జిఎస్‌టి ఎఫెక్ట్: భారీగా తగ్గిన రాయల్ ఎన్ఫీల్డ్ బైకుల ధరలు

Written By:

జూలై 1, 2017 నుండి కేంద్ర అమల్లోకి తీసుకురానున్న నూతన వస్తు మరియు సేవల పన్ను (GST)ని, దేశీయ దిగ్గజ ఇకానిక్ మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ స్వాగతించింది. చెన్నై ఆధారిత టూ వీలర్ల తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ జిఎస్‌టి అమలైతే తమ ఉత్పత్తుల ధరల మీద జరిగే సవరణలను ఇప్పుడే ప్రారంభించి, ధరలను మార్చింది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
తగ్గిన రాయల్ ఎన్ఫీల్డ్ ధరలు

జిఎస్‌టి లోని ట్యాక్స్ అంశాల అధారంగా వివిధ ఉత్పత్తుల మీద టాక్స్ లెక్కించి, ధర తగ్గాల్సిన ఉత్పత్తుల ధరల్లో సవరణలు చేపట్టింది. నూతనంగా సవరణలు చేయబడిన ధరలు జూన్ 17, 2017 నుండి అమల్లోకి వచ్చినట్లు రాయల్ ఎన్పీల్డ్ పేర్కొంది.

తగ్గిన రాయల్ ఎన్ఫీల్డ్ ధరలు

రాయల్ ఎన్పీల్డ్ ఈ విశయమై ఓ ప్రకటన విడుదల చేసింది. "భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమల్లోకి తీసుకురానున్న నూతన పన్ను విధానం GST ద్వారా వ్యాపార అవకాశాలు పెరిగి, దేశ ఆర్థిక వృద్దితో పాటు భారత ప్రజలకు లాభాలను చేకూర్చే విధంగా ఉందని మేము నమ్ముతున్నాము."అని ప్రకటనలో పేర్కొంది.

తగ్గిన రాయల్ ఎన్ఫీల్డ్ ధరలు

జిఎస్‌టి అమలయితే కస్టమర్లకు అందే ప్రతి ఫలాలను ఇప్పటి నుండి అందివ్వాలని భావించి ధరల సవరణ చేపట్టి, తమ మోటార్ సైకిళ్ల ఆన్ రోడ్ ధరను భారీ మేర తగ్గించిందని రాయల్ ఎన్పీల్డ్ ప్రకటించింది.

తగ్గిన రాయల్ ఎన్ఫీల్డ్ ధరలు

డిజైన్ మరియు ఇంజన్ పర్ఫామెన్స్ లక్షణాలు ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ ఉత్పత్తులకు ఇండియన్ పట్టం కట్టిన సంగతి తెలిసిందే. కస్టమర్ల సంతృప్తిని చేజిక్కించుకునే లక్ష్యంతో రాయల్ ఎన్ఫీల్డ్ జిఎస్‌టి అమలు కావడానికి ముందే తమ బైకుల మీద ధరలు తగ్గించింది.

తగ్గిన రాయల్ ఎన్ఫీల్డ్ ధరలు

ప్రస్తుతం ఉన్న ట్యాక్స్ విధానం ప్రకారం, రాయల్ ఎన్ఫీల్డ్ 30 శాతం ట్యాక్స్ ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. నూతన పన్ను విధానం అమలైతే 28 శాతానికి దిగిరానుంది. రెండు శాతం మేర పన్ను తగ్గనుండటంతో దానికి సమానమైన ధరను తమ మోటార్ సైకిళ్ల మీద తగ్గించింది రాయల్ ఎన్ఫీల్డ్.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

దేశవ్యాప్తంగా రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిళ్లకు మంచి డిమాండ్ ఉంది. ధరలు పెరిగినా... తగ్గినా వీటి విక్రయాలకు ఎలాంటి ఢోకా లేదు. ఏదేమయినప్పటికీ ధరలు తగ్గడం, కొనుగోలుదారులకు కాస్త ఉపశమనే చెప్పాలి. ధరల గురించి పూర్తి వివరాల కోసం సమీప రాయల్ ఎన్ఫీల్డ్ డీలర్‌ను సంప్రదించగలరు...

English summary
Read In Telugu Royal Enfield Motorcycle Prices To Be Revised
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark