Just In
- 16 hrs ago
కొత్త సంవత్సరంలో హ్యుందాయ్ ఐ20 కొత్త ధరలు - వివరాలు
- 1 day ago
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
- 2 days ago
అమరేంద్ర బాహుబలి (ప్రభాస్) కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- 2 days ago
XUV400 EV బుకింగ్స్‌లో దుమ్మురేపుతున్న మహీంద్రా.. ఇప్పటికే వచ్చిన బుకింగ్స్ ఎన్నంటే?
Don't Miss
- Movies
K Viswanath పాట రాస్తూ కే విశ్వనాథ్ మృత్యువు ఒడిలోకి! కొనఊపిరి వరకు సినిమా కోసం కళాతపస్వి తపన
- Lifestyle
Women Money Habits: మహిళల ఈ అలవాట్లతో ఉన్నదంతా పోయి బికారీ కావాల్సిందే!
- News
జేఈఈ మెయిన్స్ ఆన్సర్ కీ 2023 విడుదల: డౌన్లోడ్ చేసుకోండిలా!
- Sports
కోహ్లీ.. ఆ ఆసీస్ బౌలర్లను దంచికొట్టాలి! లేకుంటే మొదటికే మోసం: ఇర్ఫాన్ పఠాన్
- Finance
nri taxes: బడ్జెట్ వల్ల NRIలకు దక్కిన నాలుగు ప్రయోజనాలు..
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
భారత్‌లో Aura ఫేస్‌లిఫ్ట్ విడుదల చేసిన హ్యుందాయ్: ధర & వివరాలు
కొత్త సంవత్సరం ప్రారంభం నుంచి దేశీయ మార్కెట్లో అనేక ఆధునిక వాహనాలు విడుదలవుతున్నాయి. ఇందులో భాగంగానే హ్యుందాయ్ కంపెనీ ఈ రోజు తన 'ఆరా' (Aura) ఫేస్‌లిఫ్ట్ విడుదల చేసింది. కంపెనీ విడుదల చేసిన ఈ కొత్త Aura ఫేస్‌లిఫ్ట్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త హ్యుందాయ్ ఆరా ఫేస్‌లిఫ్ట్ ప్రారంభ ధరలు రూ. 6.29 లక్షలు (ఎక్స్-షోరూమ్) కాగా, CNG SX వేరియంట్ ధర రూ. 8.47 లక్షలు (ఎక్స్ షోరూమ్). దేశీయ విఫణిలో ఈ కొత్త ఫేస్‌లిఫ్ట్ కోసం బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. కావున ఈ హ్యుందాయ్ కారు కొనాలనుకునే వారు రూ. 11,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి.

హ్యుందాయ్ ఆరా ఫేస్‌లిఫ్ట్ అప్డేటెడ్ డిజైన్ కలిగి ఉంటుంది. ఈ ఫేస్‌లిఫ్ట్ ముందు భాగంలో కొత్త ఫ్రంట్-ఎండ్ డిజైన్ చూడవచ్చు. ఇందులో బ్లాక్ కలర్ గ్రిల్ ఉంటుంది. అంతే కాకుండా ఇందుల ఇన్వర్టెడ్ ఎల్ షేప్ LED DRL బంపర్ చివర్లలో అమర్చబడి ఉంటాయి. ముందు భాగంలో బ్రాండ్ లోగో కూడా ఉంది. సైడ్ ప్రొఫైల్ లో 15 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. వెనుక భాగంలో మునుపటి మోడల్ మాదిరిగా ఉండే అదే LED టెయిల్ లైట్స్ చూడవచ్చు.
కొత్త ఆరా ఫేస్‌లిఫ్ట్ అప్డేటెడ్ డిజైన్ పొందిన అప్పటికి రియర్ ప్రొఫైల్ మాత్రం మునుపటి మోడల్ మాదిరిగానే ఉందని తెలుస్తోంది. అయితే ఈ ఫేస్‌లిఫ్టెడ్ ఆరా యొక్క బేస్ ట్రిమ్ తప్పా మిగిలిన అన్ని వేరియంట్స్ లో బూట్ లిడ్ స్పాయిలర్ ఉంటుంది. ఈ కొత్త ఆరా ఫేస్‌లిఫ్ట్ మొత్తం ఐదు ట్రిమ్స్ లో లభిస్తుంది. అవి E, S, SX, SX(O) మరియు SX+ వేరియంట్స్. ఇవన్నీ కూడా ఇప్పుడు దాని మునుపటి మోడల్ కంటే కూడా చాలా ఆధునికంగా ఉంటాయి.
ఇక ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 8.0 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. అంతే కాకుండా ఇందులో 3.5 ఇంచెస్ MID కూడా ఉంటుంది, ఇందులో రియర్ ఏసీ వెంట్స్, అడ్జస్టబుల్ రియర్ హెడ్‌రెస్ట్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు వైర్‌లెస్ ఛార్జర్ వంటివి కూడా ఉన్నాయి. టాప్ వేరియంట్స్ లో టైప్-సి ఛార్జింగ్ పోర్ట్ వంటివి కూడా ఉంటాయి.
కొత్త ఆరా ఫేస్‌లిఫ్ట్ అదే 1.2 లీటర్ ఇంజన్ పొందుతుంది. ఇది 83 హెచ్‌పి పవర్ మరియు 114 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమాటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇక CNG వెర్షన్ విషయానికి వస్తే, ఇది 69 హెచ్‌పి పవర్ మరియు 95 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది కేవలం 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే అందుబాటులో ఉంటుంది. మొత్తం మీద ఇవి రెండూ కూడా మంచి పనితీరుని అందిస్తాయి.

హ్యుందాయ్ ఆరా ఫేస్‌లిఫ్ట్ ఆధునిక డిజైన్ మరియు ఫీచర్స్ మాత్రమే కాకుండా వాహన వినియోగదారుల యొక్క భద్రత కోసం ఆధునిక సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందుతుంది. కావున ఇందులో నాలుగు ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబిడి వంటి వాటిని కలిగి ఉంటుంది. అయితే టాప్ వేరియంట్స్ లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఐసోఫిక్స్ ఎంకరేజ్‌లు, హిల్-హోల్డ్ అసిస్ట్ మరియు ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్ వంటివి కూడా అందుబాటులో ఉంటాయి.
ఇప్పటికే మంచి అమ్మకాలు పొందుతున్న హ్యుందాయ్ ఇప్పుడు ఆధునిక కార్లను కూడా విడుదల చేస్తున్న కారణంగా 2023 లో కూడా తప్పకుండా ఉత్తమ అమ్మకాలు పొందే అవకాశం ఉందని భావిస్తున్నాము. దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త హ్యుందాయ్ ఆరా ఫేస్‌లిఫ్ట్ భారతదేశంలో టాటా టిగోర్, హోండా అమేజ్ మరియు మారుతి సుజుకి డిజైర్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్' చూస్తూ ఉండండి.