రెండు 7-సీటర్‌ వేరియంట్లను లాంచ్‌ చేసిన ఫేమస్ కంపెనీ.. ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో ఈ కంపెనీయే టాప్!

ఎంజీ మోటార్ ఇండియా సరికొత్త అప్‌డేట్‌తో ముందుకు వచ్చింది. ఆ కంపెనీ నుంచి అందుబాటులో ఉన్న హెక్టార్ లైనప్స్‌ని 7 సీటర్‌ ఆప్షన్లతో తీసుకువచ్చింది. హెక్టార్ ప్లస్ సెలెక్ట్ ప్రో, స్మార్ట్ ప్రో వేరియంట్లను ఇకపై 7 సీటర్‌ ఆప్షన్‌లో కొనుగోలు చేయవచ్చు. తద్వారా భారత మార్కెట్‌లో ఈ 7 సీటర్‌ సెగ్మెంట్లోకి ఎంజీ తన సంఖ్యను పెంచుకుంటోంది. తాజా ఎంజీ అప్‌డేటెడ్‌ వేరియంట్స్‌ నేరుగా ఇన్నోవా హైక్రాస్, మారుతి ఎర్టిగా, కియా కేరెన్స్ వంటి మోడళ్లతో పోటీ పడటమే కాకుండా మార్కెట్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఇప్పటికే ఈ విభాగంలో చాలా వరకు కార్లు మంచి సక్సెస్‌ని సాధించాయి. తాజాగా విడుదల చేసిన ఈ వేరియంట్లు మంచి లాభాలను రాబట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎలక్ట్రిక్‌ విభాగంలో ఎంజీ మోటార్స్‌ సేల్స్‌లో టాప్‌లో కొనసాగుతుండటం గమనార్హం.

కంపెనీ విడుదల చేసిన ఈ 7 సీటర్‌ హెక్టార్ ప్లస్‌ సెలెక్ట్‌ ప్రో 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్ సీవీటీ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి ఉంటుంది. స్మార్ట్ ప్రో వేరియంట్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఇది 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. తాజాగా అప్‌డేట్‌ చేసిన ఈ వేరియంట్స్‌ సరసమైన ధరలో అమ్మకానికి అందుబాటులో ఉండటం గమనార్హం.

New MG Hector 7-Seater Variants Launch

ఈ రెండు వేరియంట్లలో 14 ఇంచెస్‌ HD ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 75 కి పైగా కనెక్టెడ్ కార్ ఫీచర్లతో ఐ-స్మార్ట్ టెక్నాలజీ, వైర్‌లెస్‌ ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, వైర్‌లెస్‌ స్మార్ట్‌ఫోన్‌ ఛార్జర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇంత తక్కువ ధరలో వినియోగదారులు ప్రీమియం ఫీచర్లను పొందడానికి సహాయపడుతుంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న 7 సీటర్‌ కార్లకు ఇందులోని ఫీచర్లు ఏమాత్రం తీసిపోవు.

ఈ హెక్టార్ ప్లస్ సెవెన్ సీటర్ సెలెక్ట్ ప్రో, స్మార్ట్ ప్రో వేరియంట్లలో 18 అంగుళాల డ్యూయల్ టోన్ మెషీన్‌కట్ అల్లాయ్ వీల్స్, LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ఫ్లోటింగ్ LED టర్న్ ఇండికేటర్స్, కనెక్టెడ్ LED టెయిల్ ల్యాంప్స్ ఎక్స్‌టీరియర్‌లో అదనపు ఆకర్షణను అందిస్తాయి. ఇక ఇంటీరియర్‌లోనూ ప్రీమియం సీట్ అప్హోల్‌స్టరీ, లెదర్‌తో చుట్టిన స్టీరింగ్ వీల్, వుడ్ ఫినిష్‌తో క్యాబిన్ పూర్తిగా మార్పు చేయడం మీరు గమనించవచ్చు.

New MG Hector 7-Seater Variants

7.0 ఇంచెస్‌ ఎంబెడెడ్ LCD స్క్రీన్‌తో కూడిన ఫుల్‌ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఉంది. పుష్-బటన్ ఇంజిన్ స్టార్ట్/స్టాప్ ఫంక్షన్ కారులో ఎటువంటి అవాంతరాలు లేకుండా డ్రైవర్‌ అన్ని ఫీచర్లను యాక్సెస్‌ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. అలాగే కారులోకి ప్రవేశించడానికి స్మార్ట్ కీ సౌలభ్యం మరింత కంఫర్ట్‌గా ఉంటుంది. స్మార్ట్ ప్రో వేరియంట్ సెగ్మెంట్-ఫస్ట్ డిజిటల్ బ్లూటూత్ కీ-షేరింగ్ ఫంక్షన్‌ని కూడా కలిగి ఉంది.

ఇంటీరియర్ డ్యూయల్‌-టోన్ ఆర్గిల్ బ్రౌన్, బ్లాక్ థీమ్‌తో వస్తుంది. లెథరెట్ సీటు అప్‌హోల్‌స్టరీ ఆధారిత డ్రైవర్ సీటుతో అమర్చబడింది. క్రూయిజ్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఫోర్ వీల్ డిస్క్ బ్రేక్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), ట్రాక్షన్ కంట్రోల్ (TC), హిల్ అసిస్ట్ కంట్రోల్ (HAC), ఏబీఎస్ విత్ ఈబీడీ, బ్రేక్ అసిస్ట్ (బీఏ), ఫాలో-మీ-హోమ్ హెడ్ ల్యాంప్స్, కార్నరింగ్ ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఈ కొత్త వేరియంట్ల కొనుగోలుపై కస్టమర్లు 'MG SHIELD' ప్రోగ్రామ్‌ కింద 3 +3 +3 మూడు సంవత్సరాల వారంటీ, మూడు సంవత్సరాల రోడ్‌ సైడ్‌ అసిస్టన్స్‌, మూడు లేబర్‌ ఫ్రీ సర్వీస్ అందించనుంది. ఇక సెలెక్టెడ్ ప్రో 1.5-లీటర్ సీవీటీ పెట్రోల్ వేరియంట్‌ రూ .19,71,800, స్మార్ట్ ప్రో 2.0-లీటర్ డీజిల్ మాన్యువల్ ధర రూ .20,64,800లుగా ఉంది.

More from DriveSpark

Article Published On: Thursday, November 7, 2024, 18:49 [IST]
English summary
New mg hector 7 seater variants launched check prices specifications
Read more on: #mg motor #mg hector #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+