పాత లుక్ పోయింది, వేళ్లతో కారు కంట్రోల్ చేసే టెక్నాలజీ వచ్చింది..మళ్లీ కొత్తగా పురుడు పోసుకున్న ఎంజీ హెక్టార్

జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా(JSW MG Motor India) ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో అడుగు ముందుకేస్తూ, ఆల్‌-న్యూ ఎంజీ హెక్టర్(MG Hector)ను విడుదల చేసింది. ఈ కొత్త హెక్టర్, బోల్డ్ డిజైన్, అద్భుతమైన సౌకర్యం, మోడ్రన్ టెక్నాలజీతో వచ్చింది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.11.99 లక్షలుగా నిర్ణయించారు. ఇది టాప్ మోడల్‌కు రూ.19.49 లక్షల వరకు ఉంటుంది. హెక్టర్ ప్లస్ (Hector Plus) (6, 7-సీటర్ ఆప్షన్లు) ప్రారంభ ధర రూ.17.29 లక్షలు. కొత్త ఫేస్‌లిఫ్ట్ ద్వారా ఎంజీ హెక్టర్‌కు మరింత ఫ్రెష్ లుక్ ఇచ్చారు.

కొత్త ఎంజీ హెక్టర్ ఎక్స్‌టీరియర్‌లో చాలా ముఖ్యమైన మార్పులు చేశారు. ముందు భాగంలో ఆకర్షణీయమైన ఆరా హెక్స్ గ్రిల్(Aura Hex Grille)అనే సరికొత్త హనీకాంబ్ డిజైన్ ఇచ్చారు.ఇది కారుకు మరింత దృఢమైన రూపాన్ని ఇస్తుంది. కొత్తగా రూపొందించిన బంపర్‌లు, ఆరా బోల్ట్ అలాయ్ వీల్స్ దీని లుక్‌ను మరింత స్టైలిష్‌గా మార్చాయి.

All-New MG Hector Launched in India Features i-SWIPE Gesture Control and Aura Hex Grille

కొత్త ఆరా స్కల్ప్ట్ బంపర్స్ ముందు, వెనుక భాగాలలో మరింత మస్కులర్ లుక్‌ను ఇస్తాయి. లైటింగ్ సెటప్‌లో పెద్ద మార్పు లేనప్పటికీ, స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ డిజైన్, వెనుక టెయిల్‌ల్యాంప్‌లను కలిపే LED లైట్ బార్ పాత మోడల్ మాదిరిగానే కొనసాగుతాయి. ఈ కొత్త హెక్టర్ సెలాడాన్ బ్లూ, పెర్ల్ వైట్ అనే రెండు కొత్త రంగుల్లో కూడా అందుబాటులో ఉంది.

కొత్త హెక్టర్ ఇంటీరియర్ ఇప్పుడు మరింత ప్రీమియంగా మారింది. 5-సీటర్ వేరియంట్‌కు డ్యూయల్ టోన్ ఐస్ గ్రే థీమ్, 6/7-సీటర్ వేరియంట్‌లకు డ్యూయల్ టోన్ అర్బన్ టాన్ థీమ్‌తో వచ్చింది. దీనికి హైడ్రా గ్లాస్ ఫినిష్ యాక్సెంట్స్(Hydra Gloss Finish Accents) జోడించారు. ఈ కారులో సెగ్మెంట్‌లోనే అతిపెద్ద 14-అంగుళాల హెచ్‌డీ పోర్ట్రెయిట్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. దీనికి స్మార్ట్ బూస్ట్ టెక్నాలజీ తోడై, పర్ఫామెన్స్ వేగంగా, స్మూత్‌గా ఉంటుంది.

All-New MG Hector Launched in India Features i-SWIPE Gesture Control and Aura Hex Grille

ఈ ఎస్‌యూవీలో సెగ్మెంట్‌లోకెల్లా అతిపెద్దదైన 14-అంగుళాల హెచ్‌డీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. దీనికి స్మార్ట్ బూస్ట్ టెక్నాలజీని జతచేయడం వలన సిస్టమ్ చాలా వేగంగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఇందులో i-SWIPE టచ్ గెస్చర్ కంట్రోల్ అనే కొత్త ఫీచర్ ఉంది.

ఇది రెండు వేళ్లతో స్వైప్ చేయడం ద్వారా ఏసీని, మూడు వేళ్లతో మ్యూజిక్ లేదా నావిగేషన్‌ను కంట్రోల్ చేసేందుకు వీలు కల్పిస్తుంది. అలాగే వాయిస్ కమాండ్‌లు, రిమోట్ ఏసీ కంట్రోల్, ఫుల్ డిజిటల్ క్లస్టర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

All-New MG Hector Launched in India Features i-SWIPE Gesture Control and Aura Hex Grille

6-వే పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, 8-కలర్ యాంబియంట్ లైటింగ్, హర్మాన్ ఇన్ఫినిటీ ఆడియో సిస్టమ్ ఉన్నాయి. ఎంజీ అడ్వాన్స్‌డ్ i-SMART కనెక్టెడ్ టెక్నాలజీ (70+ ఫీచర్లు), డిజిటల్ బ్లూటూత్ కీ, రిమోట్ AC కంట్రోల్ వంటివి ఇందులో ఉన్నాయి.

సేఫ్టీ విషయంలో కొత్త హెక్టర్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో వచ్చింది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ హెచ్‌డీ కెమెరా (వీల్ వ్యూతో సహా), ABS, EBD, ESP, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ హోల్డ్ కంట్రోల్ వంటి స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా లెవెల్-2 ADAS సేఫ్టీ సూట్ ఇందులో లభిస్తుంది.

మెకానికల్‌గా మార్పు లేదు. పెట్రోల్ వేరియంట్‌లో 1.5-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ (143 bhp పవర్, 250 Nm టార్క్) 6-స్పీడ్ మాన్యువల్, CVT గేర్ బాక్స్‌లతో వస్తుంది. డీజిల్ (2.0 లీటర్, 170 bhp) వెర్షన్ ధరలను వచ్చే ఏడాది (2026) ప్రకటించనున్నారు.

కొత్త హెక్టర్‌ను కొనుగోలు చేయడానికి 84 నెలల వరకు (7 సంవత్సరాలు) 100% ఆన్-రోడ్ ధర ఫైనాన్సింగ్ సదుపాయం ఉంది. యాక్సెసరీలపై కూడా 100% ఫండింగ్ సదుపాయం ఉంది. హెక్టర్ MG SHIELD అనే స్పెషల్ ఓనర్‌షిప్ ప్రోగ్రామ్‌తో వస్తుంది. ఇందులో 3+3+3 ప్యాకేజీ ఉంటుంది. మూడేళ్ల అపరిమిత కిలోమీటర్ల వారంటీ, మూడేళ్ల రోడ్‌సైడ్ అసిస్టెన్స్, మూడు లేబర్-ఫ్రీ పీరియాడిక్ సర్వీసులు లభిస్తాయి.

More from DriveSpark

Article Published On: Monday, December 15, 2025, 14:06 [IST]
English summary
All new mg hector launched in india features i swipe gesture control and aura hex grille
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+