ఒక్క ఛార్జ్‌తో 526 కిమీ జర్నీనే కాదు లైఫ్‌టైమ్ బ్యాటరీ వారంటీ కూడా..ఇది ఆఫర్ కాదు బంపర్ ఆఫర్
భారతదేశపు ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా ఇండియా (Kia India) దేశీయ ఎలక్ట్రిక్ వాహన రంగంలో సరికొత్త విప్లవానికి తెరలేపింది. మధ్యతరగతి, ప్రీమియం ఈవీ కస్టమర్లను టార్గెట్ చేస్తూ తన రెండవ మాస్-మార్కెట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కియా సైరోస్ ఈవీ (Kia Syros EV)ని న్యూఢిల్లీ వేదికగా అధికారికంగా ఆవిష్కరించింది. ఎలక్ట్రిక్ కార్లు కొనేవారిలో ఉండే ప్రధాన అనుమానాలను పటాపంచలు చేస్తూ.. అద్భుతమైన మైలేజ్ రేంజ్, అడ్వాన్సుడ్ టెక్నాలజీని, మునుపెన్నడూ లేని భరోసాతో ఈ కారును ఇండియన్ మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఈ కారుకు సంబంధించిన అధికారిక ప్రీ-బుకింగ్స్ దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి.
కొత్త కియా సైరోస్ ఈవీని సొంతం చేసుకోవాలనుకునే కస్టమర్లు కేవలం రూ.25,000 టోకెన్ అమౌంట్ చెల్లించి కియా ఇండియా అధికారిక వెబ్‌సైట్ (kia.com) ద్వారా లేదా దేశవ్యాప్తంగా ఉన్న కియా డీలర్‌షిప్‌లలో ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు.

కస్టమర్లలో ఈవీ బ్యాటరీలపై నమ్మకాన్ని పెంచేందుకు కియా సంస్థ ఈ కారుతో పాటు దేశంలోనే మొదటిసారిగా లైఫ్‌టైమ్ హై-వోల్టేజ్ బ్యాటరీ వారంటీని (Lifetime Battery Warranty) అందిస్తోంది. దీనితో పాటు కారును తిరిగి విక్రయించేటప్పుడు మంచి ధర వచ్చేలా అష్యూర్డ్ బైబ్యాక్ ప్రోగ్రామ్, కారు ప్రారంభ కొనుగోలు ఖర్చును తగ్గించేలా బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BaaS) ఫైనాన్సింగ్ ఆప్షన్లను కూడా కియా ప్రవేశపెట్టింది.
రేంజ్ పరంగా కియా సైరోస్ ఈవీ తన సెగ్మెంట్‌లోనే సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ కారును రెండు బ్యాటరీ ఆప్షన్లతో అందుబాటులోకి తెచ్చారు. ఇందులో పెద్దదైన 51.4 kWh ఎక్స్‌టెండెడ్ రేంజ్ బ్యాటరీ మోడల్.. సింగిల్ ఛార్జ్‌పై ఏకంగా 526 కిలోమీటర్ల (ARAI సర్టిఫైడ్) మైలేజీని ఇస్తుంది.

ఈ సెగ్మెంట్‌లో 500 కిలోమీటర్ల మార్కును దాటిన మొదటి కారు ఇదే కావడం విశేషం. ఇక రెండవ ఆప్షన్ అయిన 42 kWh బ్యాటరీ ప్యాక్ సింగిల్ ఛార్జ్‌పై 443 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. కేవలం మైలేజ్ మాత్రమే కాకుండా, పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చేలా ఇందులో 171 PS పవర్ అవుట్‌పుట్‌ను ఇచ్చారు. ఇది కేవలం 8.1 సెకన్లలోనే 0 నుంచి 100 కిమీ వేగాన్ని అందుకుంటుంది.
ఈవీ వాహనదారులకు ఛార్జింగ్ టెన్షన్ లేకుండా కియా సూపర్ ఫాస్ట్ డిసి ఛార్జింగ్ టెక్నాలజీని అందించింది. 100 kW డిసి ఫాస్ట్ ఛార్జర్ సహాయంతో ఈ కారు బ్యాటరీని కేవలం 39 నిమిషాల్లోనే 10 శాతం నుంచి 80 శాతానికి ఛార్జ్ చేసుకోవచ్చు.

ఛార్జింగ్ ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడానికి కియా తన మైకియా (MyKia) యాప్ ద్వారా కే-ఛార్జ్ (K-Charge) నెట్‌వర్క్‌ను అనుసంధానించింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 23 టాప్ ఛార్జింగ్ ఆపరేటర్లకు చెందిన 20,300 కంటే ఎక్కువ ఛార్జింగ్ పాయింట్లను ఒకే ఒక్క డిజిటల్ వాలెట్ ద్వారా ఆపరేట్ చేయవచ్చు మరియు బిల్ చెల్లించవచ్చు.
కియా సైరోస్ ఈవీ ఇంటీరియర్ అత్యంత విలాసవంతంగా, ఫ్యూచర్ టెక్నాలజీని ప్రతిబింబించేలా ఉంది. ఈ కారులో ఈ సెగ్మెంట్‌లోనే మొట్టమొదటిసారిగా 76.20 సెంటీమీటర్ల (30 ఇంచుల) వైడ్ ట్రినిటీ పనోరమిక్ డిస్‌ప్లే ప్యానెల్‌ను అమర్చారు. ఇందులో 12.3 ఇంచుల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 12.3 ఇంచుల టచ్‌స్క్రీన్ నావిగేషన్, 5 ఇంచుల క్లైమేట్ కంట్రోల్ ఇంటర్‌ఫేస్ కలిసి ఉంటాయి.

మ్యూజిక్ లవర్స్ కోసం 8 స్పీకర్లు గల హర్మాన్ కార్డన్ ప్రీమియం సౌండ్ సిస్టమ్, డ్యూయల్ పేన్ పనోరమిక్ సన్‌రూఫ్, 64 కలర్ యాంబియంట్ లైటింగ్, వెంటిలేటెడ్ సీట్లు, స్మార్ట్ డాష్‌క్యామ్, 95కి పైగా కనెక్టెడ్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
ప్రయాణికుల సేఫ్టీకి కియా సైరోస్ ఈవీ అత్యున్నత ప్రాధాన్యతనిచ్చింది. ఇందులో లెవెల్ 2 ADAS టెక్నాలజీని పొందుపరిచారు, ఇది 16 రకాల అత్యాధునిక అటానమస్ సేఫ్టీ ఫీచర్లతో పనిచేస్తుంది. ఇందులో ఫ్రంట్ కొలిజన్-అవాయిడెన్స్ అసిస్ట్, లేన్ కీపింగ్ అసిస్ట్, స్మార్ట్ క్రూజ్ కంట్రోల్, 360-డిగ్రీ కెమెరా వంటివి ఉన్నాయి. ఇవి కాకుండా, కియాకు చెందిన 25 స్టాండర్డ్ హై-సేఫ్టీ ఫీచర్లు అంటే.. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), హిల్-స్టార్ట్ అసిస్ట్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్, ఆల్-వీల్ డిస్క్ బ్రేక్స్ వంటి భద్రతా ప్రమాణాలను కారులోని అన్ని వేరియంట్లలోనూ డిఫాల్ట్‌గా అందించారు.


Click it and Unblock the Notifications