అక్టోబర్ 2021లో విడుదల కానున్న టాప్ 4 కార్లు: ఎంజి ఆస్టర్, టాటా పంచ్, ఎక్స్‌యూవీ700..!

అక్టోబర్ నెలలో పండగ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో, కార్ల తయారీ సంస్థలు తమ కొత్త ఉత్పత్తులను మార్కెట్లో విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నాయి. వచ్చే అక్టోబర్ 2021 నెలలో ఎమ్‌జి మోటార్ తమ ఆస్టర్ ఎస్‌యూవీ విడుదల చేసేందుకు సిద్ధంగా ఉండగా, టాటా మోటార్స్ తమ పంచ్ మైక్రో ఎస్‌యూవీని మరియు మహీంద్రా తమ ఎక్స్‌యూవీ700 ఎస్‌యూవీని విడుదల చేయనుంది.

అక్టోబర్ 2021లో విడుదల కానున్న టాప్ 4 కార్లు: ఎంజి ఆస్టర్, టాటా పంచ్, ఎక్స్‌యూవీ700..!

ఇదే సమయంలో, జర్మన్ కార్ బ్రాండ్ ఫోక్స్‌వ్యాగన్ కూడా తమ టిగువాన్ ఎస్‌యూవీ ఫేస్‌లిఫ్ట్‌ విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది. వచ్చే నెలలో విడుదలయ్యే కొత్త కార్లకు సంబంధించిన మరింత సమాచారాన్ని ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

అక్టోబర్ 2021లో విడుదల కానున్న టాప్ 4 కార్లు: ఎంజి ఆస్టర్, టాటా పంచ్, ఎక్స్‌యూవీ700..!

1. MG Astor (ఎంజి ఆస్టర్)

చైనీస్ కార్ బ్రాండ్ ఎంజి మోటార్ (MG Motor) నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యూచరిస్టిక్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ ఎంజి ఆస్టర్ (MG Astor) ను కంపెనీ వచ్చే నెలలో మార్కెట్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది. మార్కెట్ సమాచారం ప్రకారం, ఈ ఎస్‌యూవీ అక్టోబర్ 7వ తేదీన విడుదలయ్యే అకాశం ఉంది మరియు అదే రోజున కంపెనీ దీని ధర మరియు ఇతర వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.

అక్టోబర్ 2021లో విడుదల కానున్న టాప్ 4 కార్లు: ఎంజి ఆస్టర్, టాటా పంచ్, ఎక్స్‌యూవీ700..!

తాజా సమాచారం ప్రకారం, కొత్త ఎంజి ఆస్టర్ ఎస్‌యూవీని మొత్తం ఐదు ట్రిమ్‌ లలో మార్కెట్‌లో లాంచ్ చేయవచ్చు. ఈ ట్రిమ్‌లలో స్టైల్, సూపర్, స్మార్ట్, షార్ప్ మరియు శావీ లు ఉన్నాయి. ఈ ట్రిమ్‌లు మొత్తం రెండు ఇంజన్ ఆప్షన్లతో వర్గీకరించబడతాయి. ఆస్టర్ యొక్క ఉత్పత్తిని కంపెనీ పరిమిత (3000) యూనిట్లలో మాత్రమే అందుబాటులో ఉంచే అవకాశం ఉంది. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

అక్టోబర్ 2021లో విడుదల కానున్న టాప్ 4 కార్లు: ఎంజి ఆస్టర్, టాటా పంచ్, ఎక్స్‌యూవీ700..!

2. టాటా పంచ్ (Tata Punch)

దేశీయ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్ (Tata Motors) నుండి ఆసక్తిగా ఎదురుచూస్తున్న మైక్రో ఎస్‌యూవీ టాటా పంచ్ (Tata Punch) అక్టోబర్ 4వ తేదీన మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఆ వెంటనే ఈ చిన్న ఎస్‌యూవీ కోసం బుకింగ్స్ కూడా ప్రారంభం అవుతాయని సమాచారం. కొత్త Tata Punch మైక్రో SUV లో 1.2-లీటర్, మూడు-సిలిండర్, రివోట్రాన్ పెట్రోల్ ఇంజన్‌‌ను ఉపయోగించే అవకాశం ఉంది. ఇదే ఇంజన్ ను Tata Tiago మోడల్ లో కూడా ఉపయోగిస్తున్నారు.

అక్టోబర్ 2021లో విడుదల కానున్న టాప్ 4 కార్లు: ఎంజి ఆస్టర్, టాటా పంచ్, ఎక్స్‌యూవీ700..!

