సెప్టెంబర్‌లో పెరిగిన Toyota సేల్స్.. ఏకంగా 14% వృద్ధి: వివరాలు

టయోటా తన ప్యాసింజర్ కార్ల ధరలను అక్టోబర్ నుండి పెంచుతున్నట్లు ప్రకటించింది. అయితే భారతదేశంలో ప్రారంభం కానున్న పండుగ సీజన్లో దేశవ్యాప్తంగా చాలా మంది కార్ల తయారీదారులు తమ వాహనాల ధరలను పెంచే అవకాశం కనిపిస్తుంది. Toyota కంపెనీ ఏ మోడల్ పై ఎంత ధరను పెంచుతుంది అనే విషయంపై అధికారిక సమాచారం వెల్లడించలేదు. కానీ దీనికి సంబంధించిన సమాచారం త్వరలో విడుదలవుతుంది.

2021 సెప్టెంబర్‌లో పెరిగిన Toyota సేల్స్.. ఏకంగా 14% వృద్ధి: వివరాలు

కంపెనీ తమ కస్టమర్లపైన వీలైనంత తక్కువ భారాన్ని మోపడానికి తగిన ప్రయత్నాలు చేస్తుంది. ఈ కారణంగానే కంపెనీ తమ వాహనాల ధరలను తక్కువ మొత్తంలో మాత్రమే పెంచుతుంది. ఎందుకంటే భారీగా పెరిగే ధరల కంపెనీ యొక్క అమ్మకాలపై ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది. కావున ఇలాంటి ప్రభావాన్ని నివారించడానికి కంపెనీ తగిన ఏర్పాట్లు చేస్తుంది.

2021 సెప్టెంబర్‌లో పెరిగిన Toyota సేల్స్.. ఏకంగా 14% వృద్ధి: వివరాలు

కంపెనీ నివేదికల ప్రకారం తమ బ్రాండ్ అయిన Toyota Yaris మోడల్ నిలిపివేస్తున్నట్లు తెలిపింది. దేశీయ మార్కెట్లో Toyota Yaris అత్యంత ఆకర్షణీయమైన మోడల్ అయినప్పటికీ, ఎక్కువ ప్రజాదరణ పొందటంలో విఫలం అయ్యింది. కావున ఈ కారణంగా కంపెనీ ఈ మోడల్ నిలిపివేస్తున్నట్లు తెలిపింది.

Toyota గత 2021 ఆగస్టులో తన ప్రసిద్ధ MPV అయిన Innova Crysta ధరను కూడా పెంచింది. అధిక ధరల ప్రభావాన్ని తగ్గించడానికి తక్కువ మొత్తంలో మాత్రమే ధరలను పెంచినట్లు తెలిపింది. తక్కువ మొత్తంలో ధరల పెరుగుదల కస్టమర్‌లపై ఎక్కువ ప్రభావాన్ని చూపే అవకాశం ఉండదు.కావున అమ్మకాలు మరింత పెరుగుతాయి.

Most Read Articles

Read more on: #టయోటా #toyota
English summary
Toyota car sales september 9284 units details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X