టాటా పంచ్ మైక్రో ఎస్‌యూవీ మొత్తం నాలుగు ట్రిమ్‌ లలో అందుబాటులో ఉండనుంది. ఈ ట్రిమ్‌లలో ప్యూర్, అడ్వెంచర్, అకాంప్లిష్డ్ మరియు క్రియేటివ్ అనేవి ఉన్నాయి. ఈ ట్రిమ్‌లు మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభ్యం కానున్నాయి. అంతేకాకుండా, ఈ కారును మూడు సింగిల్ టోన్ మరియు ఆరు డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్లలో అందించనున్నారు. - ఈ ఎస్‌యూవీకి సంబంధించిన మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

అక్టోబర్ 2021లో విడుదల కానున్న టాప్ 4 కార్లు: ఎంజి ఆస్టర్, టాటా పంచ్, ఎక్స్‌యూవీ700..!

3. మహీంద్రా ఎక్స్‌యూవీ700 (Mahindra XUV700)

ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా ఆవిష్కరించిన ఫ్యూచరిస్టిక్ ఎస్‌యూవీ మహీంద్రా ఎక్స్‌యూవీ700 అమ్మకాలు త్వరలో ప్రారంభం కానున్నాయు. కంపెనీ ఇప్పటికే ఈ మోడల్ ను డీలర్‌షిప్‌ లకు డెలివరీ చేయడం కూడా ప్రారంభించింది. మహీంద్రా ఎక్స్‌యూవీ700 ఎమ్ఎక్స్, ఏఎక్స్3, ఏఎక్స్5 మరియు ఏఎక్స్7 అనే నాలుగు ట్రిమ్ లలో వివిధ వేరియంట్లలో లభ్యం కానుంది. ఇందులో 5-సీటర్ మరియు 7-సీటర్ కాన్ఫిగరేషన్లు కూడా ఉన్నాయి.

అక్టోబర్ 2021లో విడుదల కానున్న టాప్ 4 కార్లు: ఎంజి ఆస్టర్, టాటా పంచ్, ఎక్స్‌యూవీ700..!

మహీంద్రా ఎక్స్‌యూవీ700 కోసం ఇప్పటికే బుకింగ్ లు కూడా ప్రారంభమైనట్లు సమాచారం. త్వరలోనే దీని టెస్ట్ డ్రైవ్ లు కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ ఎస్‌యూవీని కంపెనీ వివిధ రకాల కాన్ఫిగరేషన్లతో మొత్తం 34 వేరియంట్లలో విక్రయించుంది. ఇది 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు 2.2-లీటర్ టర్బో-డీజిల్ ఇంజన్‌ ఆప్షన్లతో లభ్యం కానుంది. పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 200 బిహెచ్‌పి పవర్‌ను మరియు 380 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, 2.2-లీటర్ టర్బో డీజిల్ ఇంజన్, ఇది 183 బిహెచ్‌పి పవర్ మరియు 420 ఎన్ఎమ్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇందులో 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. - మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

అక్టోబర్ 2021లో విడుదల కానున్న టాప్ 4 కార్లు: ఎంజి ఆస్టర్, టాటా పంచ్, ఎక్స్‌యూవీ700..!

4. ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ ఫేస్‌లిఫ్ట్ (Volkswagen Tiguan Facelift)

జర్మన్ కార్ బ్రాండ్ ఫోక్స్‌వ్యాగన్ గతంలో భారత మార్కెట్లో విక్రయించి, బిఎస్6 నిబంధనల తర్వాత నిలిపివేసిన టిగువాన్ ఎస్‌యూవీలో కంపెనీ ఓ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను త్వరలో తీసుకురాబోతోంది. ప్రీ-ఫేస్‌లిఫ్ట్ మోడల్ మాదిరిగా కాకుండా, కొత్త ఫేస్‌లిఫ్టెడ్ 2021 ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ పెట్రోల్ ఇంజన్‌ తో మాత్రమే లభ్యం కానుంది. అంతేకాకుండా, ఈ కారులో చిన్నపాటి అప్‌గ్రేడ్స్ ను కూడా మనం ఆశించవచ్చు.

అక్టోబర్ 2021లో విడుదల కానున్న టాప్ 4 కార్లు: ఎంజి ఆస్టర్, టాటా పంచ్, ఎక్స్‌యూవీ700..!

ఇంజన్ విషయానికి వస్తే, ఇదివరకటి మోడల్ లో ఉపయోగించిన 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ నే కంపనీ ఈ కొత్త 2021 ఫేస్‌లిఫ్ట్ మోడల్ లో కూడా ఉపయోగించే అవకాశం ఉంది. ఈ ఇంజన్ గరిష్టంగా 190 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. కంపెనీ ఇందులో 4-వీల్ డ్రైవ్ సిస్టమ్‌ను కూడా ఆఫర్ చేయవచ్చని సమాచారం. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Upcoming car launches in october 2021 mg astor tata punch mahindra xuv700 and more
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X